అన్వేషించండి

RFCL: ఆర్ఎఫ్‌సీఎల్‌లో ఎరువుల ఉత్పత్తి మళ్లీ ప్రారంభం, పీసీబీ అనుమతి

RFCL Factory Ramagundam: ప్రస్తుతం తొలకరి మొదలయ్యే సమయం దగ్గర పడటంతో యూరియా డిమాండ్ రీత్యా ఉత్పత్తికి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

కాలుష్యం పేరుతో శనివారం ఆర్ ఎఫ్ సీ ఎల్ (RFCL) లో ఎరువుల ఉత్పత్తి నిలిపివేయాలంటూ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు ఆదేశించిన సంగతి తెలిసిందే. ఆ ఆదేశాల మేరకు ఉత్పత్తిని నిలిపివేశారు. అయితే, అత్యవసర పరిస్థితిల్లో సోమవారం నుంచి తిరిగి ఉత్పత్తిని ప్రారంభించారు. ఆర్ ఎఫ్ సీ ఎల్ యజమాన్యం అధికారులతో సుదీర్ఘంగా చర్చించిన అనంతరం.. ప్రస్తుతం దేశంలో ఎరువుల వాడకం పెరగడంతో పాటు యూరియా డిమాండ్ కూడా చాలా పెరిగింది కాబట్టి కర్మాగారంలో ఉత్పత్తి ఆపివేయడం వల్ల రైతులకు సకాలంలో ఎరువులు అందించకపోయే అవకాశం ఉంది. ఆ ఇబ్బందులను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని అధికారులు తక్షణమే ఈ నిర్ణయాలు తీసుకున్నారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అధికారులకు ఆర్ ఎఫ్ సీ ఎల్ లో ఉన్న సమస్యల పరిష్కారానికి సమయం కోరడంతో అధికారులు కూడా సానుకూలంగా స్పందించారు. దీంతో ఎరువుల ఉత్పత్తి తిరిగి జరుగుతుందని ఆర్ ఎఫ్ సీ ఎల్ యాజమాన్యం ఒక ప్రకటనలో తెలిపింది.

ఈ ఫ్యాక్టరీ గురించి మార్చి 22న స్థానిక ఎమ్మెల్యే పీసీబీకి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందిన వెంటనే కాలుష్య నియంత్రణ బోర్డు టాస్క్ ఫోర్స్ కమిటీని నియమించి ఫ్యాక్టరీలో విచారణ చేపట్టింది. అందులో మొత్తం 12 చోట్ల వ్యవస్థాపరమైన లోపాలు ఉన్నాయని, కాలుష్యాన్ని నియంత్రించేందుకు ప్రత్యేకమైన యంత్రాలు లేవని తేల్చారు. అమ్మోనియా నిల్వ ట్యాంకు, ఉత్పత్తి ప్లాంటు, యూరియా తయారీ టవర్ నుంచి అమ్మోనియా గ్యాస్ లీకవుతున్నట్లుగా గుర్తించారు. అయితే, అమ్మోనియా వాయువు లీకేజీని కనిపెట్టేందుకు 51 చోట్ల సెన్సార్లు అమర్చామని యాజమాన్యం చెప్పగా, అవి సరిగ్గా పని చేయడం లేదని కమిటీ ధ్రువీకరించింది. దీంతో తాజాగా ఉత్పత్తి నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది.

పరిశ్రమ నుంచి విడుదలవుతున్న కాలుష్యానికి సంబంధించి గతం నుంచే ఇక్కడ ఆందోళనలు జరుగుతున్నాయి. వాయు, శబ్ద కాలుష్యంతో ఇబ్బంది పడుతున్నామని లక్ష్మీపురం, వీర్లపల్లి తదితర ప్రాంతవాసులు కర్మాగారం ముందు గతంలో ఆందోళనకు దిగారు. అయినా ఆర్‌ఎఫ్‌సీఎల్‌ యాజమాన్యం ఏ చర్యలు తీసుకోకపోగా నిర్వహణకు ఆటంకం కలిగిస్తున్నారంటూ 28 మందిపై కేసులు పెట్టింది. అమ్మోనియా లీకేజీ కారణంగా గోదావరిఖనితో పాటు వీర్లపల్లి, లక్ష్మీపురం తదితర గ్రామాల వారు ఆందోళన చెందుతున్నారు. ఇటు ఎరువుల తయారీ తర్వాత వాషింగ్‌, కూలింగ్‌, ఇతర పరిశ్రమ అవసరాలకు వినియోగించే వ్యర్థాలతో కూడిన 6,240 కిలోలీటర్ల నీరు బయటకు వస్తోంది. అమ్మోనియా, యూరియా ప్లాంట్ల నుంచి మరో 840 కిలోలీటర్ల నీటి వ్యర్థాలు వెలువడుతుంటాయి.

