అన్వేషించండి

Kalvakuntla Kavitha Uppal Bhagayat Protest: ఉప్పల్ భగాయత్ లో తీవ్ర ఉద్రిక్తత.. తెలంగాణ రక్షణ సేన భూపోరాటంలో కవితకు గాయాలు.. అరెస్ట్!

Hyderabad land agitation clashes: తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత చేపట్టిన భూపోరాటం ఉద్రిక్తతకు దారితీసింది.

TRS chief Kavitha arrested Bollaram PS: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలర్పించిన, పోరాడిన ఉద్యమకారులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలంటూ గురువారం  నాడు ఉప్పల్ భగాయత్ వేదికగా తలపెట్టిన  భూపోరాటం  తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. తెలంగాణ రక్షణ సేన   అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా వందలాది మంది ఉద్యమకారులు, పార్టీ శ్రేణులు ఈ ఆందోళనలో పాల్గొనేందుకు తరలి రావడంతో ఉప్పల్ నియోజకవర్గ వ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించినట్లుగా ప్రతి ఉద్యమకారుడికి 250 గజాల ప్రభుత్వ ఇళ్ల స్థలాన్ని తక్షణమే కేటాయించాలనే ప్రధాన డిమాండ్‌తో ఈ నిరసన చేపట్టారు.  

ముందస్తు వ్యూహంలో భాగంగా ఉప్పల్ భగాయత్ గ్రౌండ్స్‌లో నిర్వహించాలనుకున్న భూపోరాట సభను పోలీసులు భారీ బారికేడ్లతో అడ్డుకోవడంతో కవిత తన వ్యూహాన్ని మార్చారు. ఎలాగైనా నిరసన గళాన్ని వినిపించి తీరుతామని సభా వేదికను మేడిపల్లి - చెంగిచెర్ల, బోడుప్పల్ సరిహద్దుల్లో ఉన్న భగయత్ నగర్ మైదానానికి మార్చారు. కవిత నేతృత్వంలో కార్యకర్తలంతా ఒక్కసారిగా ఆ ప్రాంతానికి దూసుకెళ్లడంతో అక్కడ ఒక్కసారిగా హైడ్రామా నెలకొంది. అయితే అప్పటికే విషయం తెలుసుకున్న వందలాది మంది పోలీస్ బలగాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి ఆందోళనకారులను నిలువరించే ప్రయత్నం చేశాయి.

 

 

ఈ క్రమంలో పోలీసులకు, తెలంగాణ రక్షణ సేన శ్రేణులకు మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం, తోపులాట చోటుచేసుకుంది. నిరసనకారులను చెల్లాచెదురు చేసేందుకు పోలీసులు గట్టిగా ప్రయత్నించడంతో అక్కడ లాఠీచార్జ్ జరిగినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ తీవ్రమైన తోపులాట  మధ్య కల్వకుంట్ల కవిత నియంత్రణ కోల్పోయి కిందపడిపోయారు. ఈ ప్రమాదంలో ఆమెకు చేతులు, మోకాళ్లకు స్వల్ప గాయాలైనట్లు సమాచారం. ప్రభుత్వం తాము అడిగిన న్యాయమైన డిమాండ్లపై చర్చించకుండా, ఇలా పోలీసులతో దాడులు చేయించడం ప్రజాస్వామ్యమా అని కవిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

అనంతరం అత్యంత నాటకీయ పరిణామాల మధ్య పోలీసులు కవితను, ఇతర ముఖ్య నేతలను బలవంతంగా లాక్కెళ్లి పోలీస్ వాహనాల్లోకి ఎక్కించారు. ఆమెను అదుపులోకి తీసుకున్న భద్రతా బలగాలు అక్కడి నుండి నేరుగా బొల్లారం పోలీస్ స్టేషన్‌కు తరలించాయి. తాము కేవలం ఎన్నికల హామీలను నెరవేర్చాలని శాంతియుతంగా పోరాడుతుంటే, ప్రభుత్వం లాఠీలు, రబ్బరు తూటాలతో భయపెట్టాలని చూస్తోందని, ఇలాంటి చర్యలకు తాము భయపడబోమని కవిత స్టేషన్ నుంచి ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. కవిత అరెస్ట్ వార్త తెలియడంతో బొల్లారం పోలీస్ స్టేషన్ వద్దకు టీఆర్‌ఎస్ కార్యకర్తలు భారీగా చేరుకోవడంతో అక్కడ భారీ భద్రతను ఏర్పాటు చేశారు.

ఈ భూపోరాట పరిణామాలు తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా వేడిని పెంచాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యమకారుల సంక్షేమాన్ని విస్మరించి, భూములను కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టేందుకు కుట్రలు చేస్తోందని, కానీ తమ పార్టీ నిరుద్యోగులు, మహిళలు, ఉద్యమకారుల పక్షాన నిరంతరం పోరాడుతుందని కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. ఈ ఘటనతో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నాటికి 'తెలంగాణ రక్షణ సేన' క్షేత్రస్థాయిలో మరింత దూకుడుగా వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్లు పొలిటికల్ సర్కిల్స్‌లో విశ్లేషణలు వస్తున్నాయి.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

