Peddapalli ZP Chairman: పుట్ట మధు నుంచి ప్రాణహాని ! వామనరావుకి పట్టినగతేనని వార్నింగ్ ఇచ్చారన్న మహిళా ఎంపీపీ!
Peddapalli ZP Chairman Putta Madhu: పెద్దపల్లి జడ్పీ ఛైర్మన్ పుట్ట మధు నుంచి, పుదారి సత్యనారాయణల నుంచి తమ కుటుంబానికి ప్రాణహాని ఉందని తమను కాపాడాలంటూ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ కు విజ్ఞప్తి చేశారు.
Peddapalli ZP Chairman Putta Madhukar: ఇప్పటికే ఓ లాయర్ హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న పెద్దపల్లి జడ్పీ ఛైర్మన్ పుట్ట మధుపై సొంత పార్టీకి చెందిన ఓ మహిళా ఎంపీపీ తీవ్ర ఆరోపణలు చేశారు. పుట్ట మధు నుంచి, పుదారి సత్యనారాయణల నుంచి తమ కుటుంబానికి ప్రాణహాని ఉందని తమను కాపాడాలంటూ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ కు విజ్ఞప్తి చేశారు. రామగిరి మండలం ఎంపిపి ఐనా ఆరెల్లి దేవక్క - కొమురయ్య అను మాకు పుట్ట మధు, పుదారి సత్యనారాయణల నుంచి ప్రాణ హాని ఉందని వారి నుంచి తమను కాపాడాలని కోరారు.
‘నేను, నా భర్త బీఆర్ఎస్ పార్టీ (టీఆర్ఎస్)లో గత పది హేను సంవత్సరాలుగా ముఖ్యమంత్రి కేసీర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అడుగు జాడల్లో నడుస్తూ పార్టీ కోసం, ప్రజల కోసం ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ ప్రజాసేవ చేస్తున్నాం అన్నారు రామగిరి మండలం ఎంపిపి ఐనా ఆరెల్లి దేవక్క. ఎంపీపీ అయ్యినప్పటి నుండి మమ్మల్ని ఇక్కడ ఓడిపోయినా ఎంపీటీసీ పుదారి సత్యనారాయణ, ఇక్కడ నియోజక వర్గ ఇంఛార్జి అనుచరులు నానా రకాలుగా ఇబ్బందికి గురిచేస్తున్నారని’ ఎంపీపీ ఆరెల్లి దేవక్క ఆరోపించారు.
నియోజకవర్గ బీఆర్ఎస్ ఇంఛార్జి పుట్ట మధు ఆదేశాల ప్రకారం కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన వైస్ ఎంపీపీకి నా ఎంపీపీ కోసం పది లక్షలు ఇవ్వమన్నారని తెలిపారు. తనకు ఉన్న పొలం అమ్ముకొని మరి ఇంఛార్జి పుట్ట మధు ఆదేశాలతో వారికి డబ్బులు ఇచ్చాం. అప్పటినుండి ఇక్కడ ఓడిపోయినా ఎంపీటీసీ పుదారి సత్యనారాయణ ఇతర ఎంపీటీసీలకు తన మీదకి ఉసిగొల్పి డబ్బులు ఇవ్వమని గొడవ పెట్టించి, చివరికి తనతో బ్లాంక్ చెక్ ఇప్పించారని ఆమె ఆరోపించారు. తాను ఎంపీపీ అయ్యినప్పటి నుండి తమ భార్యాభర్తల మీద కక్ష కట్టి మాకు ప్రజాసేవ చేయడానికి అధికారుల సహకారం లేకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
రామగిరి మండలం మొత్తం తన అనుచరుడు సత్యనారాయణ గుప్పిట్లో పెట్టుకొని అధికారులను భయబ్రాంతులకు గురిచేసి మా మీదకి ఉసిగొల్పి మా కోసమే కొత్త కొత్త జీఓలు అమలుచేశారని ఆరోపించారు. మా పార్టీలోని మిగతా ఎంపీటీసీలను బెదిరించి తనపై చెక్ బౌన్స్ కేసు ఫిర్యాదు చేయించారని తెలిపారు. మహిళా ఎంపీపీ అని చూడకుండా సోషల్ మీడియా లో , తన ఆస్థాన పత్రిక లో బూతు రాతలు , సొంత పార్టీ వల్లే ,మహిళలే తలదించుకునే రాతలు రాసారు . ఇంచార్జి ముందే మీ మీద భౌతిక దాడులకు కూడా ఉసిగొల్పారు ... ఇదే ఇంచార్జికి ఇంతక ముందు చెప్తే మాట్లాడుతా మాట్లాడుతా అంటాడు కానీ వాళ్ళను మా మీదకు ఏదో మనసులో పెట్టుకొని మమ్మల్ని మహిళా అని చూడకుండా , సొంత పార్టీ అని చూడకుండా కక్ష సాధింపులకి గురి చేస్తూనే ఉన్నారు .
