తీరిన కరీంనగర్ వాసుల నాలుగు దశాబ్దాల బాల భవన్ కల..
కరీంనగర్ వాసుల కల నెరవేరింది. ఎన్నో ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్న బాలభవన్ అందుబాటులోకి వచ్చింది. ఇకపై పూర్తి స్థాయిలో సంగీతం పాఠాలు నేర్చుకోవచ్చని విద్యార్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఎందరో కళాకారులు, రచయితలు, సినీ ప్రముఖులు కరీంనగర్ నుంచి అంతర్జాతీయ ఖ్యాతి గడించారు. అలాంటి సంగీతం, నృత్యం, సాహిత్యం గురించి నేర్పించడానికి ఇక్కడ ఒక ప్రభుత్వ సంగీత పాఠశాల మాత్రమే అందుబాటులో ఉంది. అదీ మంథనిలో ఉండటంతో దూరం వల్ల కరీంనగర్ కేంద్రంలో ఉన్న బాలలకు కళలను నేర్పించే అవకాశమే లేదు.
1970లో అప్పటి కరీంనగర్ జిల్లా కలెక్టర్ SV సుబ్రమణ్యన్ బాల భవన్‌కి సంబంధించి భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. కానీ కరీంనగర్‌కి అప్పటి నుంచి దక్కింది బాల కేంద్రం మాత్రమే . వీటి మధ్య తేడా ఏంటంటే ఒక బాల కేంద్రంలో కేవలం పార్ట్ టైంగా మాత్రమే సంగీతం, నృత్యం, ఇతర కళలు నేర్పించే టీచర్లు ఉంటారు. ఒక రోజులో కేవలం 3 గంటలు మాత్రమే సంగీత నృత్యం నేర్పిస్తారు. కానీ బాలభవన్‌లో మాత్రం ఫుల్ టైంగా సిబ్బందిని ప్రభుత్వం నియమిస్తుంది.
1970 లో నాందిపడిన బాల భవన్ ఆశ ఈ మధ్య 2021లో నెరవేరింది. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న బాల కేంద్రాల్లో మూడింటినీ బాలభవన్‌గా మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో కరీంనగర్ బాలభవన్ కూడా ఒకటి. దీంతో ఎన్నో ఏళ్లుగా ఇక్కడ వేచి చూస్తున్న విద్యార్థినీ విద్యార్థులు, తల్లిదండ్రులు బాల కేంద్రం అప్‌గ్రేడ్ విషయం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. మరోవైపు బాల కేంద్రం ఉన్న సమయంలోనే తాము జాతీయ స్థాయిలో సైతం పతకాలను అందుకున్నామని అలాంటిది ఇపుడు ప్రభుత్వ ప్రోత్సాహం వల్ల బాలభవన్ ఏర్పాటు అవడంతో తాము మరింత ఉత్సాహంగా పని చేస్తామని సూపరిండెంట్ మంజులాదేవి అంటున్నారు
కరీంనగర్ విద్యార్థినీ విద్యార్థులకు ఇది గొప్ప వరం అన్న సూపరిండెంట్ పిల్లలకు ఉచితంగా నేర్పే ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.
తాము గత 20 ఏళ్లుగా బాల కేంద్రంలో పని చేస్తున్నామని, ఎంతో మంది విద్యార్థినీ విద్యార్థులకు నృత్యంలో శిక్షణ అందించామని తమకు బాల భవన్ ఏర్పాటు చేయడం వల్ల ఇక పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంటామని డ్యాన్స్ టీచర్ రాధాకృష్ణ అంటున్నారు
బాల కేంద్రంలో నేర్చుకున్న తాను రాష్ట్ర స్థాయిలో సైతం పతకాలు సాధించానని తిరుపతితో పాటు అనేక ప్రాంతాల్లో కళా ప్రదర్శనలు ఇచ్చానని విద్యార్థిని అమిత్ర అంటున్నారు. బాల కేంద్రం అప్‌గ్రేడ్ పట్ల తమ ఆనందం వ్యక్తం చేశారు
ఆర్థికపరమైన కారణాలతో నేర్చుకోలేని వారికి బాలభవన్ ఒక వరములా మారిందని , తమ పాపని సైతం గత ఆరేళ్లుగా ఇక్కడికి పంపిస్తున్నానని తల్లిదండ్రులు అంటున్నారు. ఏది ఏమైనా ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి కళలకు కేంద్రంగా ఉండే ఇలాంటి వాటిని ప్రోత్సహించడం అభినందనీయం..
Also Read: CPS Cancellation: సీపీఎస్ రద్దుపై ఉద్యోగుల ఆశలు ఆవిరి.. చేతులెత్తేసిన ప్రభుత్వం!
Also Read: యువనేతలకు నామినేటెడ్ పదవులు.. క్యాడర్‌లో జోష్ నింపుతున్న కేసీఆర్ !
Also Read : ఓ వైపు పథకాల సమీక్షలు..మరో వైపు జిల్లాల పర్యటనలు .. ఇక కేసీఆర్ బిజీ బీజీ !
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి





















