By: ABP Desam | Updated at : 03 Oct 2023 09:42 PM (IST)
TSRTC చైర్మన్ గా బాజిరెడ్డి గోవర్దన్ పదవీ కాలం పూర్తి
Farewell to TSRTC Chairman Bajireddy Govardhan:
హైదరాబాద్: గత రెండేళ్లలో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TSRTC) మెరుగైన ఫలితాలు సాధించింది. ఆర్టీసీ సిబ్బంది సైతం ప్రభుత్వ ఉద్యోగులు కావడం, వేల కోట్ల నష్టాన్ని భర్తీ చేశారు. ఇందుకు కారణం ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, సంస్థ ఎండీ సజ్జనార్ కృషి అని చెప్పవచ్చు. టీఎస్ ఆర్టీసీ చైర్మన్ గా పదవీ కాలం పూర్తయిన సందర్భంగా బాజిరెడ్డి గోవర్దన్ కి సంస్థ ఉన్నతాధికారులు ఆత్మీయ వీడ్కోలు పలికారు. బాజిరెడ్డి గోవర్దన్- వినోద దంపతులను ఘనంగా సన్మానించారు. హైదరాబాద్ లోని బస్ భవన్ లో బాజిరెడ్డి గోవర్దన్ గారికి ఆత్మీయ వీడ్కోలు కార్యక్రమాన్ని మంగళవారం టీఎస్ఆర్టీసీ నిర్వహించింది.
టీఎస్ ఆర్టీసీ మాజీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్దన్ మాట్లాడుతూ.. రాజకీయ నాయకుడిగా 40 ఏళ్లుగా పనిచేస్తున్నా, రెండేళ్లు టీఎస్ఆర్టీసీ చైర్మన్ గా పదవీ బాధ్యతలు నిర్వర్తించడం సంతృప్తి ఇచ్చిందన్నారు. చిన్నతనం నుంచే ఆర్టీసీతో తనకు అనుబంధముందన్నారు. తాను, ఎండీగా సజ్జనర్ 18 రోజుల వ్యవధిలోనే బాధ్యతలు స్వీకరించామని, తమకు ఎన్నో సవాళ్లు తమకు స్వాగతం పలికాయని గుర్తు చేశారు. ప్రయాణికులకు మెరుగైన సేవలు అందిస్తూనే.. 45 వేల ఉద్యోగులకు భరోసా కల్పించాలని తపించామని చెప్పారు. తన పదవీ కాలంలోనే ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయడంపై హర్షం వ్యక్తం చేశారు. అధికారులు, ఉద్యోగుల సమిష్టి కృషితోనే సత్పలితాలు వస్తున్నాయన్నారు. తన విధి నిర్వహణలో తోడ్పాటు అందించిన సంస్థ ఎండీ సజ్జనర్ తో పాటు అధికారులు, ఉద్యోగులకు పేరుపేరునా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
టీఎస్ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్ మాట్లాడుతూ.. చైర్మన్ బాజిరెడ్డి గోవర్దన్ సారథ్యంలో ఎన్నడూ లేని రీతిలో సంస్థ సాహసోపేత నిర్ణయాలు తీసుకుందన్నారు. రాజకీయ నాయకుడిలా కాకుండా సంస్థతో మమేకమై పనిచేసి ముందుకు నడిపించారని కొనియాడారు. చైర్మన్ గైడెన్స్ పాటు ఉద్యోగులు సమిష్టిగా పనిచేయడం వల్ల సంస్థ వృద్ధి చెందుతోందన్నారు. గత రెండేళ్లలో దాదాపు రూ.1600 కోట్ల నష్టాన్ని తగ్గించామని చెప్పారు. సంస్థ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి.. వాటిని పరిష్కరించడంలో కీలకపాత్ర పోషించారని గుర్తుచేశారు. ప్రతి ఉద్యోగికి 1వ తేదీన జీతాలను సంస్థ ఇస్తోందన్నారు. రైతు కుటుంబం నుంచి వచ్చిన కేబినెట్ ర్యాంకైన టీఎస్ఆర్టీసీ చైర్మన్ గా బాజిరెడ్డి గోవర్దన్ ఎదిగారని గుర్తుచేశారు. బాజిరెడ్డి గోవర్దన్ సేవలను స్పూర్తిగా తీసుకుని, ప్రజా రవాణా వ్యవస్థను ప్రజలకు మరింతగా చేరువ చేస్తామన్నారు.
ఈ ఆత్మీయ వీడ్కోలు కార్యక్రమంలో టీఎస్ఆర్టీసీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్(సీవోవో) డాక్టర్ వి.రవిందర్, జాయింట్ డైరెక్టర్ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు మునిశేఖర్, పురుషోత్తం, వెంకటేశ్వర్లు, వినోద్ కుమార్, కృష్ణకాంత్, నిజామాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(నుడా) చైర్మన్ ఈగ సంజీవ రెడ్డి, జుక్కల్ మాజీ ఎమ్మెల్యే గంగరాం, బాజిరెడ్డి గోవర్దన్ గారి కుటుంబ సభ్యులతో పాటు సంస్థ హెచ్వోడీలు, ఆర్ఎంలు, డిప్యూటీ ఆర్ఎంలు, తదితరులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో టీఎస్ఆర్టీసీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ డాక్టర్ వి.రవిందర్, జాయింట్ డైరెక్టర్ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు మునిశేఖర్, పురుషోత్తం, వెంకటేశ్వర్లు, వినోద్ కుమార్, కృష్ణకాంత్, నిజామాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ ఈగ సంజీవ రెడ్డి, జుక్కల్ మాజీ ఎమ్మెల్యే గంగరాం, బాజిరెడ్డి గోవర్దన్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
Telangana Election: సెలబ్రిటీలు రేపు ఓటు వేసేది ఈ బూత్‌లలోనే - మహేశ్‌బాబు, మోహన్‌బాబు ఒకేచోట
Deeksha Diwas : దీక్షాదివాస్ వేడుకలకు అనుమతి- కానీ కండిషన్స్ అప్లై
Telangana Elections 2023 Live News Updates: కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై ఈసీ సీరియస్- విచారణకు ఆదేశం
EC Arrangements: పోలింగ్ డే కోసం ఈసీ భారీ ఏర్పాట్లు- ఎన్నికల సిబ్బందికి కీలక సూచనలు
Telangana Elections 2023 Live News Updates: తెలంగాణలో ముగిసిన ఎన్నికల ప్రచారం, మూగబోయిన మైకులు
Andhra News : సొంత పార్టీ పెట్టుకుని అయినా విశాఖలోనే పోటీ - మరోసారి లక్ష్మీనారాయణ క్లారిటీ !
Indian Cricket Team: టీమిండియా హెడ్ కోచ్ గా రాహుల్ ద్రావిడ్ కాంట్రాక్ట్ పొడిగింపు
Telangana Elections 2023 : దేవుడి మీదే భారం - ఆలయాలకు క్యూ కట్టిన అన్ని పార్టీల నేతలు !
Janasena Meeting: డిసెంబర్ 1 జనసేన విస్తృతస్థాయి సమావేశం - ఏం చర్చిస్తారంటే?
/body>