VC Sajjanar: సిగ్నల్ వద్ద ఆత్రం పనికిరాదంటున్న వీసీ సజ్జనార్, మరో షాకింగ్ వీడియో పోస్ట్
VC Sajjanar: సిగ్నల్స్ వద్ద ఆత్రం ఏ మాత్రం పనికి రాదని టీస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ చెబుతున్నారు. ఏమాత్రం ఆద మరిచినా ప్రమాదం జరిగి ప్రాణాలు కోల్పోవాల్సిందేనని అన్నారు.
VC Sajjanar: సిగ్నల్స్ వద్ద ఆత్రం ఏమాత్రం పనికి రాదని టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ సూచిస్తున్నారు. ట్విట్టర్ వేదికగా ఓ వీడియోను షేర్ చేశారు. అందులో బైక్ పై వెళ్తున్న ఓ జంట సిగ్నల్ క్రాస్ చేయబోతుండగా.. లారీ కిందకు చొచ్చుకుపోయారు. అదృష్టవశాత్తు వారికి ఎలాంటి ప్రమాదమూ జరలేదు. అయితే ఇదంతా అక్కడే ఉన్న సీసీటీవీలో రికార్డు కాగా... వీసీ సజ్జనార్ ట్టిట్టర్ ద్వారా నెటిజెన్లతో పంచుకున్నారు. అందరికి వీరిలా అదృష్టం ఉండదని.. సిగ్నల్స్ వద్ద ఏమాత్రం ఆత్రం పనికి రాదని వివరించారు. అలాగే రహదారులపై లేన్ డ్రైవింగ్‌ను విధిగా పాటించాలని సూచించారు. ఇలా అడ్డదిడ్డంగా వెళ్లి రోడ్డు ప్రమాదాలకు కారణమై విలువైన ప్రాణాలను పోగొట్టుకోకండని హితవు పలికారు.
ఎమన్నా అదృష్టమా ఇది!
— V.C. Sajjanar, IPS (@SajjanarVC) June 23, 2023
సిగ్నల్స్ వద్ద ఆత్రం ఏమాత్రం పనికిరాదు. అందరికీ వీరిలా అదృష్టం వరించదు. రహదారులపై లేన్ డ్రైవింగ్‌ను విధిగా పాటించండి. ఇలా అడ్డదిడ్డంగా వెళ్లి రోడ్డు ప్రమాదాలకు కారణమై విలువైన ప్రాణాలను పోగొట్టుకోకండి.#RoadSafety #RoadAccident @tsrtcmdoffice… pic.twitter.com/Bysa3hUV7d
మూడ్రోజుల క్రితమే.. మరో సూచన
రహదారుల వెంట పిల్లలను తీసుకెళ్లినప్పుడు.. తల్లిదండ్రులు చాలా అప్రమత్తంగా ఉండాలని టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ సూచిస్తున్నారు. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా వారి ప్రాణాలకే ప్రమాదం అని చెప్పుకొచ్చారు. ట్విట్టర్ వేదికగా ఓ వీడియోను షేర్ చేశారు. అందులో ఓ పాప రోడ్డు దాటేందుకు పరిగెట్టగా.. బైక్ ఢీ కొడుతుంది. ఆ వెంటనే మరో బైక్ కూడా పాపను ఢీకొట్టింది. ఆమె అక్కడే పడిపోతుంది. ఈ విషయం గుర్తించిన ఆమె తల్లి వెళ్లి పాపను ఎత్తుకోగా.. కాసేపటికి ఆమె స్పృహలోకి వస్తుంది. అయితే అందరికీ ఈ చిన్నారిలా అదృష్టం వరించదని చెబుతూ.. తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని వీసీ సజ్జనార్ వివరించారు.
రహదారుల వెంట పిల్లలను తీసుకెళ్లేటప్పుడు తల్లిదండ్రులు నిత్యం అప్రమత్తంగా ఉండాలి. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్న వారి ప్రాణాలకే ప్రమాదం. అందరికీ ఈ చిన్నారిలా అదృష్టం వరించదు. @MORTHIndia #RoadSafety pic.twitter.com/317Wx1F4kZ
— V.C. Sajjanar, IPS (@SajjanarVC) June 19, 2023
వారం రోజుల క్రితం అంటే జూన్ 16వ తేదీనాడు ములుగు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చేసుకుంది. భార్యా, ఇద్దరు పిల్లలను బైక్ పై ఎక్కించుకొని అజాగ్రత్తగా వాహనం నడిపిన ఓ వ్యక్తి ఆర్టీసీ బస్సును ఢీకొట్టాడు. ఈ ఘటనలో పిల్లలిద్దరూ అక్కడికక్కడే చనిపోయారు. ఈ విషయాన్ని కూడా వీసీ సజ్జనార్ ట్విట్టర్ ద్వారా వివరిస్తూ.. వాహనాలు నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని చెప్పారు.
ఈ బైకర్ నిర్లక్ష్యపు డ్రైవింగ్ ఖరీదు రెండు నిండు ప్రాణాలు. ఇద్దరు కుమారులు, భార్యను ఎక్కించుకుని అజాగ్రత్తగా డ్రైవ్ చేస్తూ బైక్ ను #TSRTC బస్సుకు ఢీకొట్టాడు. ములుగు జిల్లా మంగపేటలోని తెలంగాణ సెంటర్ వద్ద శుక్రవారం ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు దుర్మరణం… pic.twitter.com/5zv1y04a6X
— V.C. Sajjanar, IPS (@SajjanarVC) June 17, 2023