IPL, 2022 | Eliminator | Eden Gardens, Kolkata - 25 May, 07:30 pm IST
(Match Yet To Begin)
LSG
LSG
VS
RCB
RCB
IPL, 2022 | Qualifier 2 | Narendra Modi Stadium, Ahmedabad - 27 May, 07:30 pm IST
(Match Yet To Begin)
RR
RR
VS
TBC
TBC

Karimnagar: ఊరంతా ఖాళీ చేసి ఇంకోచోట కొత్త గ్రామ నిర్మాణం - ఏడాదంతా ఇక్కడ అదే సమస్య!

Karimnagar News: ఊరంతా కలిసి చందాలు వేసుకొని మరీ ఇటు ఈ బ్రిడ్జి నుండి అటు చెరువు సమస్య నుండి బయట పడాలని నిర్ణయించుకున్నారు.

FOLLOW US: 

Karimnagar: కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలోని మంగపేట గ్రామస్తులు దశాబ్దాలుగా ముంపు సమస్య ఎదుర్కొంటున్నారు. కాలాలతో సంబంధం లేకుండా నీటిని వారి గ్రామ చెరువుకి వదిలినప్పుడల్లా ఇళ్లలోకి నీరు చేరడం సాధారణమైపోయింది. ఎల్లంపల్లి ప్రాజెక్టులో భాగంగా గంగాధర ఎల్లమ్మ చెరువుని ప్రతి సంవత్సరం రెండు సీజన్లలో నీటితో నింపుతున్నారు. దీంతో ఆ చెరువు పక్కనే ఉన్న ఈ మంగపేట గ్రామంలోని ఇండ్లు, వ్యవసాయ భూములు బావులు ముంపునకు గురయ్యాయి. దాదాపు 90 ఎకరాల వరకూ పచ్చని పంట పొలాలు, అందులో మునిగిపోయాయి. దీంతో పలువురు రైతుల జీవనోపాధి దెబ్బతింది. అయితే, ఎవరికీ కూడా సరైన నష్టపరిహారం అందలేదని రైతులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మరోవైపు, ఊరికి కనీసం రోడ్డు సౌకర్యం లేదని అక్కడ ఉన్న బ్రిడ్జి వల్ల కూడా ప్రయాణం చేయాలంటేనే భయమేసే విధంగా ఉందని స్థానికులు అంటున్నారు. ఇక వర్షాకాలంలో అయితే పాములు, తేళ్లు ఇళ్లలోకి రావడం సాధారణంగా తయారైందని అంటున్నారు. నాలుగేళ్ల నుండి సర్వే పేరిట వస్తున్నారు పోతున్నారు తప్ప అధికారులు కూడా తమకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదని విచారం వ్యక్తం చేస్తున్నారు.

ఇక తమ తాతలు తండ్రులు బతికిన ఈ ఊరిలో తాము మాత్రమే మిగిలే పరిస్థితి ఉందని మరో వృద్ధుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక కులవృత్తి చేసుకుని బతికే మహిళల పరిస్థితి మరో విధంగా ఉంది. తాము గొర్రెలు కాచుకుంటూ తమ కుటుంబాన్ని వెళ్లతీసుకొని జీవనోపాధి పొందే వారమని ఇప్పుడు ఎటు వైపు మేతకు తీసుకుని వెళ్లే పరిస్థితి లేక తాము తమ జీవనాధారం దూరం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని అంటున్నారు.

ఇక అసలు వీరు రహదారిగా చెపుతున్న ఈ బ్రిడ్జి పరిస్థితి దారుణంగా సాధారణంగా మెట్రో నగరాల్లో ఫుట్ ఓవర్ బ్రిడ్జికి వాడే డిజైన్ ని ఇక్కడ ప్రధాన రహదారిగా మార్చారు అధికారులు. బైక్ ని బ్రిడ్జిపై నుండి వెళ్ళడానికి మొదటిసారిగా ప్రయత్నించడంతో తమకు తీవ్రమైన భయం ఏర్పడిందని గ్రామస్థులు వాపోతున్నారు. కేవలం నాలుగైదు అడుగుల వెడల్పుతో కట్టిన ఈ బ్రిడ్జి తమకు రవాణా సౌకర్యంగా  మారిందని అంటున్నారు.

ఇక ఊరంతా కలిసి చందాలు వేసుకొని మరీ ఇటు ఈ బ్రిడ్జి నుండి అటు చెరువు సమస్య నుండి బయట పడాలని నిర్ణయించుకున్నారు. అందుకే అందరూ కలిసి తలా కొంత చందాలు వేసుకొని స్థానిక గుట్ట ప్రాంతాన్ని చదును చేసుకుని కొత్త ఊరి నిర్మాణం మొదలుపెట్టారు. పాత ఊరి జ్ఞాపకాలను వదిలి అక్కడ నుండి వెళ్లిపోవాలని  అనుకుంటున్నారు. ఒక ఊరికి వచ్చిన కష్టాన్ని ఐకమత్యంగా ఉంటేనే తాము బయట గలమని వారంతా భావిస్తున్నారు.

