మద్యo మత్తులో అధికార పార్టీ కౌన్సిలర్ హంగామా-పోలీసులను, పార్టీని తిడుతూ వీరంగం
జగిత్యాల పట్టణ కౌన్సిలర్ గంగమల్లు మద్యం మత్తులో హల్చల్ చేశారు. ఓ పార్టీకి అటెండ్ అయి తిరిగి ఇంటికి వెళ్తున్న క్రమంలో అక్కడ డ్యూటీ చేస్తున్న పోలీసు సిబ్బందితో వాగ్వాదానికి దిగారు.
ఆయన అధికార పార్టీ కౌన్సిలర్. బాధ్యతగా ఉండాల్సిన ఆ నేత అర్ధరాత్రి ఫూటుగా మందు తాగారు. అలా ఇంటికి వెళ్తున్న క్రమంలో పోలీసుల చెకింగ్ మొదలైంది. అసలే తాను అధికార పార్టీ నాయకున్ని ఎవరేం చేస్తారనీ అనుకున్నాడో ఏమో... బ్రీత్ అనలైజర్ టెస్టులు చేస్తున్న వారి డ్యూటీకి ఆటంకం కలిగించారు. అంతటితో ఆగకుండా రోడ్డుపైన రచ్చ రచ్చ చేశారు.
జగిత్యాల పట్టణంలోని 32వ వార్డుకు చెందిన కౌన్సిలర్ గంగమల్లు మద్యం మత్తులో హల్చల్ చేశారు. ఓ పార్టీకి అటెండ్ అయి తిరిగి ఇంటికి వెళ్తున్న క్రమంలో అక్కడ డ్యూటీ చేస్తున్న పోలీసు సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. తాను ఒక అధికార పార్టీ నేతనని తనని ఎవరు ఏమి చేయలేరు అంటూ హంగామా చేశారు.
కాసేపు మౌనంగా ఉన్న పోలీసులు... అసభ్య పదజాలంతో గంగమల్లు దూషించడంతో పోలీసులు కూడా సహనం కోల్పోయారు. సిబ్బంది ఎదురు తిరిగారు. అతని కథంతా వీడియోలో రికార్డు అవుతోందంటూ హెచ్చరించారు. అంతే సదరు నేత వెంటనే తాను అసలు ఎలాంటి అసభ్య పదజాలం వాడలేదని. తనకు పోలీసులు అంటే గౌరవం ఉందంటూ మాట మార్చారు. అంతేకాకుండా తాను ఒక ప్రజా సేవకున్ని అని పోలీసులు మాత్రం జీతగాళ్లు అంటూ కామెంట్ చేశారు.
అప్పటికే అతని తీరుతో విసుగు చెందిన పోలీసు సిబ్బంది.. ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. తన హోదా చూపించాలని అనుకున్నారో ఏమో ఆ ప్రాంత సిఐతో ఫోన్లో మాట్లాడానని చెప్పారు గంగమల్లు. ఇక తన పప్పులు ఉడకవని భావించిన గంగ మల్లు తిరిగి సొంత పార్టీని... ఆ పార్టీ నాయకులపై కామెంట్లు చేయడం ప్రారంభించారు. తమ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కి ఒక దండం... ఎమ్మెల్సీ కవితక్కకు ఒక దండం అంటూ .. తాను ఒక వేస్ట్ లీడర్ అని... తమ పార్టీ వేస్ట్ పార్టీ అంటూ ఫ్రస్టేట్ అయ్యారరు...
పోలీసులు ప్రతిపక్షాలకు సపోర్ట్ చేస్తున్నారంటూ కామెంట్స్...
అంతటితో ఆగని సదరు కౌన్సిలర్ పోలీసులు కేంద్రంలో ఉన్న బిజెపికి మరోవైపు తమకు వ్యతిరేకంగా కార్యక్రమాలు చేస్తున్న కాంగ్రెస్‌కి మద్దతు పలుకుతున్నారంటూ విమర్శించారు. ఇదంతా నియంత పరిపాలన అంటూ రోడ్డుపైనే అరవసాగారు. ఇక సదరు కౌన్సిలర్ వెంట వచ్చిన మరో యువకుడు తాను ఒక ఎడ్యుకేట్డ్ పర్సన్ అని... తాను పోలీసు సిబ్బందిని ఉద్దేశించి ఎలాంటి బూతు మాటలు మాట్లాడలేదంటూ వివరణ ఇచ్చుకున్నాడు. అయితే మొదటి నుంచి వీరి ప్రవర్తనని వీడియోలో రికార్డ్ చేసిన పోలీసులు తమ ఉన్నతాధికారులకు దీనిపై సమాచారం అందించినట్లుగా తెలుస్తోంది.
డ్యూటీ ఎలా చేసేది అంటున్న కింది స్థాయి సిబ్బంది...
తమ డ్యూటీ తాము చేస్తుంటే అడ్డుకోవడమే కాకుండా అసభ్య పదజాలం వాడుతూ కామెంట్లు చేయడం ఎంతవరకు సమంజసం అని కిందిస్థాయి సిబ్బంది వాపోతున్నారు. కొందరు చోటా లీడర్ల ఆగడాలు వారి వెంట తిరిగి వారితో మాటలు పడాల్సిన అగత్యం తమకు లేదని ఇలా అడ్డుకుంటే తాము డ్యూటీ ఎలా చేస్తామంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.