మాట్లాడదాం అని పిలిచి బూతులు తిట్టారంటూ ఆవేదన
ఈ చెక్ బౌన్స్ కేసుపై జడ్పీ ఆఫీస్ లో మాట్లాడుదాం అని పుట్ట మధు పిలిస్తే వెళ్లగా.. ఒక మహిళా ఎంపీపీ అని చూడకుండా ఇష్టం వచ్చినట్లు ఎవరికి చెప్పుకోలేని రీతిలో బూతులు తిట్టారని ఎంపీపీ ఆరెల్లి దేవక్క ఆవేదన వ్యక్తం చేశారు. నీకు కార్ ఎందుకు, తినడానికి దిక్కు లేదు, ఇవ్వన్నీ ఎందుకంటూ పరుష పదజాలం వాడారని తెలిపారు. నీకు చెల్లెలు లాంటి దాన్ని, మాపై బూతులు మాట్లాడుతారా ? మహిళా చైతన్యం అంటే ఇదేనా ? బహుజన వాదం అంటే ఇదేనా.. మహిళ అని చూడకుండా కేసులు బనాయించి జైలుకి పంపుతారా అన్న అని ప్రశ్నించినటల్లు చెప్పారు.
లాయర్ వామనరావుకి పట్టిన గతే అంటూ వార్నింగ్!
మాకు ఎదురు తిరిగితే లాయర్ వామన్ రావు దంపతులకి పట్టిన గతే మీకు పడుతది, నా సొంత అల్లుడిని జైలుకి పంపాను. మీరు వాడికంటే గొప్పనా ? నాకు అడ్డువస్తే ఎవడికైనా అదే గతి పడుతది అని బెదిరించారని సంచలన ఆరోపణలు చేశారు. పోలీసులు తనవాళ్లు అని తాను చెప్పినట్లు వింటారు కానీ, మీరు చెప్పినట్లు వినరని.. చూశావా తాను, పుదారి సత్తి ఎలా తప్పించుకున్నామో అని పుట్టమధు వ్యాఖ్యానించారని తెలిపారు. జైలులో ఉన్నవాళ్లు కూడా బయటకు రాని, మళ్లీ పుట్ట మధు అంటే ఏంటో చూపిస్తా , ఈ సారి శవాలు కూడా దొరుకవ్. కేసీఆర్, కేటీఆర్ ఏమీ చేయలేరు. మీకు దిక్కున్న చోట చెప్పుకోండంటూ వార్నింగ్ ఇచ్చారని మహిళా ఎంపీపీ తెలిపారు. నీ కొడుకును జేఎన్‌టీయూ నుండి జాబ్ పీకేస్తాం, నీకు తినడానికి తిండిలేకుండా చేస్తా అని బెదిరించి సమావేశం నుంచి బయటకి గెంటి వేశారంటూ పుట్ట మధుపై ఎంపీపీ ఆరెల్లి దేవక్క సంచలన ఆరోపణలు చేశారు.
మా కుటుంబానికి ప్రాణహాని..
మాకు, మా కుటుంబానికి మంథని నియోజకవర్గ బీఆర్ఎస్ ఇంఛార్జి పుట్ట మధు కుటుంబం నుంచి, నాగేపల్లికి చెందిన పుదారి సత్య నారాయణ నుంచి ప్రాణహాని ఉందని మహిళా ఎంపీపీ ఆరోపించారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ గారు తమను పుట్ట మధు, పుదారి సత్య నారాయణ నుంచి కాపాడాలని వేడుకుంటున్నాం అంటూ రామగిరి మండల ఎంపీపీ ఆరెల్లి దేవక్క - కొమురయ్యలు విజ్ఞప్తి చేశారు.