ABP Network Ideas of India 2023: "2024 ఎన్నికలు - విపక్షాల వ్యూహం" - యువత నేతలతో ఆలోచనలు పంచుకోనున్న ఎమ్మెల్సీ కవిత !
ఏబీపీ నెట్ వర్క్ నిర్వహిస్తున్న ఐడియాస్ ఆఫ్ ఇండియా సమ్మిట్ 2023లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పాల్గొననున్నరు. "2024 ఎన్నికలు - విపక్షాల వ్యూహం" అంశంపై ఆలోచనలు పంచుకోనున్నారు.
ABP Network Ideas of India 2023: దేశంలోని దిగ్గజ మీడియా సంస్థల్లో ఒకటి అయిన ఏబీపీ నెట్ వర్క్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న "ఐడియాస్ ఆఫ్ ఇండియా 2003"లో శనివారం రాజకీయ అంశాలపై చర్చలు జరగనున్నాయి. "2024 ఎన్నికలు - విపక్షాల వ్యూహం" అనే అంశంపై జరిగే చర్చా వేదికలో ఎమ్మెల్సీ కవిత తన అభిప్రాయాలను వ్యక్తం చేయనున్నారు. ఈ చర్చలో ఎమ్మెల్సీ కవితతో పాటుగా బీజేపీ యువ ఎంపీ పూనమ్ మహాజన్, శివసేన నేత ప్రియాంకా చదుర్వేది, ఆప్ నేత రాఘవ్ చద్దా పాల్గొననున్నారు. ముంబైలో జరగుతున్న ఈ సదస్సులో పాల్గొనేందుకు కవిత శనివారం మధ్యాహ్నం వెళ్తారు. మధ్యాహ్నం రెండున్నర గంటలకు ముంబై చేరుకుని మొదట మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ విగ్రహానికి నివాళులు అర్పిస్తారు. తర్వాత ఐడియాస్ ఆఫ్ ఇండియా సమ్మిట్ జరిగే వేదిక వద్దకువెళ్తారు.
బీఆర్ఎస్ జాతీయ రాజకీయాలను సమన్వయం చేస్తున్న కవిత !
భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా పోరాడేందుకు తెలంగాణ రాష్ట్ర్ సమితి పార్టీని.. కేసీఆర్ భారత్ రాష్ట్ర సమితిగా మార్చారు. జాతీయ స్థాయిలోఈ పార్టీ కార్యక్రమాలను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సమన్వయం చేస్తున్నారు. గతంలో ఎంపీగా చేసినందున ఆమెకు దేశ వ్యాప్తంగా విస్తృత పరిచయాలు ఉన్నాయి. జాతీయ రాజకీయాలపై స్పష్టమైన అవగాహన.. జాతీయ విధానాలపై లోతైన చర్చ జరపగల సామర్థ్యం ఉంది. వచ్చే ఎన్నికల్లో బీజేపీని నిలువరించగమని గట్టి నమ్మకంతో కవిత ఉన్నారు. ఈ క్రమంలో ఆమె తన ఆలోచనలను.. ఐడియాస్ ఆఫ్ ఇండియా సమ్మిట్‌లో ఇతర యువ నేతలతో పంచుకోనున్నారు.
ఐడియాస్ ఆఫ్ ఇండియా సదస్సు ప్రారంభం..
రెండు రోజుల 'ఐడియాస్ ఆఫ్ ఇండియా' సమ్మిట్ ఏబీపీ నెట్‌వర్క్ సీఈవో అవినాష్ పాండే శుక్రవారం ప్రారంభించారు. ఈ సదస్సులో యూకే మాజీ ప్రధాని లిజ్ ట్రస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అవినాష్ పాండే కీలక వ్యాఖ్యలు చేశారు. ABP Networkతో పాటు దేశ విదేశాల్లోని స్థితిగతులు, ప్రజాస్వామ్యం, భావ ప్రకటనా స్వేచ్ఛ అంశాలపై ప్రసంగించారు. ఈ రోజు మనం ఎక్కడున్నాం..? రేపు ఎక్కడ ఉండాలని అనుకుంటున్నాం..? ఈ అంశాలపై చర్చించడమే ఈ సమ్మిట్ ప్రధాన ఉద్దేశమని ఆయన ెబుతున్నారు. భారత్‌తో పాటు ప్రపంచ దేశాలకు చెందిన మేధావులను ఈ వేదికపైకి తీసుకొస్తున్నాం. గతేడాది సమ్మిట్ నిర్వహించినా కరోనా భయం ఉండేది. జాగ్రత్తలు పాటించాల్సి వచ్చింది. కానీ వ్యాక్సిన్‌ల వల్ల ఈ గండం నుంచి గట్టెక్కాం. ధర్మబద్ధంగా నడుచుకోవడమే ఏబీపీ నెట్‌వర్క్ సిద్ధాంతమని తెలిపారు.
దేశంలోని పలువురు ప్రముఖులు ఐడియాలను పంచుకుంటారు !
ABP నెట్ వర్క్ ఐడియాస్ ఆఫ్ ఇండియా సమ్మిట్ ను డాబర్ వేదిక్ టీ కో ప్రెజెంట్ చేస్తుండగా, డాక్టర్ ఆర్థో, గల్లంత్ అడ్వాన్స్, రాజేష్ మసాలాకో-పవర్ చేస్తోంది. ఈ రెండు రోజుల సమ్మిట్ లో కేంద్ర రోడ్లు, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, రైల్వే శాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మన్, బ్రిటన్ మాజీ ప్రధానమంత్రి లిజ్ ట్రస్, రచయిత జావెద్ అక్తర్, గాయకులు లక్కీ అలీ, శుభా ముద్గల్, ఆథర్ అమితవ్ ఘోష్, దేవ్ దత్ పట్టానాయక్, నటి సారా అలీ ఖాన్, జీనత్ అమన్, నటులు ఆయుష్మాన్ ఖురానా, మనోజ్ వాజ్ పేయీ, సెలబ్రిటీ చెఫ్ వికాస్ ఖన్నా, క్రీడాకారులు గుప్తా జ్వాలా, వినేష్ ఫోగట్ సహా ఇతర ప్రముఖులు తమ అభిప్రాయాలను, ఆలోచనలను పంచుకోనున్నారు.