By: ABP Desam | Updated at : 10 Apr 2023 09:55 AM (IST)
Edited By: jyothi
గత ఎన్నికల్లో అవకతవకలు జరిగాయంటూ రచ్చ - నేడు స్ట్రాంగ్ రూం తెరవనున్న అధికారులు ( Image Source : అడ్లూరి లక్ష్మణ్ కుమార్, కొప్పుల ఈశ్వర్ (ఫైల్ ఫోటోలు) )
Jagitial News: జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గంలో రాజకీయ రగడ కొనసాగుతోంది. నాలుగేళ్ల క్రితం జరిగిన ఓట్ల లెక్కింపులో అవకతవకలు జరిగాయంటూ.. మంత్రి కొప్పుల ఈశ్వర్ ఎన్నిక చెల్లదంటూ ఆయన ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్ పోరాటం చేస్తున్నారు. ఈ వివాదంపై హైకోర్టును కూడా ఆశ్రయించారు. అయితే 2018లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో కొప్పుల ఈశ్వర్ అక్రమంగా గెలిచారంటూ ఆరోపించారు. ఈ క్రమంలోనే హైకోర్టు ఆదేశాలతో జిల్లా కలెక్టర్ స్ట్రాంగ్ రూంను తెరవనున్నారు.
గత ఎన్నికల్లో ఫలితాలు తారుమారు అయ్యాయని.. ధర్మపురి అసెంబ్లీ కాంగ్రెస్ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ రీకౌంటింగ్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. 441 ఓట్ల తేడాతో తాను ఓడిపోవడంతో... ఓట్ల లెక్కింపులు అవకతవకలు జరిగాయని పోరాటం చేస్తున్నారు. ఈ క్రమంలోనే మళ్లీ రీకౌంటింగ్ చేయాలని కోరారు. ఇరువైపులా వాదనలు విన్న ధర్మాసనం పలు కీలక డాక్యమెంట్లను సమర్పించాలని చెప్పింది. హైకోర్టు ఆదేశాలతో జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారుల ఆధ్వర్యంలో సోమవారం ఉదయం 10 గంటలకు ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూంను తెరవబోతున్నారు. అందులో ఉన్న కీలక డాక్యుమెంట్లను నిర్ణీత తేదీలోగా న్యాయస్థానానికి అందజేయబోతున్నట్లు తెలుస్తోంది.
అసలేం జరిగిందంటే..?
2018 శాసనసభ ఎన్నికల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ధర్మపురి నియోజకవర్గం నుంచి ప్రస్తుత మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ తరఫున పోటీ చేశారు. ఈయనకు పోటీగా కాంగ్రెస్ నుంచి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ బరిలో దిగారు. నువ్వానేనా అన్నట్టుగా జరిగిన ఆ ఎన్నికల్లో అతి తక్కువ మెజారిటీతో కొప్పుల ఈశ్వర్ విజయం సాధించినట్లు ఓట్ల లెక్కింపు తర్వాత అధికారులు ప్రకటించారు. అయితే, సరిగ్గా లెక్కించకుండా గెలిచినట్లు ప్రకటించారని కాంగ్రెస్ నేతలు అప్పట్లో అధికారులకు ఫిర్యాదు చేశారు. రెండో స్థానంలో నిలిచిన లక్ష్మణ్ తో పాటు కాంగ్రెస్ పార్టీ నేతలు కార్యకర్తలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ దీనిపై న్యాయస్థానం సైతం ఆశ్రయిస్తామని అప్పట్లోనే ప్రకటించారు.
సీనియర్ నేతగా పేరు ఉన్న కొప్పుల ఈశ్వర్ ఓటమి భయంతోనే గెలుపు కోసం అడ్డదారులు తొక్కారని అడ్లూరు లక్ష్మణ్ ఆరోపించారు. కొప్పుల ఈశ్వర్ గెలిస్తే మంత్రి పదవి ఖాయమని ప్రచారం జరగడంతో అనేక ప్రలోభాలకు గురి చేసి ఎన్నికల్లో పోటీ పడ్డారని, అయినప్పటికీ చివరి నిమిషంలో ఓడిపోతారని భయంతో అధికారుల అండ చూసుకుని తప్పుడు మార్గంలో గెలిచారని ఆరోపించారు. ఇంత చేసినప్పటికీ కేవలం 441 ఓట్ల మెజారిటీ మాత్రమే రావడంపై కాంగ్రెస్ కూడా అనుమానం వ్యక్తం చేసింది. అయితే వీవీ ప్యాట్ల ద్వారా వచ్చిన ఓట్లను లెక్కించక ముందే అధికారులు కొప్పుల ఈశ్వర్ పేరు ప్రకటించడం కూడా వివాదాస్పదమైంది.
దీనిపై కాంగ్రెస్ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హైకోర్టును ఆశ్రయించారు. అయితే ఆయన పిటిషన్ ను తిరస్కరించాలంటూ మంత్రి కొప్పుల ఈశ్వర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 2022 జూన్ 28వ తారీఖున ఆ పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. దీంతో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సదరు పిటిషన్ పై జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ సుందరేష్ లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. హైకోర్టు తీర్పు సవాల్ చేస్తూ మంత్రి ఈశ్వర్ తరఫున న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు. అయితే వారి వాదనతో విభేదించిన న్యాయవాదులు విజ్ఞప్తి చేయగా అందుకు అనుమతి ఇస్తూనే పిటిషన్ కొట్టివేస్తున్నట్లు ధర్మాసనం ప్రకటించింది. దీంతో ధర్మపురి ఎన్నికలకు సంబంధించి 2018 లో మొదలైన వివాదం మరో మలుపు తిరిగింది. మళ్లీ కేసు హైకోర్టుకు రాగా.. విచారణ జరుగుతోంది. ఈ క్రమంలోనే నేడు స్ట్రాంగ్ రూంను తెరవనున్నారు.
TS Police DV: పోలీసు అభ్యర్థులకు అలర్ట్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ తేదీలు ఖరారు! ఇవి తప్పనిసరి!
Group 1 Exam: 'గ్రూప్-1' ప్రిలిమ్స్ పరీక్ష వాయిదాపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు, ఏమందంటే?
TS Inter Exams: ఇంటర్ సప్లిమెంటరీ హాల్టికెట్లు విడుదల, పరీక్షల షెడ్యూలు ఇలా!
బీజేపీ అధినాయకత్వం నుంచి ఈటలకు పిలుపు, కీలక పదవి అప్పగించే ఛాన్స్ !
చెరువుల పండుగలో అపశ్రుతి- నాటు పడవలో వెళ్తూ నీటిలో పడిపోయిన మంత్రి గంగుల
KCR Good News: దివ్యాంగులకు సీఎం కేసీఆర్ తీపి కబురు - వచ్చే నెల నుంచే అమలు
Varun Tej, Lavanya Engagement: తన ‘లవ్’తో వరుణ్ తేజ్ ఎంగేజ్మెంట్ - ఇవిగో ఫొటోలు
Apsara Murder Case Update : అప్సర హత్య వెనుక ఇన్ని కోణాలున్నాయా ? - మర్డర్ మిస్టరీలో పోలీసులు చెప్పిన సంచలన విషయాలు !
Schools Reopen: వేసవి సెలవులు పొడిగింపు ప్రచారం - విద్యాశాఖ ఏం చెప్పిందంటే?