NEET UG 2026 Counselling: ఎంబీబీఎస్‌ ఆల్‌ ఇండియా కోటా కౌన్సెలింగ్‌ నేటి నుంచి ప్రారంభం! కొత్త రూల్స్‌ ఇవే!
ఎంబీబీఎస్‌ ఆల్‌ ఇండియా కోటా కౌన్సెలింగ్‌ నేటి నుంచి ప్రారంభం! కొత్త రూల్స్‌ ఇవే!
Telangana Cabinet Expansion 2026: కర్ణాటక కేబినెట్ అలకల సీన్‌తో రేవంత్ రెడ్డి ప్లాన్ బీ - తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై కొత్త వ్యూహం!?
2026: కర్ణాటక కేబినెట్ అలకల సీన్‌తో రేవంత్ రెడ్డి ప్లాన్ బీ - తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై కొత్త వ్యూహం!?
Ethanol EV Charger: ఈవీ ఛార్జింగ్‌లో కొత్త విప్లవం.. తెలంగాణలో ఇథనాల్ ఆధారిత ఛార్జర్ ప్రారంభం!
ఈవీ ఛార్జింగ్‌లో కొత్త విప్లవం.. తెలంగాణలో ఇథనాల్ ఆధారిత ఛార్జర్ ప్రారంభం!
Telangana Police Vehicle Rapido: పోలీసు వాహనాన్ని ర్యాపిడో బైక్‌గా వాడేస్తున్నారు - సోషల్ మీడియాలో వీడియో వైరల్.. విచారణకు ఆదేశం!
పోలీసు వాహనాన్ని ర్యాపిడో బైక్‌గా వాడేస్తున్నారు - సోషల్ మీడియాలో వీడియో వైరల్.. విచారణకు ఆదేశం!
Advertisement

వీడియోలు

Jaya Chiravuri Serials and US Life | జయ చిరవూరి రోజుకి ఎంత సంపాదిస్తుందో తెలుసా?
Changes In Team India Support Staff | టీమిండియా సపోర్ట్ స్టాఫ్‌పై బిసిసిఐ వేటు
India Fielding Coach T Dilip Emotional Post | ఫీల్డింగ్ కోచ్‌గా ముగిసిన దిలీప్ ప్రయాణం
Virat Kohli World Record | వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసిన విరాట్ కోహ్లీ
Bumrah Ruled Out Of Test Series | శ్రీలంక టెస్ట్ సిరీస్‌ నుంచి బుమ్రా అవుట్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Amritsar Police:జంతర్ మంతర్‌లో ఐఎస్ఐ ముఠాల రెక్కీ! దాడులకు పాకిస్తాన్‌ కుట్ర! 9 మంది అరెస్టు! నిందితుల్లో నలుగురు మైనర్లు!
జంతర్ మంతర్‌లో ఐఎస్ఐ ముఠాల రెక్కీ! దాడులకు పాకిస్తాన్‌ కుట్ర! 9 మంది అరెస్టు! నిందితుల్లో నలుగురు మైనర్లు!
PM Modi Praises Nara Lokesh: నారా లోకేష్‌కు మోదీ ప్రశంసలు - ఒక్క సారి కాదు చాలా సార్లు - భవిష్యత్ నేతల్లో ఒకరిగా చూస్తున్నారా?
నారా లోకేష్‌కు మోదీ ప్రశంసలు - ఒక్క సారి కాదు చాలా సార్లు - భవిష్యత్ నేతల్లో ఒకరిగా చూస్తున్నారా?
Telangana Cabinet Expansion 2026: కర్ణాటక కేబినెట్ అలకల సీన్‌తో రేవంత్ రెడ్డి ప్లాన్ బీ - తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై కొత్త వ్యూహం!?
2026: కర్ణాటక కేబినెట్ అలకల సీన్‌తో రేవంత్ రెడ్డి ప్లాన్ బీ - తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై కొత్త వ్యూహం!?
Donald Trump: అమెరికా అధ్యక్షుడి హత్యకు కుట్ర! భగ్నం చేసిన భద్రతా బలగాలు! నిందితుడి ఇంట్లో తూటాల డంప్!
అమెరికా అధ్యక్షుడి హత్యకు కుట్ర! భగ్నం చేసిన భద్రతా బలగాలు! నిందితుడి ఇంట్లో తూటాల డంప్!
Prashant Kishor Wins: బంకీపూర్‌లో ప్రశాంత్ కిషోర్ ఎలా గెలిచారు? ఇక బీహార్‌లో బీజేపీకి ప్రత్యర్థి పీకేనేనా?
బంకీపూర్‌లో ప్రశాంత్ కిషోర్ ఎలా గెలిచారు? ఇక బీహార్‌లో బీజేపీకి ప్రత్యర్థి పీకేనేనా?
OG Sequel : మీసం తిప్పాలి కదా? - పవన్ కల్యాణ్ OG 2పై తమన్ బిగ్ అప్డేట్
మీసం తిప్పాలి కదా? - పవన్ కల్యాణ్ OG 2పై తమన్ బిగ్ అప్డేట్
NEET UG 2026 Counselling: ఎంబీబీఎస్‌ ఆల్‌ ఇండియా కోటా కౌన్సెలింగ్‌ నేటి నుంచి ప్రారంభం! కొత్త రూల్స్‌ ఇవే!
ఎంబీబీఎస్‌ ఆల్‌ ఇండియా కోటా కౌన్సెలింగ్‌ నేటి నుంచి ప్రారంభం! కొత్త రూల్స్‌ ఇవే!
The Story of Vizag Old Airport : విశాఖ నుంచి చివరి కమర్శియల్ ఫ్లైట్ -
విశాఖ నుంచి చివరి కమర్శియల్ ఫ్లైట్ - "INS డేగ" ఇక జ్ఞాపకమేనా !!
Embed widget