అన్వేషించండి

Karimnagar Smart City: హడావుడిగా పనులు, వృథా అవుతున్న నిధులు - ఆ సమస్యలకు చెక్ పెట్టరా !

కరీంనగర్ స్మార్ట్ సిటీ కార్పొరేషన్ లిమిటెడ్ పరిధిలో మొదటి దశలో రహదారులు, మురుగు కాలువల పనులు పూర్తి చేశారు. రెండో విడతలో నగరంలోని అంతర్గత ప్రధాన రహదారులను రిపేర్ చేయాలని నిర్ణయించారు.

నిర్ణీత సమయం దగ్గర పడుతూ ఉండడంతో కరీంనగర్ స్మార్ట్ సిటీ కార్పొరేషన్ లిమిటెడ్ పరిధిలో అభివృద్ధి పనులు ఊపందుకున్నాయి. రోడ్లు, మురుగునీటి,వరద కాలువలు, పార్కులు, స్టోర్స్ కాంప్లెక్స్, కమాండ్ కంట్రోల్, సైన్ బోర్డులు, స్మార్ట్ బీన్స్, స్మార్ట్ తరగతి గదులు వంటివి ప్రాజెక్టులో చేర్చుకొని పనులు చేస్తున్నారు. వీటిలో కొన్ని పనులు  పూర్తయ్యాయి. మొదటి దశలో రహదారులు, మురుగు కాలువల పనులు పూర్తి చేశారు. 

కోట్లు ఖర్చయిపోతున్నాయి, ఎక్కడి పనులు అక్కడే
రెండో విడతలో నగరంలోని అంతర్గత ప్రధాన రహదారులను రిపేర్ చేయాలని నిర్ణయించారు. అందులో భాగంగా 16 రోడ్లను రూ.94 కోట్ల తో చేపట్టేందుకు చర్యలు చేపట్టారు. స్మార్ట్ రోడ్ల పనులు 12 చోట్ల వేగంగా చేస్తున్నారు. కొన్ని రహదారులు ఇప్పటికే పూర్తి చేయగా రాకపోకలు సాగిస్తున్నారు. మిగతా ప్రాంతాల్లో ఇంకా పనులు కొనసాగుతున్నాయి. మొత్తం మీద 52% పనులు చేసినట్లుగా అధికారులు చెబుతున్నారు. వీటిలో రెండు వైపులా డ్రైనేజీల నిర్మాణ పనులు చేపడుతున్నారు. త్వరగా పూర్తి చేసేందుకు వీలుగా సీసీ డ్రెయిన్ కు బదులుగా పైపులు వేస్తున్నారు. దాంతో ఆ ప్రాంతాల్లో తవ్వి వదిలేయకుండా వెంటనే పనులు చేస్తుండడంతో సమస్యలు దూరమవుతున్నాయి. రెండో విడత ఎంపిక చేసుకున్న రహదారులలో 4 ప్రాంతాల్లో మాత్రం విపరీతమైన రద్దీ, ట్రాఫిక్ ఉంటుంది. ముందుగా అక్కడి నుంచి ప్రారంభించాల్సి ఉండగా రహదారి విస్తరణ లేకపోవడం, ఇళ్లు అడ్డుగా వస్తున్నాయనే కారణాలతో పనులు ప్రారంభించలేదు. 
సుభాష్ నగర్ నుంచి సీతారాంపూర్ రోడ్డు, రాజా టాకీస్ నుంచి వీక్లీ మార్కెట్ రోడ్డు,తేజ స్కూల్ రోడ్డు, డీఎఫ్ఓ జంక్షన్ నుంచి మంచిర్యాల చౌరస్తా వరకు ప్రణాళికలో చేర్చుకొని నిధులు కూడా కేటాయించారు. ఇందులో మూడు ప్రాంతాల్లో అయితే రహదారులు పాడై రాకపోకలు సాగించకుండా తయారైంది డీఎఫ్ఓ నుంచి తారు రోడ్డు బాగానే ఉండడంతో దాన్ని తొలగించినట్లు తెలిసింది. స్మార్ట్ యూనిట్లో పనులు ప్రారంభిస్తారని ఆశగా ఎదురు చూస్తున్న ఆయాప్రాంత వాసులకు ఎదురుచూపులు మిగిలాయని విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి.సుభాష్ నగర్ ప్రధాన రహదారి మీదగా సీతారాంపురం వైపు వచ్చే ప్రధాన అంతర్గత రహదారిపై రోజుకు 15 వేల వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. ఎస్ఆర్ఆర్ కాలేజ్ నుండి చొప్పదండి వైపు వెళ్లే వారంతా ఇటు నుంచే వెళ్తున్నారు. పాత ఇంప్లాయ్మెంట్ నుంచి తేజ స్కూల్ వైపు వెళ్లేదారి నిత్యం రద్దీగా ఉంటుంది. 

