అన్వేషించండి

Ponnam vs Gangula: ధాన్యం కొనుగోళ్లపై బహిరంగ చర్చకు వస్తారా, మంత్రి గంగులకు మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ సవాల్

ధాన్యం కొనుగోళ్లపై మంత్రి గంగుల కమలాకర్ కు మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ సవాల్ విసిరారు. ధాన్యం కొనుగోళ్లలో మంత్రి గంగుల కమలాకర్ చెప్తున్నది అవాస్తవాలే అని విమర్శించారు.

- ఆధారాలతో సహా నిరూపిస్తాం
- కొన్నామని చెప్తున్నది ఎంత..? అసలు కొన్నది ఎంత..?
- మీరు చెప్పిన కొనుగోలు కేంద్రానికే వెళ్దాం
- రైతులు ఏడుస్తుంటే మీ అనుచరులు డాన్సులు చేస్తారా..?
- 11 జిల్లాల్లో ఒక్క మెట్రిక్ టన్ను ధాన్యమైనా కొనుగోలు చేశారా..?
- మంత్రి గంగులకు మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ సవాల్

ధాన్యం కొనుగోళ్లపై మంత్రి గంగుల కమలాకర్ కు మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ సవాల్ విసిరారు. ధాన్యం కొనుగోళ్లలో మంత్రి గంగుల కమలాకర్ చెప్తున్నది అవాస్తవాలే అని విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా ఐకెపి సెంటర్ల ద్వారా ధాన్యం కొనుగోలుకు సంబంధించి రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ గారు అవస్తవాలు చెబుతూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు.

రాష్ట్రవ్యాప్తంగా ఐదు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడం జరిగిందని మంత్రి గంగుల కమలాకర్ చెబుతున్నారు, కానీ రాష్ట్ర ప్రభుత్వ పౌరసరఫరాల శాఖ అధికారిక వెబ్సైట్ వివరాల ప్రకారం తేదీ 27 ఏప్రిల్ 2023 నాటికి రాష్ట్రవ్యాప్తంగా కేవలం 4 లక్షల 81 వేల 44 మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే కొనుగోలు జరిగిందన్నారు. అందులో 11 జిల్లాల్లో ఇప్పటివరకు ఒక్క ధాన్యపు గింజ కొనుగోలు జరగలేదని, ఆరు జిల్లాల్లో 1 మెట్రిక్ టన్నుల లోపు, ఎనిమిది జిల్లాల్లో 2000 మెట్రిక్ టన్నుల లోపు మిగతా ఏడు జిల్లాల్లో నిజామాబాద్ 1 లక్షా 50 వేల 016 మెట్రిక్ టన్నులు, కామారెడ్డి 26,042 మెట్రిక్ టన్నులు, జనగాం 3696 మెట్రిక్ టన్నులు, ఖమ్మం 8198 మెట్రిక్ టన్నులు, నల్గొండ 1,59,040 మెట్రిక్ టన్నులు, సూర్యాపేట 52,702 మెట్రిక్ టన్నులు, వనపర్తి 14,816 మెట్రిక్ టన్నులు, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల ప్రాతినిధ్యం వహిస్తున్న కరీంనగర్ జిల్లాలో కేవలం 2,267 మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే కొనుగోలు జరిగిందని స్పష్టం అవుతుందన్నారు మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్.

ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలులో జాప్యం చేయడం వలన, ముందస్తుగా తీసుకోవలసిన జాగ్రత్తలు, చేయవలసిన ఏర్పాట్ల విషయంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమవడం వలన అకాల వర్షాలతో రోడ్లపై కుప్పలుగా పోసిన ధాన్యం వర్షం నీటిలో కొట్టుకుపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. హుజురాబాద్ నియోజకవర్గంలో రోడ్లపై పోసిన వరి ధాన్యం ఇందుకు నిదర్శనం, ఈ పరిస్థితుల్లో రైతులను కదిలిస్తే కన్నీరు పెడుతున్నారని పొన్నం ప్రభాకర్ అన్నారు. రైతులను ఆదుకోవలసిన రాష్ట్ర ప్రభుత్వం మాత్రం నష్టపరిహారం ప్రకటించకపోగా, తడిసిన ధాన్యాన్ని కొనకుండా, తాలు, తరుగు, తేమ పేరుతో కోతలు విధిస్తూ రైతులను ఆవేదనకు గురిచేస్తుందని ఆరోపించారు.

ఒక కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోనే దాదాపు నాలుగు లక్షల మెట్లు టన్నుల ధాన్యం లభ్యమవుతుండగా మంత్రి ఈ ప్రాంతం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ దాదాపు నెలరోజుల నుండి ధాన్యం కొనుగోలు సెంటర్ల వద్ద అందుబాటులో ఉన్నప్పటికీ  కొనుగోలు చేసింది కేవలం 2,267 ధాన్యం మాత్రమే కొనడం మంత్రి పాలనకు నిదర్శనం అన్నారు పొన్నం.

ఇప్పటికైనా బాధ్యత గల మంత్రి పదవిలో ఉంటూ ధాన్యం కొనుగోలు విషయంలో అవస్తవాలను చెబుతూ అటు రైతులను ఇటు ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం మానుకోవాలని మంత్రి గంగుల కమలాకర్ కు మాజీ ఎంపీ పొన్నం సూచించారు. అకాల వర్షాలు, వడగండ్ల వానలతో నష్టపోయిన రైతులకు ఎకరానికి 25 వేల రూపాయల పరిహారం అందించడంతోపాటు, కనీసం మద్దతు ధరతో పాటు తడిసిన ధాన్యం కొనుగోలు చేసి ప్రభుత్వం, పౌరసరఫరాల శాఖ మంత్రి రైతుల పట్ల తమకున్న చిత్తశుద్దిని నిరూపించుకోవాలని కోరారు.

