News
News
X

అధికార పార్టీ నేతలు వేధిస్తున్నారు- ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆగ్రహం

హుజురాబాద్‌లో ఉన్న ప్రశాంత వాతావరణాన్ని అధికారపక్ష నేతలు చెడగొడుతున్నారు అనీ ఆరోపించారు ఈటల. ప్రజల మీద దాడులు చేస్తున్నారన్నారు.

FOLLOW US: 
Share:

అధికారం అడ్డం పెట్టుకొని తెలంగాణలో బీఆర్‌ఎస్‌ నాయకులు తమ పార్టీ లీడర్లను, కార్యకర్తలను వేధిస్తున్నారని బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేంద్ర ఆరోపించారు. గతంలో హుజురాబాద్ ఎన్నికల సందర్భంగా ఎన్ని ప్రయత్నాలు చేసినా తన గెలుపును అడ్డుకోలేకపోయారని ఒకానొక సమయంలో అధికార పార్టీ బలగం మొత్తం దించినా ఫలితం లేకుండా పోయిందని దీన్ని దృష్టిలో ఉంచుకుని అధికార పార్టీ ఆగడాలు ఎక్కువయ్యాయని గతంలోని పలుమార్లు ఈటెల ఆరోపించారు.

హుజురాబాద్‌లో ఉన్న ప్రశాంత వాతావరణాన్ని అధికారపక్ష నేతలు చెడగొడుతున్నారు అనీ ఆరోపించారు ఈటల. ప్రజల మీద దాడులు చేస్తున్నారన్నారు. బీజేపీ కార్యకర్తలను అకారణంగా కొడుతున్నారనీ విమర్శించారు. నిన్న తమ మీదనే దాడి చేస్తే.. దాడి చేసిన వారిని వదిలిపెట్టి.. మళ్లీ బీజేపీ నేతలు, కార్యకర్తలను టాస్క్ ఫోర్స్ పోలీసులు తీసుకొని వెళ్లి విపరీతంగా కొడుతున్నారనీ ఆగ్రహం వ్యక్తం చేశారు. 
ఈ అరాచకం ఎక్కువ రోజులు చెల్లదు అని అధికారపక్షం ఆగడాలు శృతిమించాయన్నారు ఈటల. పోలీసులు అధికారపక్షం తొత్తులుగా మారారా? టాస్క్ ఫోర్స్ పోలీసులు తీసుకుపోవలసిన అవసరం ఏంది ? కొట్టడం ఏంటి? చట్టం పనిచేస్తుందా అంటూ డీజీపీని ప్రశ్నించారు. తన నియోజకవర్గానికి చెందిన మాట్ల రమేష్, మాట్ల కళ్యాణ్, పంగిడిపల్లి సర్పంచ్ శ్రీనివాస్, పిల్లి సతీష్,తుమ్మ శోభన్‌ను వెంటనే విడుదల చేయాలనీ డిమాండ్ చేశారు ఈటల.

ఈ మధ్య మళ్లీ పెరిగిన రాజకీయ వేడి...

హుజురాబాద్ కేంద్రంగా ఈ మధ్య రాజకీయంగా ఎన్నికల సమయంలో ఉండే వాతావరణం కనిపిస్తోంది. ఐటీ పురపాలక శాఖ మంత్రి ఈ నియోజకవర్గంలో పర్యటన జరిపిన తరువాత పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన ఈటల రాజేందర్‌ని మాత్రం ఆహ్వానించలేదు. మరోవైపు ఈటలన్ని టార్గెట్ చేస్తూ తన ప్రసంగాల్లో గట్టిగానే ప్రశ్నించారు కేటీఆర్. వచ్చే ఎన్నికల్లో అయినా ఈ నియోజకవర్గంలో గెలుపు సొంతం చేసుకోవాలని ఇప్పటి నుంచి దూకుడు పెంచారు స్థానిక నాయకులు. ఇందులో భాగంగానే ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

Published at : 06 Feb 2023 09:53 AM (IST) Tags: BJP huzurabad Eatala Rajender BRS

సంబంధిత కథనాలు

1442 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల మెరిట్‌ జాబితా విడుదల, అభ్యంతరాలకు అవకాశం!

1442 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల మెరిట్‌ జాబితా విడుదల, అభ్యంతరాలకు అవకాశం!

TSLPRB Exam: కానిస్టేబుల్‌ టెక్నికల్ ఎగ్జామ్ హాల్‌టికెట్లు విడుదల, పరీక్ష ఎప్పుడంటే?

TSLPRB Exam: కానిస్టేబుల్‌ టెక్నికల్ ఎగ్జామ్ హాల్‌టికెట్లు విడుదల, పరీక్ష ఎప్పుడంటే?

TSPSC Exam Postpone: పేపర్ల లీకుల ఎఫెక్ట్ - హార్టికల్చర్ ఆఫీసర్ పరీక్ష వాయిదా, కొత్త తేదీ ప్రకటించిన టీఎస్ పీఎస్సీ

TSPSC Exam Postpone: పేపర్ల లీకుల ఎఫెక్ట్ - హార్టికల్చర్ ఆఫీసర్ పరీక్ష వాయిదా, కొత్త తేదీ ప్రకటించిన టీఎస్ పీఎస్సీ

TSPSC Paper Leak: 'గ్రూప్‌-1' మెయిన్స్‌ పేపర్ కూడా లీకయ్యేదా? బయటపడుతున్న కుట్రలు!

TSPSC Paper Leak: 'గ్రూప్‌-1' మెయిన్స్‌ పేపర్ కూడా లీకయ్యేదా? బయటపడుతున్న కుట్రలు!

TSPSC: బండి సంజయ్, రేవంత్ కి మంత్రి కేటీఆర్ లీగల్ నోటీసులు - రూ.100 కోట్ల పరువునష్టం దావా

TSPSC: బండి సంజయ్, రేవంత్ కి మంత్రి కేటీఆర్ లీగల్ నోటీసులు - రూ.100 కోట్ల పరువునష్టం దావా

టాప్ స్టోరీస్

Jagan G 20: ప్రతి ఒక్కరికీ ఇల్లు కల్పించాలన్నది మా ఉద్దేశం - విశాఖ జి-20 సదస్సులో సీఎం జగన్

Jagan G 20: ప్రతి ఒక్కరికీ ఇల్లు కల్పించాలన్నది మా ఉద్దేశం -  విశాఖ జి-20 సదస్సులో సీఎం జగన్

Taapsee Pannu: నటి తాప్సి పన్నుపై కేసు నమోదు - హిందువుల మనోభావాలు దెబ్బతీసిందని ఫిర్యాదు

Taapsee Pannu: నటి తాప్సి పన్నుపై కేసు నమోదు - హిందువుల మనోభావాలు దెబ్బతీసిందని ఫిర్యాదు

TDP Manifesto : ప్రతి పేదవాడి జీవితం మారేలా మేనిఫెస్టో, కసరత్తు ప్రారంభించిన టీడీపీ!

TDP Manifesto : ప్రతి పేదవాడి జీవితం మారేలా మేనిఫెస్టో, కసరత్తు ప్రారంభించిన టీడీపీ!

KTR On Amaravati : అమరావతిలో పనులు జరగడం లేదన్న కేటీఆర్ - ఎందుకన్నారో తెలుసా ?

KTR On Amaravati :   అమరావతిలో పనులు జరగడం లేదన్న కేటీఆర్ - ఎందుకన్నారో తెలుసా ?