By: ABP Desam | Updated at : 16 Feb 2023 04:53 PM (IST)
ఎమ్మెల్యేలకు ఎర కేసులో "శుక్రవారం" మలుపు ఖాయం ! పంజా విసరడానికి సీబీఐ రెడీనా ?
MLAs Poaching Case : తెలంగాణ రాజకీయాల్లో కీలక మలుపులకు కారణం అవుతుందని భావిస్తున్న ఎమ్మెల్యేలకు ఎర కేసులో శుక్రవారం కీలక పరిణామాలు చోటు చేసుకోనున్నాయి. సుప్రీంకోర్టులో ఈ అంశంపై విచారణ జరగనుంది. గత విచారణలో .. పిటిషన్‌ను స్వీకరించినప్పటికీ హైకోర్టు తీర్పు అమలుపై స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. శుక్రవారం విచారణలో స్టే కోసం తెలంగాణ ప్రభుత్వ లాయర్లు పట్టుబట్టే అవకాశం ఉంది. ఒక వేళ హైకోర్టు తీర్పు అమలుపై స్టే వస్తే.. సిట్ విచారణ ప్రారంభమవుతుంది. స్టే అవసరం లేదని సుప్రీంకోర్టు భావిస్తే సీబీఐ తన పని ప్రారంభించే అవకాశం ఉంది.
న్యాయపరమైన అడ్డంకులు లేకపోయినా విచారణ ప్రారంభించని సీబీఐ
నిజానికి పిటిషన్ వేసినప్పుడు ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు తీర్పు అమలుపై స్టే కోరినా సుప్రీంకోర్టు ఇవ్వలేదు. అయినా సిట్ వద్ద ఉన్న డీటెయిల్స్ ఇవ్వడానికి తెంంగాణ సీఎస్ సిద్ధం కాలేదు. వాటి కోసం ఎస్పీ స్థాయి అధికారి సీఎస్ కి ఆరుసార్లు లేఖ రాశారు. సుప్రీంలో విచారణ తర్వాత ఇస్తామని మౌఖికంగా సమాధఆనం చెబుతున్నారు. అందుకే శుక్రవారం ఏం జరగబోతుందని ఉత్కంఠ నెలకొంది. హైకోర్టు తీర్పును అమలు చేయడం లేదని శుక్రవారం విచారణ తర్వాత కోర్టు ధిక్కరణ కేసు ఫైల్ చేయనున్నట్లు సీబీఐ వర్గాలు చెబుతున్నాయి. అయితే సుప్రీంకోర్టులో అనుకూల తీర్పు రాకపోతే.. వెంటనే ఫైల్స్ అన్నీ సిట్ అధికారులు సీబీఐకి ఇచ్చే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది. లేకపోతే కోర్టు ధిక్కరణ కింద అధికారులే ఎక్కువగా ఇబ్బంది పడతారు. సీబీఐ విచారణ కూడా ఎదుర్కోవాల్సి రావొచ్చన్న అనుమానాలు ఉన్నాయి.
కేసు సీబీఐ చేతికి వెళ్తే రాజకీయంగా ఇబ్బందులన్న అంచనాలో బీఆర్ఎస్
ఫామ్ హౌస్ కును బీఆర్ఎస్ ..,బీజేపీపై రాజకీయ పోరాటానికి ఆయుధంగా ఎంచుకుంది. కానీ అనూహ్యంగా ఇది సీబీఐ చేతుల్లోకి వెళ్తూండటం ఆ పార్టీ నేతల్ని ఆందోళనకు గురి చేస్తోంది. సాక్ష్యాలన్నీ బీజేపీ నేతలకు వ్యతిరేకంగా ఉంటాయని.. సీబీఐ నిష్ఫాక్షికంగా పని చేయడం లేదని.. వారి చేతుల్లోకి వెళ్తే ధ్వంసం చేస్తారని వాదిస్తున్నారు. అయితే పైకి ఇలా చెప్పినా కేసును చివరికి ఎమ్మెల్యేల దగ్గరకు తీసుకు వస్తే అది బీఆర్ఎస్ నేతలపై ఒత్తిడి పెంచుతుంది. రాజకీయంగా కీలక పరిణామాలకు కారణం అవుతుంది. అందుకే.., వీలైనంత వరకూ అత్యున్నత స్థాయిలో న్యాయపోరాటం చేసి కేసు సీబీఐకి వెళ్లకుండా చూడాలనుకుంటున్నారు.
ఇప్పటికే సీబీఐ గ్రౌండ్ వర్క్ చేసేసిందా?
ఫాంహౌస్ కేసు విచారించేందుకు సీబీఐ అధికారులు ప్రత్యేక బృందంగా ఏర్పడ్డారన్న ప్రచారం జరుగుతోంది. మొయినాబాద్ పోలీస్ స్టేషన్ ఎఫ్ఐఆర్, ఆనాటి ఫుటేజీని పరిశీలించారు. సీఏం వద్దకు ఎవరు చేరవేశారో కాల్ డేటా, టవర్ లొకేషన్స్ పరిశీలించారు. పోలీస్ అధికారుల టైమింగ్స్, ఎమ్మెల్యేల స్పై కెమెరాలను సరిచూసుకున్నారు. టెక్నికల్ గా ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండానే ఎవరెవరని విచారించాలో ప్లాన్ చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. సుప్రీంకోర్టులో క్లారిటీ వచ్చాక సీబీఐ విరుచుకుపడే అవకాశం ఉందంటున్నారు. అందుకే ఎమ్మెల్యేల ఎర కేసుకు సంబంధించి ఈ శుక్రవారం బిగ్ ఫ్రైడేగా ఉండనుందంటున్నారు.
కొత్త మెడికల్ కాలేజీల్లో జులై నుంచి తరగతులు ప్రారంభించాల్సిందే! మంత్రి హరీశ్ రావు ఆదేశం!
పది రోజుల్లో 50 వేల బుకింగ్స్, TSRTC కొత్త ప్లాన్కు అపూర్వ స్పందన, ఇకపై ఎనీటైమ్!
Breaking News Live Telugu Updates: హన్మకొండ జిల్లాలో ఆటో-కారు ఢీ, పలువురి పరిస్థితి విషమం
Sangareddy Crime News: భూ వివాదంతో పెద్దనాన్న హత్య - తల, మొండెం వేరు చేసి ఒక్కోచోట పడేసిన తమ్ముడి కొడుకు!
నా ఇంటికి రా రాహుల్ భయ్యా- రేవంత్ ఎమోషనల్ ట్విట్
KCR Decisions: పోడు భూములకు పట్టాలు రెడీ, పంపిణీపై త్వరలో తేదీ ప్రకటిస్తాం: సీఎం కేసీఆర్
AP 10th Exams: 'పది'లో ఆరుపేపర్లు, బిట్ పేపర్ లేకుండానే ప్రశ్నపత్రం! విద్యార్థులకు 'సిలబస్' కష్టాలు!
Pawan Kalyan Movie Title : పవన్ కళ్యాణ్ ఒరిజినల్ గ్యాంగ్స్టరే - టైటిల్ రిజిస్టర్ చేసిన నిర్మాత
SSMB 28 Title : మహేష్ బాబు - త్రివిక్రమ్ సినిమా టైటిల్ అనౌన్స్ చేసేది ఆ రోజే