రోడ్ల పరిస్థితి అంతంతమాత్రమే !
నాలుగు డివిజన్లలో ప్రజలు రాకపోకలు సాగిస్తుండగా, ఉదయం సాయంత్రం ఆ వైపు ప్రయాణం సాగించాలంటే ఆ ప్రాంతవాసులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. గవర్నమెంట్ హాస్పిటల్ నుండి రాజా థియేటర్ మీదుగా గాంధీ రోడ్డుకు వెళ్లే దారిలో పాతిక సంఖ్యలో హాస్పిటల్స్ ఉన్నాయి. రోగులతో పాటు ప్రజలు ఈ రోడ్డు నుండి వేల సంఖ్యలో ప్రయాణిస్తున్నారు. ఈ రోడ్డుపై చాలాసార్లు ప్యాచ్ వర్క్ చేసిన ముక్కలు ముక్కలు కావడంతో ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు కాస్త దృష్టి పెట్టి క్వాలిటీ పెంచితే గాని ఎక్కువ కాలం పాటు నిలిచేలా లేవని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

TGPSC: తెలంగాణలో గ్రూప్ - 3 పరీక్షలు - అభ్యర్థులకు కీలక సూచనలు
తెలంగాణలో గ్రూప్ - 3 పరీక్షలు - అభ్యర్థులకు కీలక సూచనలు
CM Chandrababu: 'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
Pushpa 2 Trailer: మైండ్ బ్లాక్ అయ్యేలా బీహార్‌లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్... ఇవాళ సాయంత్రమే 'పుష్ప 2' ట్రైలర్ విడుదల
మైండ్ బ్లాక్ అయ్యేలా బీహార్‌లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్... ఇవాళ సాయంత్రమే 'పుష్ప 2' ట్రైలర్ విడుదల
Toyota Camry Hybrid Facelift: టయోటా క్యామ్రీ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ త్వరలోనే - స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్‌లో మార్కెట్లోకి?
టయోటా క్యామ్రీ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ త్వరలోనే - స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్‌లో మార్కెట్లోకి?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Nayanthara vs Dhanush Netflix Documentary | తమిళ్ సినీ ఇండస్ట్రీలో వివాదం..నయనతార vs ధనుష్ | ABP Desamరోహిత్ కి ధోని చేసిన మేలు, తిలక్ కి సూర్య చేస్తున్నాడుసఫారీలను సెంచరీతో చితక్కొట్టిన సంజూ శాంసన్మైక్ టైసన్ ను చిత్తు చేశాడు, 300 కోట్ల ప్రైజ్ మనీని కొల్లగొట్టాడు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TGPSC: తెలంగాణలో గ్రూప్ - 3 పరీక్షలు - అభ్యర్థులకు కీలక సూచనలు
తెలంగాణలో గ్రూప్ - 3 పరీక్షలు - అభ్యర్థులకు కీలక సూచనలు
CM Chandrababu: 'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
Pushpa 2 Trailer: మైండ్ బ్లాక్ అయ్యేలా బీహార్‌లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్... ఇవాళ సాయంత్రమే 'పుష్ప 2' ట్రైలర్ విడుదల
మైండ్ బ్లాక్ అయ్యేలా బీహార్‌లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్... ఇవాళ సాయంత్రమే 'పుష్ప 2' ట్రైలర్ విడుదల
Toyota Camry Hybrid Facelift: టయోటా క్యామ్రీ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ త్వరలోనే - స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్‌లో మార్కెట్లోకి?
టయోటా క్యామ్రీ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ త్వరలోనే - స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్‌లో మార్కెట్లోకి?
Manipur: మణిపూర్‌లో మంత్రులు, ఎమ్మెల్యేల ఇళ్లపై దాడి- 7 జిల్లాల్లో కర్ఫ్యూ, రెండు రోజులు ఇంటర్‌నెట్ బంద్‌
మణిపూర్‌లో మంత్రులు, ఎమ్మెల్యేల ఇళ్లపై దాడి- 7 జిల్లాల్లో కర్ఫ్యూ, రెండు రోజులు ఇంటర్‌నెట్ బంద్‌
Samsung Galaxy S25: శాంసంగ్ గెలాక్సీ ఎస్25 సిరీస్ లాంచ్ అప్పుడే - లీక్స్ వచ్చేశాయ్!
శాంసంగ్ గెలాక్సీ ఎస్25 సిరీస్ లాంచ్ అప్పుడే - లీక్స్ వచ్చేశాయ్!
Actress Kasthuri Arrested: తెలుగు ప్రజలపై అనుచిత వ్యాఖ్యలు - సినీ నటి కస్తూరిని అరెస్ట్ చేసిన తమిళనాడు పోలీసులు
తెలుగు ప్రజలపై అనుచిత వ్యాఖ్యలు - సినీ నటి కస్తూరిని అరెస్ట్ చేసిన తమిళనాడు పోలీసులు
Best Selling Hatchback: అక్టోబర్‌లో బెస్ట్ సెల్లింగ్ హ్యాచ్‌బ్యాక్ ఇదే - మార్కెట్‌ను ఏలుతున్న మారుతి!
అక్టోబర్‌లో బెస్ట్ సెల్లింగ్ హ్యాచ్‌బ్యాక్ ఇదే - మార్కెట్‌ను ఏలుతున్న మారుతి!
Embed widget