Karimnagar News: యూకే పార్లమెంట్ ఎన్నికల బరిలో తెలుగు బిడ్డ, లేబర్ పార్టీ నుంచి అభ్యర్థిగా
Labour Party UK: కరీంనగర్‌కు చెందిన వ్యక్తి యూకేలోని రాజకీయాల్లో రాణిస్తున్నారు. ఆయన నార్త్ బెడ్ ఫోర్డ్ షైర్ నుంచి లేబర్ పార్టీ నుంచి ఎన్నికల బరిలో నిలుస్తున్నారు.
Karimnagar News: బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల్లో పోటీకి తెలుగు వ్యక్తి ఎంపికయ్యారు. ఈయన ఉమ్మడి కరీంనగర్ జిల్లా కోహెడ మండలం శనిగరంకు చెందిన ఉదయ్ నాగరాజు. యూకేలోని లేబర్ పార్టీ నుంచి ఎన్నికల బరిలో నిలుస్తున్నారు. నార్త్ బెడ్ ఫోర్డ్ షైర్ లేబర్ పార్టీ పార్లమెంటరీ అభ్యర్థిగా పార్టీ ప్రకటించింది. “నార్త్ బెడ్ ఫోర్డ్ షైర్ అనేది అక్కడి బౌండరీ కమిషన్ సూచనతో కొత్తగా ఏర్పడ్డ పార్లమెంట్ నియోజకవర్గం.
అయితే, యూకేలోని ప్రఖ్యాత సర్వే సంస్థ ఎలెక్టోరల్ కాల్కులస్ పక్రారం నియోజకవర్గంలో 68 శాతం లేబర్ పార్టీ గెలువబోతుందని అంచనా వేసింది. ప్రస్తుతం బ్రిటన్ లోనూ ఎన్నికల హడావిడి మొదలయింది. భారతదేశంలో ఇప్పటికే ఎన్నికలు జరుగుతుండగా ఈ సంవత్సరంలోనే బ్రిటన్, అమెరికాల్లోనూ ఎన్నికలు జరగనున్నాయి. రష్యా - ఉక్రెయిన్ యుద్ధం, ఇజ్రాయిల్ - పాలస్తీనా సంఘర్షణ, ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక మాంద్యం ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో జరుగుతున్న బ్రిటన్, అమెరికా ఎన్నికల మీద ప్రపంచ దేశాల దృష్టి ఉంది.
మంచి పట్టు సాధించిన ఉదయ్
కాగా, ఉమ్మడి కరీంనగర్ జిల్లా కోహెడ మండలం శనిగరం గ్రామంలో ఒక సామాన్య మధ్య తరగతి కుటుంబంలో ఉదయ్ నాగరాజు జన్మించారు. శనిగరం గ్రామానికి చెందిన నాగరాజు హనుమంతరావు, నిర్మలాదేవి దంపతుల కుమారుడు. చిన్నప్పటి నుంచే కష్టపడేతత్వం కలిగి ఉండే ఉదయ్ అంచెలంచాలుగా ఎదిగారు. బ్రిటన్ లోని ప్రపంచ ప్రఖ్యాత యూనివర్సిటీ కాలేజీ అఫ్ లండన్ లో పాలనా శాస్తంలో పీజీ చేశారు. ప్రపంచ సమాజం, భావితరాలపై ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ప్రభావం ముందుగానే పసిగట్టి ఏఐ పాలసీలాబ్స్ అనే థింక్-ట్యాంక్ ని నెలకొల్పారు. అంతర్జాతీయ వక్తగా, రచయితగా మంచి పేరు సంపాదించారు ఉదయ నాగరాజు. క్షేతస్ర్థాయి సమస్యలపైన ఉదయ్ కు మంచి పట్టు ఉంది. స్కూల్ గవర్నర్ గా, వాలంటీర్ గా, విస్స్తృత రాజకీయ ప్రచారకుడిగా ఒక దశాబ్దకాలంగా ఇంటింటికీ ప్రచారంతో సామాన్యుల కష్టాలపై మంచి అవగాహన సాధించారు.
దాదాపు అన్ని సర్వే సంస్థల పక్రారం ఈ ఎన్నికల్లో లేబర్ పార్టీ అఖండ విజయం సాధించి ప్రభుత్వాన్ని నెలకొల్పనుంది. ప్రఖ్యాత తెలుగు రాజకీయ విశ్లేషకులు ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా ఈ సర్వేల ఆధారంగా కన్సర్వేటివ్ పార్టీ కనీవిని ఎరుగని రీతిలో ఓడిపోయి లేబర్ పార్టీ గెలుస్తుందని విశ్లేషించారు. గత కొన్ని ఎన్నికల్లోనూ లేబర్ పార్టీ ఎంపీలు వరుసగా గెలుస్తూ వస్తున్నారు. ఈ నెల జరిగిన కౌన్సిలర్, రాష్ట్ర మేయర్ ఎన్నికలోనూ లేబర్ పార్టీ ఘన విజయం సాధించింది. దీనితో తెలుగు బిడ్డ ఉదయ్ నాగరాజు కూడా బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీగా ఘన విజయం సాధించడం ఖాయంగా కనిపిస్తుంది.