Breaking News Telugu Live Updates: కర్ణాటక బీదర్ లో ఘోర రోడ్డు ప్రమాదం, ఐదుగురు హైదరాబాద్ వాసులు మృతి
Breaking News Telugu Live Updates: ఏపీ, తెలంగాణ రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా, అంతర్జాతీయంగా నేడు జరిగే వార్తల అప్‌డేట్స్, వివరాలు మీకోసం
LIVE
Background
నేడు యావత్ భారతావని స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్ని జరుపుకుంటోంది. అందులోనూ 75వ ఇండిపెండెన్స్ డే కావడంతో కేంద్ర ప్రభుత్వం ఈ స్పెషల్ డేని ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ గా నిర్వహిస్తోంది. అన్ని రాష్ట్ర, కేంద్ర పాలిత ప్రాంతాలు 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్ని ఘనంగా నిర్వహిస్తున్నాయి. భారత ఇండిపెండెన్స్ డే సందర్భంగా సెర్చింజన్ గూగుల్ సైతం ఇందులో భాగస్వామి అయింది. ఆగస్టు 15న దేశ స్వాతంత్ర్య దినోత్సవాన్ని సూచిస్తూ ప్రత్యేకంగా గూగుల్ డూడుల్ తయారుచేసింది.
నేటి ఇండిపెండెన్స్ డే గూగుల్ డూడుల్‌ను కేరళకు చెందిన ఆర్టిస్ట్ నీతి క్రియేట్ చేశారు. ఈ ప్రత్యేక రోజు సందర్భానికి పండుగ టచ్ ఇస్తూ గూగుల్ డూడుల్ తయారుచేశారు. ఎప్పటినుంచో వస్తున్న సంప్రదాయం.. పతంగుల పండుగను సూచిస్తూ డూడుల్ ఉంది. స్వేచ్ఛ, స్వాతంత్ర్యానికి ప్రతీకగా గాలి పటాలు ఎగురవేస్తారు. దేశ స్వాతంత్య్ర దినోత్సవాన్ని తెలియజెప్పేలా గూగుల్ ఈ ట్రెడీషనల్ టచ్ ఇస్తూ భారతీయులకు స్పెషల్ డూడుల్‌ను డెడికేట్ చేసింది.
అల్పపీడనం వాయుగుండంగా మారి, తీవ్ర వాయుగుండంగా ఉత్తర ఒడిశా వైపు కదులుతోంది. మరికొన్ని గంటల్లో తీరాన్ని దాటే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఏపీ, తెలంగాణతో పాటు యానాం, ఒడిశాలో వర్షాలు కురుస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఆదివారం సైతం పలు జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. భారీ వర్షాలు కురుస్తాయని కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, వర్ష సూచన ఉన్న మరిన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ సైతం జారీ చేశారు. ఉరుములు, మెరుపులతో వర్షాలు కురుస్తాయని, కొన్ని చోట్ల పిడుగులు పడే అవకాశం ఉందని హెచ్చరించారు. ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 1.5 కి.మీ ఎత్తు వరకు విస్తరించి ఉంది.
అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారుతోంది. దీని ప్రభావంతో సోమవారం, మంగళవారం సైతం తెలంగాణలో కొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. కొన్నిచోట్ల తేలికపాటి జల్లుల నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి. అతి భారీ వర్షాలు కురుస్తాయని కొమురం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ అయింది. ఆదిలాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ జిల్లాల్లో కొన్నిచోట్ల భారీ వర్షాలు కురుస్తాయని ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ.
తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్ర, యానాంలలో మరో రెండు రోజులపాటు వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో కొన్నిచోట్ల భారీ వర్షాలు కురవనున్నాయి. ఈ 5 జిల్లాలకు వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్ జారీ చేసింది. కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. తీరంలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. మత్స్యకారులు వేటకు వెళ్లడం అంత క్షేమదాయకం కాదని అధికారులు హెచ్చరించారు.
