News
News
X

Medak Crime News: మూగ యువతిని కిడ్నాప్ చేసి సామూహిక ఆత్యాచారం, గ్రామంలోని కొందరి యువకులపై అనుమానం?

Medak Crime News: మెదక్ జిల్లాలో ఓ 23 ఏళ్ల మూగ యువతిని బలవంతంగా కారులో తీసుకెళ్లారు. ఆపై నిర్మానుష్య ప్రాంతంలో సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. 

FOLLOW US: 
Share:

Medak Crime News: మాటలు రాని ఓ మూగ యువతిపై పలువురు అత్యాచారం చేశారు. ఈ ఘటన మెదక్ జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాకు చెందిన ఓ 23 మూడేళ్ల మూగ యువతిని కొందరు దండుగలు కారులో బలంవంతంగా తీసుకెల్లి కిడ్నాప్ చేశారు. ఆపై సామూహిక అత్యాచారనికి పాల్పడ్డారు. ఆ తర్వాత సదరు యువతిని అక్కడి వదిలేసి పారిపోయారు. 

అసలేం జరిగిందంటే..?

మెదక్ జిల్లా మద్దూరు మండలం లడ్నూరు గ్రామంలో ఓ 23 మూడేళ్ల మూగ యువతిని కిడ్నాప్ చేసి దుండగలు సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులకు తెలిపారు. గత రాత్రి ఇంటి బయట ఉన్న సదరు యువతిని ఓ కారులో బలంతంగా ఎక్కించుకొని వెళ్లిన కొందరు యువకులు గ్రామ శివారులో అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలిసింది. ఆపై యువతిని అక్కడే వదిలేసి పారిపోతుండగా... బాధిత యువతి తండ్రి ఆ కారును వెంబడించారు. చాలా దూరం వెళ్లి కారును పట్టుకోగా... ఆకునూరు గ్రామానికి చెందిన కనకస్వామి, నరేష్ కారులో ఉన్నట్లు బాధిత యువతి తండ్రి పోలీసులకు వివరించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.   

ఈ ఘటన స్థానికంగా తీవ్రం చర్చనీయాంశమైంది. అనుమానితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. వారికి సన్నిహితంగా ఉన్న వాళ్లను పిలిచి విచారిస్తున్నారు. 

నెల రోజుల క్రితం బాబాయ్ లే బాలికపై అత్యాచారం

కామంతో కళ్లు మూసుకుపోయిన ఓ మృగం వరసకు కూతురు అయ్యే చిన్నారిపై లైంగిక దాడి చేశాడు. మరో ఇద్దరు కూడా బాలికపై దారుణానికి పాల్పడ్డారు. ఆ తర్వాత అత్యంత దారుణంగా హత్యచేశారు. మహబూబ్ నగర్ జిల్లాలో జరిగి ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం అయింది. మహబూబ్‌నగర్ జిల్లా బాలానగర్ మండలంలోని ఓ గ్రామంలో పదో తరగతి బాలికపై సొంత బాబాయ్ మరో ఇద్దరితో కలిసి సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆ తర్వాత బాలికను హత్య చేశారు. బాలిక తల్లిదండ్రులు ఉపాధి కోసం హైదరాబాద్‌ కు వెళ్లడంతో బాలిక ఇంట్లో ఒంటరిగా ఉంది. దీంతో బాలికపై కన్నేసిన బాబాయ్ శ్రీనివాస్ తన స్నేహితులతో కలిసి బాలికపై దారుణానికి పాల్పడ్డాడు. బాలిక ప్రతిఘటించడంతో హత్య చేసి పరారయ్యారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  

