Karimnagar: కరీంనగర్‌లో అద్భుత దృశ్యం, డ్యామ్ నుంచి నీరు ఆకాశంలోకి.. ఆ వింత చూసి జనాలు షాక్.. వీడియో
కరీంనగర్‌లోని లోయర్ మానేరు డ్యామ్ (దిగువ మానేరు) నుంచి నీరు ఆకాశంలోకి వెళ్లింది. చూస్తుండగానే భారీ సుడిగాలి లాగా మారింది.
కరీంనగర్ జిల్లాలో ఆదివారం రోజు అత్యంత ఆశ్చర్యకరమైన ఓ పరిణామం చోటు చేసుకుంది. ఆ ఘటన అందరికీ ఓ వింతైనది. భూమిపై ఉన్న నీరు ఆకాశంలోకి వెళ్లింది. ఇది వినగానే మీరు కూడా ఆశ్చర్యానికి గురవుతున్నారు కదూ..! సరిగ్గా భూమిపై ఉన్న నీరు ఆకాశంలోకి ఒక సన్నని మార్గం ద్వారా వెళ్లిన ఘటన చూసిన ప్రత్యక్ష సాక్షులు అంతకుమించిన విస్మయానికి లోనయ్యారు. వెంటనే తమ ఫోన్లలో కెమెరాలు ఆన్ చేసి ఆ దృశ్యాన్ని వీడియోల రూపంలో బంధించారు.
Also Read: Hyderabad: నా బుల్లెట్టు బండెక్కి వెళ్దాం.. వస్తావా? మంత్రి కేటీఆర్‌కు ఎమ్మెల్యే రాజాసింగ్ సవాల్
కరీంనగర్‌లోని లోయర్ మానేరు డ్యామ్ (దిగువ మానేరు) నుంచి నీరు ఆకాశంలోకి వెళ్లింది. చూస్తుండగానే భారీ సుడిగాలి లాగా మానేరు డ్యామ్‌లోని నీరు ఆకాశం వైపు వెళ్ళింది. ఈ దృశ్యాన్ని చూసిన జనాలు ఒకింత షాకయ్యారు. ఈ విషయం ఆ నోటా.. ఈ నోటా పాకడంతో అద్భుతాన్ని చూడటానికి జనాలు ఎగబడ్డారు. మానేరు జలాశయం పరిసర ప్రాంతాల్లో వరి పంట దగ్గర పనులు చేస్తున్న రైతులకు తొలుత ఈ దృశ్యం కంటపడింది. వారే ఈ పరిణామాన్ని సెల్ ఫోన్లలో వీడియోలు తీశారు. అలా ఈ ఘటన గురించి బయటికి తెలిసింది. ఇలా జరగడాన్ని వాటర్ స్పౌట్ అంటారని నిపుణులు తెలిపారు.
ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 2016 సంవత్సరంలోనూ సరిగ్గా ఇదే ప్రదేశంలో ఇలాంటి దృశ్యమే కనువిందు చేసిందని స్థానికులు చెబుతున్నారు. మళ్లీ ఐదేళ్ల తర్వాత మానేరు డ్యామ్ నుంచి మరోసారి ఒక సుడిగుండం తరహాలో నీరు పైకి వెళ్లింది. సాధారణంగా మన దేశంలో ఇలాంటి ఘటనలు జరగడం అత్యంత అరుదు. కానీ, ఉత్తర అమెరికాలో టోర్నడోలు, హరికేన్లు, రాకాసి సుడిగాలులు ఎక్కువగా జరుగుతుంటాయి.
Also Read: సందడిగా ‘అలయ్ బలయ్’.. గవర్నర్ నృత్యాలు, హాజరైన ఉపరాష్ట్రపతి వెంకయ్య, పవన్ కల్యాణ్
Also Read: వామ్మో.. మందు బాబులూ.. దసరాకు ఇన్ని కోట్లు తాగారెంటయ్యా.. మద్యం ఏరులై పారిందిగా..
How Often Waterspouts form in South India ??. Yesterday in Karimnagar, Telangana. pic.twitter.com/u0QR5d5ia6
— Andhra Pradesh Weatherman (@APWeatherman96) October 17, 2021