అన్వేషించండి

Karimnagar: ఈసారి మామిడి పచ్చళ్ళు అంతంతమాత్రమే! రెండు రెట్లు ఎగబాకిన ధరలు

Mango Pickles: ఈ సారి పచ్చడికి కష్టకాలం వచ్చినట్టుంది. ధరల భారానికి సామాన్యులకు దూరమయ్యే పరిస్థితి తెచ్చింది.

ప్రతి సంవత్సరం వేసవి కాలం వచ్చిందంటే ప్రజలకు స్పెషల్ రుచుల కాలం అని చెప్పవచ్చు. సంవత్సరం పొడవునా వాడుకోవడానికి అనువుగా ఉండే రకరకాల రుచికరమైన పచ్చళ్లలో మామిడికాయదే అగ్రస్థానం. ఉదయం తినే టిఫిన్ దగ్గర నుండి రాత్రి డిన్నర్ వరకు పలురకాలుగా ఆవకాయ పచ్చడిని జనం ఆస్వాదిస్తారు. ఇక కాయలు కాసే ఎండా కాలంలోని ఏప్రిల్, మే నెలల్లో దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసుకుని ప్రతి కుటుంబంలో పచ్చళ్లు పట్టుకుంటారు. ప్రధానంగా మహిళలు మామిడి కాయల్లో రెండు రకాలైన  వెరైటీ పచ్చళ్లను తయారు చేస్తారు. అయితే, ఈ సారి పచ్చడికి కష్టకాలం వచ్చినట్టుంది. ధరల భారానికి సామాన్యులకు దూరమయ్యే పరిస్థితి తెచ్చింది.

కరీంనగర్ జిల్లాలో ఎక్కువగా మామిడి తోటలు మానకొండూరు, కోహెడ, రామడుగు, గంగాధర, జగిత్యాల, కోరుట్ల, చిగురుమామిడిలలో ఉన్నాయి. ఇక్కడ పండే మల్లిక, నీలాలు, పెద్ద కాయ, జలాల వెరైటీలను ప్రధానంగా తొక్కు కాయలుగా వాడతారు. అయితే, ఈసారి దిగుబడి తక్కువగా ఉండటంతో మార్కెట్లో వేలం వేసే సమయంలో మంచి రకమైతే బస్తాకు రూ.1,500 నుండి రూ.2 వేలు పలుకుతోంది. గత ఏడాదితో పోలిస్తే ఇది దాదాపు రెండు రెట్లు ఎక్కువ. రకరకాల కారణాలతో అల్లంవెల్లుల్లి, కారం, నూనె, మెంతులు, ఆవాల ధరలు కూడా విపరీతంగా పెరిగాయి. దీంతో సాధారణంగా ఒక కుటుంబానికి సంవత్సరాంతం ఉపయోగపడే విధంగా పెట్టే పచ్చడిని ఈసారి కేవలం పది పదిహేను కాయలతో సరిపెట్టుకొని మమ అనిపించుకుంటున్నారు.

