By: ABP Desam | Updated at : 02 Apr 2022 07:09 PM (IST)
ప్రగతి భవన్‌లో ఉగాది వేడుకలు- పాల్గొన్న సీఎం కేసీఆర్
శుభాలను మోసుకొస్తున్న శుభకృత్ నామ సంవత్సరంలో తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తుందన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. ప్రగతి భవన్‌లో జరిగిన ఉగాది వేడుకలు, పంచాంగ శ్రవణంలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. తెలంగాణ ప్రజలకు ఆయన ఉగాది శుభాకాంక్షలు చెప్పారు.
దేశానికి ఆదర్శంగా తెలంగాణ మారుతుందన్న కేసీఆర్.. రాష్ట్రాదాయం పెరుగుతుందని చెప్పారు. విద్య, విద్యుత్, తలసరి ఆదాయంలో మంచి ఫలితాలు సాధించామని... ఇక్కడితో ఆగిపోదని బంగారు తెలంగాణ సాధించే వరకు విశ్రమంచిబోమన్నారు.
Koo App#Telangana and #AndhraPradesh celebrated Telugu New Year #Ugadi with gaiety & traditional enthusiasm. The CM of the two states attended main official celebrations in their respective state capitals, where ’agma’ pundits read the ’panchangnam’ or the forecast of the coming year. - IANS (@IANS) 2 Apr 2022
తెలంగాణలో సాధించిన సర్వతోముఖాభివృద్ధి కారణంగా భూముల ధరలు బాగా పెరిగాయన్నారు కేసీఆర్. మన వనరులు, ఉద్యోగాలు మనకే దక్కాలని ఆనాడు ఉద్యమం ప్రారంభించామని ఇప్పుడు అది సాకారమైందన్నారు. అనేక అనుమానాలతో ఉద్యమం ప్రారంభించామని వాటిని తొలగిస్తూ పోరాటాలు చేస్తూ ప్రత్యేక రాష్ట్రం తెచ్చుకున్నామన్నారు.
ప్రత్యేక రాష్ట్రంలో ఎలాంటి వివక్ష లేకుండా బంగారు తెలంగాణ సాధన దిశగా దూసుకెళ్తున్నామని ఇకపై కూడా ఇది కొనసాగుతుందన్నారు కేసీఆర్. యాదాద్రి ఆలయాన్ని అద్భుతంగా నిర్మించుకున్నామని.. అన్ని దేవాలయాలు అలానే డెవలప్ చేసుకుంటామన్నారు.
ఉగాది పండుగ సందర్భంగా హైదరాబాద్‌లోని తన నివాసంలో ఎమ్మెల్సీ కవిత ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉగాది పచ్చడి తయారు చేసి, కుటుంబ సభ్యులతో కలిసి సేవించారు. ఈ ఏడాది ప్రజలకు అన్ని రంగాల్లోనూ శుభాలు జరగాలని ఆకాంక్షించారు. పంచాంగ శ్రవణంలో ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు.
"శతాయు వజ్రదేహాయ సర్వసంపత్ కరాయచ
— Kavitha Kalvakuntla (@RaoKavitha) April 2, 2022
సర్వారిష్ట వినాశాయ నింబకం దళబక్షణం "
మీకు మీ కుటుంబ సభ్యులకు శ్రీ శుభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు !! pic.twitter.com/P9HWqX1HPv
తెలంగాణ ప్రజలందరికీ ఎమ్మెల్సీ కవిత, మంత్రి హరీష్ రావు సహా ఇతరమంత్రులు ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. శ్రీ శుభకృత్ నామ నూతన సంవత్సరంలో అందరికీ శుభాలు కలగాలని ట్విటర్ ద్వారా ఆకాంక్షించారు.
శ్రీ శుభకృతునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. #happyugadi pic.twitter.com/U6IwEFidTx
— Harish Rao Thanneeru (@trsharish) April 2, 2022
శ్రీ శుభకృత్ నామ నూతన సంవత్సర శుభాకాంక్షలు 🙏
— KTR (@KTRTRS) April 2, 2022
Happy Ugadi to all
Malla Reddy About Revanth Reddy: టార్గెట్ రేవంత్ రెడ్డి, మరోసారి రెచ్చిపోయిన మంత్రి మల్లారెడ్డి - మధ్యలో రేవంత్ పెళ్లి ప్రస్తావన
Modi Hyderabad Tour: ఎల్లుండే హైదరాబాద్కు ప్రధాని మోదీ - ఈ పోస్టులు పెడితే నో ఎంట్రీ, కేసీఆర్ గైర్హాజరు!
Hyderabad: ఏడాదిగా సహజీవనం, రెండ్రోజుల్లోనే పెళ్లి - ఇంతలో వరుడు మృతి! వధువు ఏం చేసిందంటే
Weather Updates: నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఏపీలో మరో 4 రోజులు వర్షాలు - తెలంగాణలో పొడి వాతావరణం
Revanth Reddy : అధికారంలోకి రాగానే మల్లారెడ్డిని జైలుకు పంపిస్తాం, రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
Karnataka Road Accident: కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం - బస్సు, లారీ ఢీకొనడంతో 7 మంది మృతి
Rajya Sabha Elections 2022: రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల, తెలంగాణలో రెండు స్థానాలకు ఎలక్షన్
In Pics: వ్యాపార దిగ్గజాలతో కేటీఆర్ వరుస భేటీలు - తెలంగాణకు రానున్న కంపెనీలు ఇవే, ఫోటోలు
Bindu Madhavi: బాత్రూమ్ లో బిందు మాధవి స్మోకింగ్ - నిజమేనా?