By: ABP Desam | Updated at : 07 Dec 2022 09:34 AM (IST)
Edited By: jyothi
కేసీఆర్(ఫైల్ ఫొటో)
Jagtial News: సీఎం కేసీఆర్ నేడు జగిత్యాల జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా జగిత్యాలలో నూతనంగా నిర్మించిన సమీకృత కలెక్టరేట్ భవన సముదాయంతోపాటు, టీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయాన్ని సీఎం ప్రారభించనున్నారు. ఆ తర్వాత పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన తర్వాత భారీ బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. జిల్లా అధికారులతో సమీక్షా నిర్వహిస్తారు.
ఉదయం 12 గంటలకు సీఎం కేసీఆర్ హెలికాప్టర్ ద్వారా ఎర్రవెల్లిలోని ఫాం హౌస్ నుంచి బయలుదేరనున్నారు. మధ్యాహ్నం 12.30 గంటలకు జగిత్యాలకు చేరుకుంటారు. 12.40 నుంచి 12.55 వరకు మొదట టీఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం చేస్తారు. అనంతరం మధ్యాహ్నం ఒంటి గంటకు 110 కోట్ల తో ఏర్పాటు కానున్న ప్రభుత్వ మెడికల్ కళాశాలకు శంకుస్థాపన చేస్తారు. తర్వాత 1.15కి నూతన కలెక్టరేట్ ప్రారంభిస్తారు. తరువాత జిల్లా అధికారులు, ప్రజాప్రతనిధులతో కలిసి నూతన కలెక్టర్ కార్యాలయంలో 3 గంటల వరకు సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. అనంతరం ప్రత్యేక బస్సు ద్వారా రోడ్డు మార్గాన 3.10కి బహిరంగ సభకు చేరుకుంటారు. అనంతరం మోతె రోడ్డులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి 4 గంటల వరకు ప్రసంగించనున్నారు.
ఏర్పాట్లు చేస్తున్న మంత్రి కొప్పుల ఈశ్వర్..
బహిరంగ సభలో పాల్గొననున్న మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, గంగుల కమలాకర్, ప్రశాంత్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, స్థానిక ఎమ్మెల్యే సంజయ్ కుమార్, చొప్పదండి వేములవాడ, కోరుట్ల ఎమ్మెల్యేలు స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొననున్నారు. అనంతరం 4.15 కి హెలికాప్టర్ హైదరాబాద్ పయనం కానున్నారు. సాయంత్రం 4.45 కి తిరిగి ఎర్రవెల్లి ఫాం హౌస్ కి చేరుకుంటారు. సభ ఏర్పాట్లను మంత్రి కొప్పుల ఈశ్వర్ సమీక్షిస్తున్నారు. జగిత్యాల, ధర్మపురితోపాటు సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ, సిరిసిల్ల, కరీంనగర్ జిల్లాలోని చొప్పదండి, కరీంనగర్, నిర్మల్ జిల్లాలోని ఖానాపూర్ నిజాంబాద్ జిల్లాలోని ఆర్మూర్, బాల్కొండ, పెద్దపెల్లి జిల్లాలోని పెద్దపెల్లి నియోజకవర్గల నుంచి జనాల్ని సమీకరిస్తున్నారు. సుమారు ఐదు జిల్లాల నుంచి 2 లక్షల మందితో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఎస్పీ సింధు శర్మ నేతృత్వంలో 2,325 మంది పోలీసులతో భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు. మొత్తం ఎడుగురు అడిషనల్ ఎస్పీలు, 11 మంది డీఎస్పీలు, 44 మంది సీఐలు, ముగ్గురు మహిళా సీఐలు, 165 ఎస్ఐలు, 13 మంది మహిళా ఎస్సైలు ఉండనున్నారు.
సీఎం కేసీఆర్ రాబోతున్న సందర్భంగా జగిత్యాల జిల్లా కేంద్రంలో పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. పట్టణంలోని అంగడి బజార్ వద్ద స్వర్గీయ కొండ లక్ష్మణ్ బాపూజీ విగ్రహం ఎదుట విగ్రహం ఎదుట కూడా ప్లెక్సీలు పెట్టారు. అయితే ఆ ఫ్లెక్సీలు కారణంగా విగ్రహం కనిపించడం లేదనే కోపంతో ఓ యువుకుడ ఫ్లెక్సీలను దహనం చేశాడు.
"కొండా లక్ష్మణ్ బాపూజీ మన తెలంగాణ జాతిపిత. మన తెలంగాణ జాతిపితకు అడ్డంగా ఫ్లెక్సీ కట్టారు. ఫ్లెక్సీ తీసేయమని కన్వీనర్ నిన్ననే చెప్పిర్రు. అయినా ఈ ఫ్లెక్సీ తీయకుండా అట్లనే ఉంచిర్రు. అందుకే నేను ఈ ఫ్లెక్సీని కాలవెడ్తున్న. మళ్లీ వచ్చి ఎవరు ఇలా అడ్డంగా ఫ్లెక్సీ కట్టినా నేను ఇలాగే చేస్తాం."- జగిత్యాల యువకుడు
Congress On Governor : బీఆర్ఎస్, బీజేపీ రెండూ ఒక్కటే, గవర్నర్ ప్రసంగంతో డ్రామా బట్టబయలు- మహేష్ కుమార్ గౌడ్
YS Sharmila : మళ్లీ కేసీఆర్ ను నమ్మితే రాష్ట్రాన్ని అమ్మేస్తారు, రైతు బంధు తప్ప అన్ని సబ్సిడీలు బంద్- వైఎస్ షర్మిల
KA Paul On TS Secretariat: నాతో పెట్టుకుంటే ఇలాగే ఉంటది - సచివాలయం అగ్నిప్రమాదంపై కేఏ పాల్ షాకింగ్ కామెంట్లు
Telangana Budget 2023 : ఇచ్చిన హామీలన్నింటికీ బడ్జెట్లో నిధులు కేటాయించండి - సీఎం కేసీఆర్కు రేవంత్ రెడ్డి బహిరంగలేఖ !
Krishna Tribunal : కొత్త కృష్ణా ట్రైబ్యునల్ ఏర్పాటుపై వీడని సందిగ్ధత, అభిప్రాయం చెప్పేందుకు ఏజీ నిరాకరణ
Thalapathy67: కత్తులు, చాక్లెట్లు, విజయ్, విలన్స్ - ప్రోమోతోనే సిక్సర్ కొట్టిన లోకేష్ కనగరాజ్ - టైటిల్ ఏంటో తెలుసా?
Amigos Trailer : ముగ్గురిలో ఒకడు రాక్షసుడు అయితే - కళ్యాణ్ రామ్ 'అమిగోస్' ట్రైలర్ వచ్చేసిందోచ్
నన్ను ఎన్ కౌంటర్ చేయించండి- కోటంరెడ్డి సంచలన వ్యాఖ్యలు
Hindenburg Research: కుబేరుడు అదానీ ఆస్తులను ఊదేస్తున్న ఈ మొండిఘటం ఎవరు !