గతంతో పోలిస్తే ముడిసరుకుల ధరలు ఇలా..
అసలు పచ్చళ్ల ధరలు ఇంత భారీ ఎత్తున పెరగడానికి కారణం ఏమిటని పరిశీలిస్తే ముడి సరుకుల ధరలు గమనించాల్సి ఉంటుంది. గతంలో రూ.90 నుండి రూ.120 పలికిన మంచి నూనె ధర ప్రస్తుతం 195 నుండి 210 రూపాయలుగా ఉంది. స్పెషల్ గా పట్టించే గానుగ నూనె గతంలో దాదాపుగా రూ.275 ఉండగా ఇప్పుడు దాదాపు రూ.350 పైనే ఉంది. ఇక పచ్చళ్లకు వాడే స్పెషల్ కారం అయితే కిలోకి రూ.250 వరకూ గతంలో ఉండేది. ఈ సారి ఏకంగా 420 రూపాయల వరకు ఎగబాకింది. మెంతులు 100 రూపాయల నుండి 160, ఆవాలు 60 నుండి 150, వెల్లుల్లి 40 నుండి 60 రూపాయలకు పెరిగాయి. గత ఏడాది 100 రూపాయలకు చిన్న మామిడికాయలు అయితే 20 వరకూ వచ్చేవి. పెద్దవి 15 వరకు వచ్చాయి. కానీ ఈ సారి అందులో సగం మాత్రమే వస్తున్నాయి. దీంతో బెంబేలెత్తిన జనాలు గతంలో కంటే సగం క్వాంటిటీలో కూడా పచ్చళ్ళు పెట్టడానికి ఆసక్తి చూపించడం లేదు. ఎంత జిహ్వచాపల్యం ఉన్నా ధరల మంటలు చూస్తే చంపుకోక తప్పదు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Tummala Nageswara Rao :  మావోయిస్టుల మద్దతూ కోరుతున్న కాంగ్రెస్ - తెలంగాణ మంత్రి కామెంట్స్ వైరల్
మావోయిస్టుల మద్దతూ కోరుతున్న కాంగ్రెస్ - తెలంగాణ మంత్రి కామెంట్స్ వైరల్
Pawan Kalyan Assets: నామినేష‌న్ దాఖ‌లు చేసిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ - అప్పులు రూ.64.26 కోట్లు, ఆస్తుల మాటేంటి!
నామినేష‌న్ దాఖ‌లు చేసిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ - అప్పులు రూ.64.26 కోట్లు, ఆస్తుల మాటేంటి!
Top 5 K Dramas: కొరియన్ డ్రామాలు ఇష్టమా? అయితే ఈ టాప్ 5 లేటెస్ట్ వెబ్ సిరీస్‌లను ట్రై చేయాల్సిందే!
కొరియన్ డ్రామాలు ఇష్టమా? అయితే ఈ టాప్ 5 లేటెస్ట్ వెబ్ సిరీస్‌లను ట్రై చేయాల్సిందే!
Diamonds in Mumbai: న్యూడిల్స్ ప్యాకెట్‌లో డైమండ్స్, రూ.6 కోట్ల విలువైనవి స్వాధీనం
న్యూడిల్స్ ప్యాకెట్‌లో డైమండ్స్, రూ.6 కోట్ల విలువైనవి స్వాధీనం
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Pawan Kalyan Nomination From Pithapuram | పిఠాపురంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా పవన్ నామినేషన్ దాఖలు | ABPMadhavi Latha vs Asaduddin Owaisi |  పాతబస్తీలో కొడితే దేశవ్యాప్తంగా రీసౌండ్ వస్తుందా..? | ABPAllari Naresh on Aa okkati Adakku | మళ్లీ కామెడీ సినిమాలు చేయటంపై అల్లరి నరేష్ | ABP DesamDuvvada Srinivas Interview | టెక్కలి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్ ఇంటర్వ్యూ | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tummala Nageswara Rao :  మావోయిస్టుల మద్దతూ కోరుతున్న కాంగ్రెస్ - తెలంగాణ మంత్రి కామెంట్స్ వైరల్
మావోయిస్టుల మద్దతూ కోరుతున్న కాంగ్రెస్ - తెలంగాణ మంత్రి కామెంట్స్ వైరల్
Pawan Kalyan Assets: నామినేష‌న్ దాఖ‌లు చేసిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ - అప్పులు రూ.64.26 కోట్లు, ఆస్తుల మాటేంటి!
నామినేష‌న్ దాఖ‌లు చేసిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ - అప్పులు రూ.64.26 కోట్లు, ఆస్తుల మాటేంటి!
Top 5 K Dramas: కొరియన్ డ్రామాలు ఇష్టమా? అయితే ఈ టాప్ 5 లేటెస్ట్ వెబ్ సిరీస్‌లను ట్రై చేయాల్సిందే!
కొరియన్ డ్రామాలు ఇష్టమా? అయితే ఈ టాప్ 5 లేటెస్ట్ వెబ్ సిరీస్‌లను ట్రై చేయాల్సిందే!
Diamonds in Mumbai: న్యూడిల్స్ ప్యాకెట్‌లో డైమండ్స్, రూ.6 కోట్ల విలువైనవి స్వాధీనం
న్యూడిల్స్ ప్యాకెట్‌లో డైమండ్స్, రూ.6 కోట్ల విలువైనవి స్వాధీనం
Pesticides in Protein Powder : మీకు ప్రోటీన్ పౌడర్​ తీసుకునే అలవాటు ఉందా? అయితే జాగ్రత్త.. వాటిలో పురుగులమందులు కలుపుతున్నారట
మీకు ప్రోటీన్ పౌడర్​ తీసుకునే అలవాటు ఉందా? అయితే జాగ్రత్త.. వాటిలో పురుగులమందులు కలుపుతున్నారట
Pratinidhi 2: ప్రతినిధి 2 విడుదల వాయిదా... రాజకీయ ఒత్తిళ్లు పని కాకుండా చేశాయా?
ప్రతినిధి 2 విడుదల వాయిదా... రాజకీయ ఒత్తిళ్లు పని కాకుండా చేశాయా?
KCR Bus Yatra :  పూర్వ వైభవమే లక్ష్యం - కేసీఆర్ బస్సు యాత్రకు సర్వం  సిద్ధం
పూర్వ వైభవమే లక్ష్యం - కేసీఆర్ బస్సు యాత్రకు సర్వం సిద్ధం
Pemmasani Chandra Sekhar: ఈ ఎంపీ అభ్యర్థుల ఆస్తులు రూ.వేల కోట్లు - అఫిడవిట్ లో వెల్లడి, టాప్ ప్లేస్ ఎవరిదంటే?
ఈ ఎంపీ అభ్యర్థుల ఆస్తులు రూ.వేల కోట్లు - అఫిడవిట్ లో వెల్లడి, టాప్ ప్లేస్ ఎవరిదంటే?
Embed widget