Karimnagar: కరీంనగర్‌లోని ప్రముఖ హోటళ్లలో ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు, ఆహార కల్తీకి అవాక్కైన అధికారులు!
Karimnagar News: ఓ హోటల్‌లో మిరియాల స్థానంలో పుప్పొడి గింజలను వేస్తున్నట్టు ఆహార భద్రత అధికారులు గుర్తించారు. 2021-22 నాటి ఇన్ గ్రేడియంట్స్ తో మసాలాలుగా వాడుతుండటంపై అధికారులు నిశ్ఛేష్ఠులయ్యారు.
Karimnagar Food Safety Officers: కరీంనగర్ లోని పలు హోటళ్లపై ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు చేశారు. వరంగల్ నుంచి వచ్చిన టాస్క్ ఫోర్స్ సేఫ్టీ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ అమృతశ్రీతో పాటు.. పలు అధికారులు ఈ తనిఖీలు నిర్వహించారు. ఆకస్మికంగా చేసిన దాడులతో.. ఒక్కసారిగా హోటల్స్ యాజమాన్యాలు బెంబేలెత్తగా... హోటళ్లలో నిష్ఠూరమైన నిజాలు బయటపడ్డాయి. మిరియాల పేరుతో పుప్పొడి గింజలను వేస్తున్నట్టు గుర్తించారు. 2021-22 సమయంలోని ఇన్ గ్రేడియంట్స్ ను మసాలాలుగా వాడుతుండటంపై అధికారులు నిశ్ఛేష్ఠులయ్యారు.
ఇదంతా ఓ ప్రముఖ స్టార్ హోటల్ లో బట్టబయలైంది. మొత్తంగా కల్తీ నూనెలు, కాలం చెల్లిన వంట సామాన్లు, మసాలా దినుసులను గుర్తించిన అధికారులు హోటల్ యాజమాన్యాలకు నోటీసులు అందించినట్టు తెలిపారు. మరిన్ని హోటల్స్ లో కూడా సాయంత్రం వరకు ఈ తనిఖీలు జరుగుతాయని.. ఫుడ్ సేఫ్టీ యాక్ట్స్ ప్రకారం చర్యలు కూడా ఉంటాయని అమృత శ్రీ తెలిపారు.