టాప్ హెడ్ లైన్స్

Seediri Appalaraju Son Arav Arrest: పలాస హిట్ అండ్ రన్ కేసు - కాశీబుగ్గ పోలీస్ స్టేషన్‌లో మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడు ఆరవ్ లొంగుబాటు!
పలాస హిట్ అండ్ రన్ కేసు - కాశీబుగ్గ పోలీస్ స్టేషన్‌లో మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడు ఆరవ్ లొంగుబాటు!
Shabad Mass Murder Accused Selfie Video: అమ్మాయి కుటుంబం మోసం చేసింది - షాబాద్ సైకో కిల్లర్ రాజ్‌కుమార్ సెల్ఫీ వీడియోలో సంచలన విషయాలు
అమ్మాయి కుటుంబం మోసం చేసింది - షాబాద్ సైకో కిల్లర్ రాజ్‌కుమార్ సెల్ఫీ వీడియోలో సంచలన విషయాలు
INDW vs ENGW: లార్డ్స్‌ టెస్టులో ఇంగ్లండ్‌పై టీమిండియా ఉమెన్ ఘన విజయం! అబ్బాయిల ఒటమికి అమ్మాయిల ప్రతీకారం!
లార్డ్స్‌ టెస్టులో ఇంగ్లండ్‌పై టీమిండియా ఉమెన్ ఘన విజయం! అబ్బాయిల ఒటమికి అమ్మాయిల ప్రతీకారం!
Jr NTR Political Entry: జులై 18న Jr NTR పొలిటికల్ ఎంట్రీపై ప్రకటన చేస్తారా? ఇదిగో క్లారిటీ
జులై 18న Jr NTR పొలిటికల్ ఎంట్రీపై ప్రకటన చేస్తారా? ఇదిగో క్లారిటీ

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Seediri Appalaraju Son Arav Arrest: పలాస హిట్ అండ్ రన్ కేసు - కాశీబుగ్గ పోలీస్ స్టేషన్‌లో మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడు ఆరవ్ లొంగుబాటు!
పలాస హిట్ అండ్ రన్ కేసు - కాశీబుగ్గ పోలీస్ స్టేషన్‌లో మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడు ఆరవ్ లొంగుబాటు!
Shabad Mass Murder Accused Selfie Video: అమ్మాయి కుటుంబం మోసం చేసింది - షాబాద్ సైకో కిల్లర్ రాజ్‌కుమార్ సెల్ఫీ వీడియోలో సంచలన విషయాలు
అమ్మాయి కుటుంబం మోసం చేసింది - షాబాద్ సైకో కిల్లర్ రాజ్‌కుమార్ సెల్ఫీ వీడియోలో సంచలన విషయాలు
INDW vs ENGW: లార్డ్స్‌ టెస్టులో ఇంగ్లండ్‌పై టీమిండియా ఉమెన్ ఘన విజయం! అబ్బాయిల ఒటమికి అమ్మాయిల ప్రతీకారం!
లార్డ్స్‌ టెస్టులో ఇంగ్లండ్‌పై టీమిండియా ఉమెన్ ఘన విజయం! అబ్బాయిల ఒటమికి అమ్మాయిల ప్రతీకారం!
Jr NTR Political Entry: జులై 18న Jr NTR పొలిటికల్ ఎంట్రీపై ప్రకటన చేస్తారా? ఇదిగో క్లారిటీ
జులై 18న Jr NTR పొలిటికల్ ఎంట్రీపై ప్రకటన చేస్తారా? ఇదిగో క్లారిటీ
Andhra Pradesh RTGS: భార్య బైక్ కొట్టేసిన భర్త! పట్టించిన చంద్రబాబు టెక్నాలజీ! ఒక్క దెబ్బకు 80 కేసులు ఛేదించిన పోలీసులు!
భార్య బైక్ కొట్టేసిన భర్త! పట్టించిన చంద్రబాబు టెక్నాలజీ! ఒక్క దెబ్బకు 80 కేసులు ఛేదించిన పోలీసులు!
One Nation One Election Bill: దేశ రాజకీయాల్లో మహా మార్పులు! వన్ నేషన్-వన్ ఎలక్షన్, 850 లోక్‌సభ సీట్లు.. మహిళా రిజర్వేషన్ల అసలు కథ!
దేశ రాజకీయాల్లో మహా మార్పులు! వన్ నేషన్-వన్ ఎలక్షన్, 850 లోక్‌సభ సీట్లు.. మహిళా రిజర్వేషన్ల అసలు కథ!
virat Kohli Records: 6 నెలల తరువాత బ్లూ జెర్సీలో విరాట్ కోహ్లీ.. రికార్డుల వేటకు కింగ్ రెడీ
6 నెలల తరువాత బ్లూ జెర్సీలో విరాట్ కోహ్లీ.. రికార్డుల వేటకు కింగ్ రెడీ
Jagan Mohan Reddy Lone Battle: మిత్రుల వేటలో అలసిపోతున్న జగన్‌ - వైసీపీ ఒంటరి పోరాటం - కూటమి కట్టే ఆప్షన్ లేదా?
మిత్రుల వేటలో అలసిపోతున్న జగన్‌ - వైసీపీ ఒంటరి పోరాటం - కూటమి కట్టే ఆప్షన్ లేదా?
Embed widget