గ్రామంలో ఉద్రిక్తత

వారంతా వరుసకు బాబాయ్‌లు, అయినా ఆ చిన్నారిని వదల్లేదు. చిన్నారిపై దారుణానికి పాల్పడేందుకు సమయం కోసం ఎదురు చూశారు. బాబాయ్‌ అంటూ వచ్చిన ఆ చిన్నారిని ఎత్తుకెళ్లి అత్యాచారం చేశారు. తమ కోరిక తీర్చుకుని అతి కిరాతకంగా హత్య చేశారు. వరుసకు బాబాయ్‌ లు అయినా ఇంత కిరాతకానికి ఒడిగట్టడం, ఆ తర్వాత విషయం బయటచెబుతుందని చిన్నారిని హత్య చేశారు. ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుందని గ్రామస్థులను నమ్మించేందుకు ప్రయత్నించారు. దీంతో గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. ఆగ్రహంతో గ్రామస్తులు నిందితుల ఇంటిపై దాడి చేశారు. వారి వాహనాలు, ఇంట్లో సామాగ్రికి నిప్పుపెట్టారు. 

Published at : 28 Dec 2022 12:47 PM (IST) Tags: Medak Crime News girl molested Woman Rape Case Telangana Crime News Telangana Latest Rape Case

సంబంధిత కథనాలు

తెలంగాణలోని ఆ ఏడు జిల్లాలకు మాత్రం ఆరెంజ్‌ అలెర్ట్‌!

తెలంగాణలోని ఆ ఏడు జిల్లాలకు మాత్రం ఆరెంజ్‌ అలెర్ట్‌!

వర్ధన్నపేటలో వైఎస్ షర్మిల ఫ్లెక్సీలు చింపేసిన బీఆర్ఎస్ కార్యకర్తలు

వర్ధన్నపేటలో వైఎస్ షర్మిల ఫ్లెక్సీలు చింపేసిన బీఆర్ఎస్ కార్యకర్తలు

Telangana Budget 2023: అభివృద్ధిలో దేశానికే ఆదర్శం నా తెలంగాణ- బడ్జెట్ ప్రసంగంలో గవర్నర్‌ తమిళిసై

Telangana Budget 2023: అభివృద్ధిలో దేశానికే ఆదర్శం నా తెలంగాణ- బడ్జెట్ ప్రసంగంలో గవర్నర్‌ తమిళిసై

BRS Vs BJP: కరీంనగర్ ఎంపీ బండి సంజయ్, ఖర్మరా బాబూ అంటున్న మంత్రి కేటీఆర్

BRS Vs BJP: కరీంనగర్ ఎంపీ బండి సంజయ్,  ఖర్మరా బాబూ అంటున్న మంత్రి కేటీఆర్

Karimnagar News: వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో జడ్పీ సీఈఓ గానం

Karimnagar News: వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో జడ్పీ సీఈఓ గానం

టాప్ స్టోరీస్

Demand For TDP Tickets : టీడీపీ టిక్కెట్ల కోసం ఫుల్ డిమాండ్ - యువనేతలు, సీనియర్ల మధ్య పోటీ !

Demand For TDP Tickets :  టీడీపీ టిక్కెట్ల కోసం ఫుల్ డిమాండ్ - యువనేతలు, సీనియర్ల మధ్య పోటీ !

Pawan Kalyan Latest Stills : 'హరి హర వీర మల్లు' సెట్స్‌లో పవన్ కళ్యాణ్ నవ్వులు చూశారా?

Pawan Kalyan Latest Stills : 'హరి హర వీర మల్లు' సెట్స్‌లో పవన్ కళ్యాణ్ నవ్వులు చూశారా?

Leo Movie Shooting: దళపతి ‘లియో’లో ఏజెంట్ టీనా కీలక పాత్ర, చిత్ర బృందంతో స్పెషల్ ఫ్లైట్ లో కశ్మీర్ కు పయనం!

Leo Movie Shooting: దళపతి ‘లియో’లో ఏజెంట్ టీనా కీలక పాత్ర, చిత్ర బృందంతో స్పెషల్ ఫ్లైట్ లో కశ్మీర్ కు పయనం!

Butta Bomma Movie Review - 'బుట్ట బొమ్మ' రివ్యూ : మలయాళ హిట్ 'కప్పేలా' తెలుగు రీమేక్ ఎలా ఉందంటే?

Butta Bomma Movie Review - 'బుట్ట బొమ్మ' రివ్యూ : మలయాళ హిట్ 'కప్పేలా' తెలుగు రీమేక్ ఎలా ఉందంటే?