Voter Slip Download: మీకు ఓటరు స్లిప్పు అందలేదా? ఇలా చేస్తే సింపుల్‌గా మీరే డౌన్‌లోడ్ చేసుకోవచ్చు
AP Elections 2024: ఓటరు స్లిప్ లేకపోతే ఇక తాము ఓటు వేయడానికి అనర్హులమని చాలా మంది అనుకుంటారు. కానీ, ఓటరు స్లిప్ లేకపోయినా దాన్ని మనమే డౌన్ లోడ్ చేసుకొని వెళ్లి ఓటు వేయవచ్చు.
![Voter Slip Download: మీకు ఓటరు స్లిప్పు అందలేదా? ఇలా చేస్తే సింపుల్‌గా మీరే డౌన్‌లోడ్ చేసుకోవచ్చు Voter slip can download easily through Voter helpline app says Election commission Voter Slip Download: మీకు ఓటరు స్లిప్పు అందలేదా? ఇలా చేస్తే సింపుల్‌గా మీరే డౌన్‌లోడ్ చేసుకోవచ్చు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/12/02d3ea06da97be7c80a81e4c6fc2c52f1715486398282234_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Voter Slip Download Process: తెలుగు రాష్ట్రాల్లో రేపే (మే 13) పోలింగ్ జరగబోతోంది. తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు, ఏపీలో లోక్ సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతున్నాయి. ఓటర్లు ఓటు వేసేందుకు వీలుగా ఓటరు స్లిప్‌ల పంపకాలు కూడా జరుగుతున్నాయి. ఎన్నికల సిబ్బంది అయిన బీఎల్‌వోలు మాత్రమే కాక, ఆయా ప్రాంతాల్లో రాజకీయ పార్టీల నేతలు ఓటరు స్లిప్పులను పంపే ఏర్పాటు చేస్తున్నారు. అయితే కొంతమందికి స్లిప్స్ అందుతున్నప్పటికీ మరికొందరికి మాత్రం అందడంలేదు.
ఓటరు స్లిప్ లేకపోతే ఇక తాము ఓటు వేయడానికి అనర్హులమని చాలా మంది అనుకుంటారు. కానీ, ఓటరు స్లిప్ లేకపోయినా ఓటు వేయవచ్చు. ఓటరు స్లిప్ అందని వారు దాన్ని తామంత తామే డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఇందుకోసం ఎన్నికల సంఘం ఒక వెబ్ సైట్‌ను అందుబాటులో ఉంచింది. ఓటరు సమాచారంతో కూడిన ఈ స్లిప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఎలక్షన్ కమిషన్ సులభమైన విధానాన్ని రూపొందించింది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రూపొందించిన ఓటర్ హెల్ప్ లైన్ అనే యాప్ ను డౌన్ లోడ్ చేసుకొని సంబంధిత వివరాలను నమోదు చేసి ఓటరు స్లిప్పును పొందవచ్చు. దాన్ని డౌన్ లోడ్ చేసుకొని సంబంధిత పోలింగ్ బూత్ లో చూపిస్తే ఓటు వేయవచ్చు.
ఇంకా సులభంగా
ECI స్పేస్ ఓటరు ఐడి నెంబరు ఎంటర్ చేసి 1950కి SMS చేయాలి. ఇలా చేయగానే 15 సెకన్లలో ఎలక్షన్ బూత్ స్లిప్ వస్తుంది.
ఓటరు స్లిప్ పై ఉండేవి ఇవే
ఓటర్ స్లిప్ మీద ఓటరు పూర్తి పేరు, వయసు, లింగం, అసెంబ్లీ నియోజవకవర్గం, పోలింగ్ బూత్ పేరు, పోలింగ్ రూం నంబర్, పోలింగ్ తేదీ, సమయంతోపాటు ఆ స్లిప్‌లో క్యూఆర్ కోడ్ ఉంటుంది. దీన్ని స్కాన్ చేస్తే ఓటరు వివరాలు అన్నీ తెలుసుకోవచ్చు.
పోలింగ్ కేంద్రం ఎక్కడో ఇలా తెలుసుకోవచ్చు?
హైదరాబాద్‌లో ఓటర్ల కోసం జీహెచ్‌ఎంసీ ‘పోల్ క్యూ రూట్’ అనే వెబ్ లింకును అందుబాటులోకి తెచ్చింది. జీహెచ్‌ఎంసీ వెబ్‌సైట్, మై జీహెచ్‌ఎంసీ మొబైల్ యాప్ హోమ్ స్క్రీన్‌పై ఈ లింకును జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్‌రాస్ ఉంచేలా చేశారు. పోలింగ్ రోజున ఓటర్లు ఆ లింకును ఓపెన్ చేసి.. తమ అసెంబ్లీ సీటు పేరు, పోలింగ్ కేంద్రం పేరును ఎంచుకుంటే ఆ పోలింగ్ బూత్ లో ఎంతమంది వరుసలో ఉన్నారో అక్కడికి ఎలా వెళ్లాలో తెలిపే గూగుల్ మ్యాప్‌లు ఓపెన్ అవుతాయి.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)