ఆగస్టు 15వ తేదీకి వైజాగ్ కలెక్టర్ కార్యాలయ భవనానికి విచిత్రమైన సంబంధం ఉంది. ఆగస్టు 15 అనగానే భారత స్వాతంత్య్ర దినోత్సవం అందరికీ గుర్తొస్తుంది. ఆరోజు దేశ వ్యాప్తంగా ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ ఘనంగా జరుపుకుంటాం. అయితే 1947కు ముందు ఆ తేదీకి పెద్దగా ప్రాధాన్యత ఏమీ లేదు. కానీ వైజాగ్ కలెక్టరేట్ బిల్డింగ్ కి మాత్రం ఆ డేట్ చాలా ప్రత్యేకం. ఎందుకంటే స్వాతంత్య్రం రావడానికి 34 ఏళ్ల ముందు ఆగస్టు 15 వ తేదీన వైజాగ్ కలెక్టరేట్ బిల్డింగ్ ప్రారంభమైంది. అంటే 34 ఏళ్లపాటు బ్రిటీష్ జెండా ఎగిరిన చోటే భారత జాతీయ పతాకం సగర్వంగా రెపరెపలాడుతోంది.
కర్ణాటక బీదర్ లో ఘోర రోడ్డు ప్రమాదం, ఐదుగురు హైదరాబాద్ వాసులు మృతి
కర్ణాటక బీదర్‌లోని ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో హైదరాబాద్ కు చెందిన ఐదుగురు మృతిచెందారు. దేవదర్శనం కోసం వెళ్లిన ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఐదుగురు గాయపడ్డారు. కంటైనర్‌ను కారు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. నలుగురు ఘటనాస్థలిలోనే మృతి చెందగా, మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందతూ చనిపోయారు. మృతులు హైదరాబాద్ బేగంపేట వాసులుగా తెలుస్తోంది.
రాజ్ భవన్ ఎట్ హోమ్ కార్యక్రమానికి హాజరు కానీ సీఎం కేసీఆర్, ఎమ్మెల్యేలు
Governor At Home తెలంగాణ రాజ్ భవన్ ఎట్ హోమ్ కార్యక్రమానికి సీఎం కేసీఆర్, ఎమ్మెల్యేలు హాజరుకాలేదు. చివరి నిమిషంలో సీఎం కేసీఆర్ ప్రొగ్రామ్ రద్దు చేసుకున్నారు. అంతకు ముందు సీఎం కేసీఆర్ హాజరవుతారని సీఎంవో నుంచి గవర్నర్ కార్యాలయానికి సమాచారం వచ్చింది. కానీ ఆఖరి నిమిషంలో సీఎం కేసీఆర్ ప్రొగ్రామ్ రద్దు అయింది.
హైదరాబాద్ శివారులో కాల్పుల కలకలం
హైదరాబాద్ శివారులో కాల్పుల కలకలం రేగింది. టీఆర్ఎస్వీ నేతలు గాల్లోకి కాల్పులు జరిపారు. ఆ దృశ్యాలను వాట్సాప్ స్టేటస్ లలో పెట్టుకున్నారు. ఈ వీడియో వైరల్ అవుతున్నాయి.
గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- ముగ్గురు స్పాట్ డెడ్
గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 16 వ నెంబర్ జాతీయ రహదారి తుమ్మలపాలెం సమీపంలో ఆగి ఉన్న లారీని వేగంగం వచ్చి కారు ఢీ కోట్టింది. కారులో ఉన్న నలుగురిలో ముగ్గురు స్పాట్‌లోనే చనిపోయారు. కారులో మరో మహిళకు తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన మహిళను మెరుగైన వైద్యం కోసం గుంటూరు జీజీహెచ్ కు తరలించారు. కారులో గుంటూరు నుంచి చిలకలూరిపేట వేళుతుండగా ఈ ప్రమాదం జరిగింది.
రాజ్ భవన్ లో ఎట్ హోమ్ కార్యక్రమం, సీఎం జగన్, చంద్రబాబు హాజరు
Raj Bhavan : రాజ్‌భవన్‌లో గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ ఏర్పాటుచేసిన ఎట్‌హోమ్ కార్యక్రమానికి సీఎం జగన్ హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి హైకోర్టు చీఫ్ జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, సీఎస్ సమీర్ శర్మ, డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి, హైకోర్టు న్యాయమూర్తులు, టీడీపీ అధినేత చంద్రబాబు హాజరయ్యారు.