Karimnagar News: నాగకన్యలా మారుతున్న యువతి! చర్మంపై పొలుసులు - కారణమేంటో చెప్పిన డాక్టర్లు
Telangana News: కృష్ణవేణి మాట్లాడుతూ.. నాగుపాము కలలో కనిపించి తనకు గుడి కట్టాలని చెప్పిందని అన్నారు. అప్పటి నుండి తనకు నాగు పాము తన మీదికి వచ్చినట్టు ఉంటుందని అన్నారు.
Karimnagar woman news: పురాణాల్లో నాగ కన్య గురించి విన్నాం సినిమాల్లో చూశాం.. కానీ ఆధునిక కాలంలో కూడా నాగ కన్యలు ఉంటారా..? అప్పుడప్పుడు మనిషి పాముగా మారడం, పాములా ప్రవర్తించడం, నాగ కన్యలా మారడం చూశారా.. కానీ నిజ జీవితంలో కూడా అప్పుడప్పుడు ఇలాంటి కొన్ని సంఘటనలు అక్కడక్కడ జరుగుతూనే ఉంటాయి.. అలాంటిదే కరీంనగర్ జిల్లాలో సైదాపూర్ మండలం ఎగ్లాస్పూర్ గ్రామంలో ఓ వింత ఘటన జరుగుతుంది. ఎగ్లాస్పూర్ గ్రామానికి చెందిన కృష్ణవేణి అనే యువతి గత ఆరు సంవత్సరాలుగా పాములా మారుతుందని అంటున్నారు.. ఇక ఇదే విషయంపై నాగ కన్య కృష్ణవేణిపై abp దేశం స్పెషల్ స్టోరీ.
నాగ కన్య కృష్ణవేణి:
కృష్ణవేణి మాట్లాడుతూ.. నాగుపాము కలలో కనిపించి తనకు గుడి కట్టాలని చెప్పిందని అన్నారు. అప్పటి నుండి నాకు నాగు పాము నా మీదికి వచ్చినట్టు అలాగే తన చర్మం కూడా పాములాగా మారుతుందని అంటుంది. ఇలా ఆరు సంవత్సరాలుగా జరుగుతుందని తెలిపింది. డిగ్రీ చదువుకున్న కృష్ణవేణి కొద్దిరోజులుగా ప్రైవేట్ స్కూల్లో టీచర్ గా పని చేసింది. తన తల్లిదండ్రులు మరణించినప్పటి నుండి తనకి ఇలా జరుగుతుందని అంటుంది.
గ్రామస్థులు:
నాగదేవతకు గుడి కట్టాలని నిర్ణయించుకొని ఊర్లో వాళ్ళందరికీ ఈ విషయం చెప్పడంతో గ్రామస్థులు కూడా కొంత ఆర్థిక సాయం చేయడంతో గుడి నిర్మాణం చేపట్టింది కృష్ణవేణి. దాదాపు సగం వరకు గుడి నిర్మాణం జరిగిందని ఇంకా దాతలు సహకరిస్తే పూర్తిగా నాగదేవతకు గుడి కట్టి నిత్య పూజలు అందిస్తానని తెలిపింది. తను కూడా ఇప్పుడు ప్రతి శుక్రవారం, మంగళవారం అలాగే పండుగ రోజుల్లో నాగదేవతకు పూజలు చేసి పాలు పోసి వస్తున్నాను అంటుంది కృష్ణవేణి. ప్రస్తుతం తను నానమ్మతో ఉంటున్నానని తెలిపింది. ఇలా మారడం వెనుక ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉన్నాయని డాక్టర్ కూడా చూపించుకున్నానని తెలిపింది. కానీ ఇలాంటి ఆరోగ్య సమస్యలు లేవని డాక్టర్లు తెలిపారు. దేవుడు తనకు కలలో వచ్చి నేను నాగదేవతను నాకు గుడి కట్టాలంటూ పదే పదే కలలో వస్తుందని చెప్తుందని తెలిపారు.
ఇదే విషయంపై గ్రామస్తులు మాట్లాడుతూ చిన్ననాడే తల్లిదండ్రులు చనిపోవడంతో అమ్మాయి కృష్ణవేణి మెంటల్ గా డిస్టర్బ్ అవడంతో ఇలా చేస్తుందని అంటున్నారు.. తనకి ఏదైనా మంచి హాస్పిటల్ లో చూపిస్తే తన సమస్య ఏంటిది అనేది తెలుస్తుందని అంటున్నారు.
డాక్టర్ దీప్తి డర్మోటాలజిస్ట్:
సామాన్యంగా మానవ శరీరంలో రంగు మారడానికి కొన్ని కారణాలు ఉంటాయని దానిని సైనోసిస్ అని అంటారని డాక్టర్ దీప్తి (డెర్మటాలజిస్ట్) అన్నారు. మానవ శరీరంలో ఊపిరితిత్తులు, గుండె, నరాల సమస్యలు ఉన్నా కూడా రంగు మారడానికి కారణం అవుతుందని అన్నారు. ఇలా చర్మం రంగులో మార్పులు వచ్చినప్పుడు వెంటనే డాక్టర్ని సంప్రదించాలని అన్నారు. చిన్నగా మొదలైన సమస్య తీవ్ర స్థాయికి చేరుకోక ముందే చికిత్స చేయించుకోవాలని తెలిపారు.