ఇక తెలంగాణ, ఏపీ సహా పక్కనున్న రాష్ట్రాలకు ఇదే ఫ్యాక్టరీ నుంచి యూరియా సరఫరా అవుతోంది. ఉత్పత్తి ఆగితే ఈ రాష్ట్రాల వ్యవసాయంపై తీవ్ర ప్రభావం పడే సూచనలున్నాయని వ్యవసాయాధికారులు తెలిపారు. ఈ కర్మాగారం నుంచి రోజూ సిద్ధమయ్యే 4,235 టన్నుల యూరియాలో సగం వరకూ తెలుగు రాష్ట్రాలకే కేటాయిస్తున్నారు. గత రెండు నెలల్లో 60 వేల టన్నులకు పైగా యూరియా తెలంగాణకు సప్లై కాగా మరో 10 రోజుల్లో తొలకరి వర్షాలు ప్రారంభం కానున్నాయని వాతావరణ శాఖ ఇప్పటికే ప్రకటించింది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR Arrest: అరెస్టులు కాదు ప్రజల్లో చర్చ పెట్టడమే లక్ష్యం - రాజకీయంగా నష్టపోకుండా రేవంత్ మాస్టర్ ప్లాన్ !
అరెస్టులు కాదు ప్రజల్లో చర్చ పెట్టడమే లక్ష్యం - రాజకీయంగా నష్టపోకుండా రేవంత్ మాస్టర్ ప్లాన్ !
Guntur News: గుంటూరులో ఓ కాలనీ మొత్తం 22Aలోకి - 15 ఏళ్ల కిందటే రిజిస్ట్రేషన్ చేసినా వైసీపీ  సర్కార్ నిర్వాకం -  ఈ కాలనీ వాసుల కష్టాలు తీర్చేదెవరు?
గుంటూరులో ఓ కాలనీ మొత్తం 22Aలోకి - 15 ఏళ్ల కిందటే రిజిస్ట్రేషన్ చేసినా వైసీపీ సర్కార్ నిర్వాకం - ఈ కాలనీ వాసుల కష్టాలు తీర్చేదెవరు?
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
Accidents : తెలుగు రాష్ట్రాల్లో ఘోర ప్రమాదాలు- ఏడుగురు మృతి - మాధాపూర్‌లోని ఐటీ బిల్డింగ్‌లో ఫైర్ యాక్సిడెంట్
తెలుగు రాష్ట్రాల్లో ఘోర ప్రమాదాలు- ఏడుగురు మృతి - మాధాపూర్‌లోని ఐటీ బిల్డింగ్‌లో ఫైర్ యాక్సిడెంట్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Ambani School Annual Day Celebrations | ధీరూభాయ్ అంబానీ స్కూల్ వార్షికోత్సవానికి క్యూకట్టిన సెలబ్రెటీలు | ABP DesamPawan Kalyan Tribal Villages Tour | పార్వతీపురం మన్యం జిల్లాలో రోడ్ల బాగు కోసం తిరిగిన డిప్యూటీ సీఎం | ABP Desamకాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Arrest: అరెస్టులు కాదు ప్రజల్లో చర్చ పెట్టడమే లక్ష్యం - రాజకీయంగా నష్టపోకుండా రేవంత్ మాస్టర్ ప్లాన్ !
అరెస్టులు కాదు ప్రజల్లో చర్చ పెట్టడమే లక్ష్యం - రాజకీయంగా నష్టపోకుండా రేవంత్ మాస్టర్ ప్లాన్ !
Guntur News: గుంటూరులో ఓ కాలనీ మొత్తం 22Aలోకి - 15 ఏళ్ల కిందటే రిజిస్ట్రేషన్ చేసినా వైసీపీ  సర్కార్ నిర్వాకం -  ఈ కాలనీ వాసుల కష్టాలు తీర్చేదెవరు?
గుంటూరులో ఓ కాలనీ మొత్తం 22Aలోకి - 15 ఏళ్ల కిందటే రిజిస్ట్రేషన్ చేసినా వైసీపీ సర్కార్ నిర్వాకం - ఈ కాలనీ వాసుల కష్టాలు తీర్చేదెవరు?
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
Accidents : తెలుగు రాష్ట్రాల్లో ఘోర ప్రమాదాలు- ఏడుగురు మృతి - మాధాపూర్‌లోని ఐటీ బిల్డింగ్‌లో ఫైర్ యాక్సిడెంట్
తెలుగు రాష్ట్రాల్లో ఘోర ప్రమాదాలు- ఏడుగురు మృతి - మాధాపూర్‌లోని ఐటీ బిల్డింగ్‌లో ఫైర్ యాక్సిడెంట్
Look Back 2024: అయిపోయింది అనుకున్న స్థితి నుంచి అధికార పీఠానికి.. టీడీపీకి మర్చిపోలేని సంవత్సరంగా 2024
అయిపోయింది అనుకున్న స్థితి నుంచి అధికార పీఠానికి.. టీడీపీకి మర్చిపోలేని సంవత్సరంగా 2024
AP Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Kohli New Look: న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Embed widget