Jayashankar Bhupalapally : జయశంకర్ భూపాలపల్లిలో విషాదం- గోదావరిలో ఆరుగురు గల్లంత
Jayashankar Bhupalapally : గోదావరి జిల్లాలో ఈతకు వెళ్లి యువకులు గల్లంతైన ఘటన మరువక ముందే తెలంగాణలో అలాంటి విషాదమే జరిగింది.

Jayashankar Bhupalapally : తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లిలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. మేడిగడ్డ వద్ద ఆరుగురు వ్యక్తులు గల్లంతయ్యారు. ఇద్దరు సురక్షితంగా బయటపడ్డారు. మిగతా వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. రాత్రి వేళ కావడంతో సెర్చింగ్ ఆపరేషన్‌కు ఆటంకం ఏర్పడుతోంది.
భూపాలపల్లి జిల్లాలో మహదేవపూర్ మండలం అంబటిపల్లి సమీపంలోని మేడిగడ్డ బ్యారేజీలోకి ఈతకు వెళ్లి ఆరుగురు యువకులు గల్లంతయ్యారు. నలుగురు యువకులు మధుసూదన్, శివ మనోజ్, రక్షిత్, సాగర్ అంబటిపల్లి గ్రామానికి చెందినవారు. పాండు అనే యువకుడిది మహాముత్తారం మండలం కొర్లకుంట గ్రామం. రాహుల్ హన్మకొండలో చదువుతున్నాడు. ఆరుగురు యువకులు గల్లంతు అయ్యారు. అంబటిపల్లి చెందిన శివమణి సురక్షితంగా బయటపడ్డాడు. వీరంతా సరదాగా వెళ్లి నీటిలోకి దిగారు. చీకటి కావడంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడింది.





