Published at : 26 Apr 2022 10:24 AM (IST) Tags: Karimnagar news Villages in Karimnagar Flood effected villages Karimnagar Flood effect mangapeta news

సంబంధిత కథనాలు

Karimnagar: టెన్త్ ఎగ్జామ్స్‌కి ఫుల్లుగా తాగొచ్చిన టీచర్, తూలుతూనే ఇన్విజిలేషన్ - బ్రీత్ అనలైజర్ టెస్ట్‌లో రీడింగ్ చూసి అంతా షాక్!

Karimnagar: టెన్త్ ఎగ్జామ్స్‌కి ఫుల్లుగా తాగొచ్చిన టీచర్, తూలుతూనే ఇన్విజిలేషన్ - బ్రీత్ అనలైజర్ టెస్ట్‌లో రీడింగ్ చూసి అంతా షాక్!

Karimnagar News: కరీంనగరం జిల్లా ప్రజలకు మరో గుడ్ న్యూస్- జూన్ 2 నుంచి అందుబాటులోకి సరికొత్త సాహస క్రీడ

Karimnagar News: కరీంనగరం జిల్లా ప్రజలకు మరో గుడ్ న్యూస్- జూన్ 2 నుంచి అందుబాటులోకి సరికొత్త సాహస క్రీడ

Maneroo River Front : మానేరు రివర్ ఫ్రంట్ పనుల పురోగతిపై మంత్రి గంగుల కమలాకర్‌ ఏమన్నారంటే?

Maneroo River Front : మానేరు రివర్ ఫ్రంట్ పనుల పురోగతిపై మంత్రి గంగుల కమలాకర్‌ ఏమన్నారంటే?

Karimnagar News : సిరిధాన్యాలతో సిరులు కురిపిస్తున్న మగువలు, విదేశాలకు బిస్కెట్లు, కేకుల ఎగుమతి

Karimnagar News : సిరిధాన్యాలతో సిరులు కురిపిస్తున్న మగువలు, విదేశాలకు బిస్కెట్లు, కేకుల ఎగుమతి

Karimnagar: శాతవాహన యూనివర్సిటీలో 12బీ హోదా లొల్లి - UGCకి వర్సిటీ నుంచి వివాదాస్పద లేఖలు 

Karimnagar: శాతవాహన యూనివర్సిటీలో 12బీ హోదా లొల్లి - UGCకి వర్సిటీ నుంచి వివాదాస్పద లేఖలు 
SHOPPING
Top Mobiles
LAPTOP AND ACCESORIES
Best Deals

టాప్ స్టోరీస్

Hyderabad: రేపు Hydకి ప్రధాని మోదీ, ఈ రూట్‌లో ట్రాఫిక్ అనుమతించరు! ప్రత్యామ్నాయ మార్గాలు ఇవీ

Hyderabad: రేపు Hydకి ప్రధాని మోదీ, ఈ రూట్‌లో ట్రాఫిక్ అనుమతించరు! ప్రత్యామ్నాయ మార్గాలు ఇవీ

Amalapuram: ఇది ఆంధ్రానా? పాకిస్థానా? అంబేడ్కర్‌పై అంత ప్రేమ ఉంటే నవరత్నాలకు పెట్టుకోండి: జీవీఎల్

Amalapuram: ఇది ఆంధ్రానా? పాకిస్థానా? అంబేడ్కర్‌పై అంత ప్రేమ ఉంటే నవరత్నాలకు పెట్టుకోండి: జీవీఎల్

Mahesh Babu Trivikram Movie Update: మహేష్ బాబు సినిమాకూ త్రివిక్రమ్ 'అ' సెంటిమెంట్‌తో వెళతారా?

Mahesh Babu Trivikram Movie Update: మహేష్ బాబు సినిమాకూ త్రివిక్రమ్ 'అ' సెంటిమెంట్‌తో వెళతారా?

Rajya Sabha Elections 2022: కాంగ్రెస్‌కు కపిల్ సిబల్ గుడ్‌బై- ఎస్‌పీ మద్దతుతో రాజ్యసభ ఎన్నికల బరిలో!

Rajya Sabha Elections 2022: కాంగ్రెస్‌కు కపిల్ సిబల్ గుడ్‌బై- ఎస్‌పీ మద్దతుతో రాజ్యసభ ఎన్నికల బరిలో!