By: ABP Desam | Updated at : 20 Dec 2022 06:00 PM (IST)
బండి సంజయ్‌కి మంత్రి కేటీఆర్ కౌంటర్
TS Minister KTR Strong Counter to MP Bandi Sanjay: బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కి తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. డ్రగ్స్ టెస్టు కోసం రక్తం మాత్రమే కాదు, కిడ్నీ కూడా ఇస్తానన్నారు కేటీఆర్. ఈ కేసులో క్లీన్ చిట్‌తో బయటకు వస్తానన్నారు. అయితే కరీంనగర్ చౌరస్తాలో బండి సంజయ్ తన చెప్పుతో తానే కొట్టుకుంటా అని కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో పలుమార్లు కేటీఆర్ డ్రగ్స్ తీసుకున్నారని, టెస్టులు నిర్వహించాలని బండి సంజయ్ పలుమార్లు డిమాండ్ చేశారు. అందుకు కౌంటర్ ఇచ్చిన కేటీఆర్.. నా బొచ్చు కావాలంటే బొచ్చు ఇస్త, రక్తంతో పాటు కిడ్నీ కూడా ఇస్తానని డ్రగ్స్ తో పాటు ఏ టెస్టులు చేయిస్తాడో చేయించుకో అన్నారు.
డ్రగ్స్ టెస్టుకు నేను రెడీ.. చెప్పు దెబ్బలకు సంజయ్ సిద్ధమా ?
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బండి సంజయ్ చేసే డ్రగ్స్ ఆరోపణలపై మంత్రి కేటీఆర్‌ను ప్రశ్నించారు. డ్రగ్స్ టెస్టుకు ఏ శాంపిల్స్ కావాలంటే అది ఇచ్చేందుకు తాను సిద్ధమన్నారు మంత్రి కేటీఆర్. డ్రగ్స్ టెస్టుల్లో తాను క్లీన్ చిట్ తో బయటకు వస్తానని ధీమా వ్యక్తం చేశారు. తనకు డ్రగ్స్ టెస్టులో క్లీన్ చిట్ వస్తే కరీంనగర్ కమాన్ సెంటర్ వద్ద చెప్పు దెబ్బలు తినేందుకు బండి సంజయ్ సిద్ధమేనా అంటూ సవాల్ విసిరారు. డ్రగ్స్ టెస్టు కోసం తన బొచ్చు (తల వెంట్రుకలు) రక్తం ఏదైనా ఇచ్చేందుకు తాను సిద్ధమన్నారు. తాను ఇక్కడే ఉంటానని, బండి సంజయ్ ఏ డాక్టర్ ను తీసుకొస్తాడో తీసుకువచ్చి చర్మం తీసుకుపోతాడా, వెంట్రుకలు, రక్తం ఏది కావాలంటే అదితీసుకోవాలంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అవసరమైతే టెస్టుల కోసం కిడ్నీ కూడా ఇస్తానని.. బండి సంజయ్ మాత్రం చెప్పు దెబ్బలకు సిద్ధంగా ఉంటేనే శాంపిల్స్ తీసుకునేందుకు డాక్టర్ ను తీసుకురావాలని సవాల్ విసిరారు.
బండి సంజయ్‌కు తెలివుందా ! గుజరాతీలకు సలామ్ కొట్టాలంట !
కరీంనగర్ ఎంపీగా ఉన్నాడు, ఈ ప్రజలకు ఏం చేశారో చెప్పాలని అడుగుతుంటే చెప్పడానికి చేతనైత లేదు అంటూ కేటీఆర్ వ్యాఖ్యానించారు. బండి సంజయ్ కి తెలివి ఉందా, అసలు మనిషేనా, ప్రజలకు ఏం చేశారో చెప్పమని అడిగితే పనికిమాలిన కూతలు, ఆరోపణలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. కరీంనగర్ ప్రజలకు ఏం చేయలేదు కనుక అరుపులు, పెడబొబ్బలు పెడుతుండు అని కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇద్దరు గుజరాత్ వ్యక్తులకు దేశం మొత్తం సలామ్ కొట్టాలంట. వారికి గులాంగిరి చేసే బండి సంజయ్ లాంటి నేతలను తెలంగాణ ప్రజలకు నమ్మే అవకాశమే లేదన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ఎదిగిన తీరు దేశానికి ఆదర్శంగా నిలుస్తుందన్నారు. కానీ బండి సంజయ్ లాంటి నేతలు ఇంకా ఆ ఇద్దరు నేతలకు చెప్పులు తొడుగుతూ కాలం వెల్లదీస్తున్నారని మంత్రి కేటీఆర్ మండిపడ్డారు.
మంత్రి కేటీఆర్ డ్రగ్స్ తీసుకుంటారని, తెలంగాణ కాంగ్రెస్ నేతలతో పాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సైతం పలుమార్లు ఆరోపించారు. హైదరాబాద్ డ్రగ్స్, టాలీవుడ్ డ్రగ్స్ కేసులో కేటీఆర్ శాంపిల్స్ తీసుకుని పరీక్షిస్తే దొరికిపోతారని సైతం బండి సంజయ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో మంగళవారం సిరిసిల్ల జిల్లా కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు బదులిస్తూనే బండి సంజయ్‌కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. శాంపిల్స్ ఏం కావాలన్నా ఇస్తానని, ఏ డాక్టర్‌ను తెచ్చుకుంటావో తెచ్చుకో.. నాకు క్లీన్ చిట్ వస్తే కరీంనగర్ కమాన్ వద్ద చెప్పు తినేందుకు సిద్ధమంటే రావాలని సవాల్ విసిరారు.
Karimnagar News: వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో జడ్పీ సీఈఓ గానం
MLC Padi Kaushik Reddy: రాబోయే ఎన్నికల్లో హుజారాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థిని నేనే: పాడి కౌషిక్ రెడ్డి
Mlc Kaushik Reddy : హుజురాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థిని నేనే, కేటీఆర్ కూడా స్పష్టం చేశారు - ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి
Rani Rudrama on KTR: "మంత్రి కేటీఆర్ అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్ - పనిగట్టుకొని విష ప్రచారాలు"
Jeevan Reddy on KCR: 24 గంటల ఉచిత విద్యుత్ ప్రచార ఆర్భాటమే - కేసీఆర్ నిర్ణయంతో 40 వేల కోట్ల నష్టం!
KCR Political strategy : గవర్నర్‌తో రాజీ - బడ్జెట్ పై సైలెన్స్ ! బీజేపీపై కేసీఆర్ దూకుడు తగ్గిందా ?
K Viswanath : హిందీలోనూ విశ్వనాథ్ హిట్టే, ఆయన 'స్వయంకృషి' - ఓ తీరని కోరిక
Writer Padmabhushan Review - 'రైటర్ పద్మభూషణ్' రివ్యూ : కామెడీయే కాదు, మెసేజ్ కూడా - సుహాస్ సినిమా ఎలా ఉందంటే?
Pawan Kalyan Marriages: మూడు పెళ్లిళ్ల వివాదంపై ఫుల్ క్లారిటీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ - చివర్లో బాలకృష్ణ షాకింగ్ కామెంట్స్!