Kavitha Bail: కవిత లాయర్ ముకుల్ రోహత్గీ గంటకు తీసుకునే ఫీజు వాచిపోద్ది!
Mukul Rohatgi Fee: దేశంలోనే టాప్ లాయర్లలో ఒకరిగా ముకుల్ రోహత్గీ ఉన్నారు. ఈ క్రమంలో కవిత తరపున ఆమె బెయిల్ కోసం సుప్రీంకోర్టులో ఈయనే వాదించారు.
Kalvakuntla Kavitha News: ఎట్టకేలకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha)కు బెయిల్ మంజూరు అయింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఈడీ కేసులో ఆమెకు సుప్రీంకోర్టు షరుతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. దాదాపుగా గంటన్నరట పాటు వాదానలు జరిగాయి. దర్యాప్తు సంస్థల తరఫున లాయర్ ఎస్వీ రాజు, కవిత (Kalvakuntla Kavitha) తరఫున ముకుల్ రోహత్గీ తమ వాదనలు వినిపించారు. ఫైనల్ గా కవిత (Kalvakuntla Kavitha) బెయిల్ కు అర్హురాలని ముకుల్ రోహత్గీ (Mukul Rohatgi) వాదనలతో ఏకీభవించిన సుప్రీంకోర్టు కవిత (Kavitha)కు బెయిల్ ఇచ్చింది.
దేశంలోనే అగ్రశ్రేణి న్యాయవాదులలో ఒకరిగా ముకుల్ రోహత్గీ (Mukul Rohatgi) కొనసాగుతున్నారు. ఈ క్రమంలో కవిత (Kavitha) తరపు లాయర్ ముకుల్ రోహత్గీ గురించి పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. ఆయనకు క్లైంట్స్ ఇచ్చే ఫీజుపై కూడా ఆసక్తి నెలకొంది. తమ కేసులను వాదించుకునేందుకు ఈయన్ను నియమించుకోవాలంటే.. గంటల సమయం లెక్కన ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఈయన గంటకు రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు ఫీజు ఛార్జ్ చేస్తారని చెబుతుంటారు. న్యాయ నిపుణుడే కాక, వివిధ క్లిష్టమైన కేసులను కూడా ఒంటి చేత్తో గెలిచిన వ్యక్తిగా రోహత్గీకి పేరుంది.
ఢిల్లీ హైకోర్టులో జడ్జి
ముకుల్ రోహత్గీ (Mukul Rohatgi) 1955 ఆగస్టు 17న ముంబయిలో జన్మించాడు. గతంలో ఢిల్లీ హైకోర్టులో న్యాయమూర్తిగా పని చేశారు. ప్రస్తుతం సుప్రీం కోర్టులో సీనియర్ న్యాయవాదిగా ఉన్నారు. ఈయన తండ్రి పేరు జస్టిస్ అవధ్ బిహారీ రోహత్గీ. ఈయన కూడే న్యాయవాది. ప్రస్తుతం ఇండియాలో అగ్రశ్రేణి న్యాయవాదులలో ఒకరైన రోహత్గీ ముంబయిలోని గవర్నమెంట్ లా కాలేజీలో న్యాయ విద్యను పూర్తి చేశారు. ఆ తరువాత ఢిల్లీ హైకోర్టులో యోగేష్ కుమార్ సబర్వాల్ వద్ద ప్రాక్టిస్ స్టార్ట్ చేశాడు. అలా అంచలాంచలుగా ఎదిగారు.. ముకుల్. వసుధ రోహత్గీని వివాహం చేసుకున్నారు. ఈమె కూడా లాయరే. వీరికి నిఖిల్ రోహత్గి, సమీర్ రోహత్గీ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. భారత ప్రభుత్వం ముకుల్ రోహత్గీ (Mukul Rohatgi) 1999 నవంబర్ లో ఐదేళ్లపాటు భారత అదనపు సొలిసిటర్ జనరల్‌గా నియమించింది.
తర్వాత 19 జూన్ 2014 నుండి 18 జూన్ 2017 వరకు NDA ప్రభుత్వంలో భారతదేశ అటార్నీ జనరల్‌గా నియమితులు అయ్యారు. ముకుల్ తన పదవీకాలంలో ట్రిపుల్ తలాక్, మణిపూర్ నకిలీ ఎన్‌కౌంటర్ కేసు, జాతీయ న్యాయ నియామకాల కమిషన్, ఆధార్ కేసు వంటి విజయవంతమైన కేసులను వాదించారు. అటల్ బిహారీ బాజ్‌పేయి ప్రభుత్వ హయాంలో లా ఆఫీసర్‌గా కూడా పనిచేసిన రోహత్గీ 2002 అల్లర్లు , బూటకపు ఎన్‌కౌంటర్ కేసులలో గుజరాత్ ప్రభుత్వం తరపున సుప్రీంకోర్టులో వాదించారు. ముకుల్ హై ప్రోఫైల్ కేసులే ఎక్కువగా వాదిస్తారన్న పేరుంది. ఈయన గంటకు రూ.10లక్షల నుంచి రూ.15లక్షల వరకు ఫీజు ఛార్జ్ చేస్తారని తెలుస్తోంది.
ఆర్నెల్లుగా జైల్లోనే కవిత (Kalvakuntla Kavitha)
మార్చి 15న లిక్కర్ కేసులో కవిత ను ఈడీ అరెస్ట్ చేసింది. ఈక్రమంలో ఆమె పలుమార్లు బెయిల్ కోసం ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. ఈ సారి కవిత తరపు లాయర్ రోహత్గీ బలంగా తన వాదానలు వినిపించారు. ఢిల్లీ లిక్కర్ పాలసీలో రూ.100 కోట్లు చేతులు మారాయన్నది ఆరోపణ మాత్రమే. కేసులో 493 మంది సాక్షులను విచారించారు. కవిత ఎవరినీ బెదిరించలేదు. ఆమె దేశం విడిచి వెళ్లే అవకాశమే లేదు. కవిత కు బెయిల్ పొందే అర్హత ఉంది అంటూ తన వాదనలను బలంగా వినిపించారు.