News
News
వీడియోలు ఆటలు
X

TSPSC పేపర్ లీకేజీలో మొత్తం హవాలా మార్గమేనా?  నిందితులు ఆర్థిక లావాదేవీలు ఎలా జరిపారు?

ఒక్కో పేపర్‌ని నిందితులు ఎంతకు అమ్ముకున్నారు? నిందితురాలు రేణుకకు బెయిల్ ఇస్తారా? అసలు TSPSC పేపర్ లీకేజీలో మొత్తం హవాలా మార్గమేనా?  నిందితులు ఆర్థిక లావాదేవీలు ఎలా జరిపారు?

FOLLOW US: 
Share:

TSPSC కేసులో డబ్బులు ఎలా చేతులు మారాయి? జైల్లో వున్న నిందితులను విచారిస్తే ఆర్థిక లావాదేవీలు బయటపడతాయా? ఒక్కో పేపర్‌ని నిందితులు ఎంతకు అమ్ముకున్నారు? ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్ రంగంలోకి దిగితే ఏమవుతుంది? సిట్ దర్యాప్తుపై ఈడీ ఏమని చెప్పింది? రేణుకకు బెయిల్ ఇస్తారా? రేణుక-డాక్యా నాయక్ కలిసి ఏ పేపరును ఎంతకు బేరం పెట్టారు? అన్ని పరిణామాల నేపథ్యంలో ఈడీ ఎంట్రీ ఎలావుండబోతోంది?  

పేపర్ లీకేజీ కేసులో ముగ్గురు నిందితులను CCS నుంచి హిమాయత్ నగర్ సిట్ ఆఫీసుకి తీసుకొచ్చారు పోలీసులు. షమీమ్, సురేష్, రమేష్‌ను మూడోరోజు విచారిస్తున్నారు. గురువారం ముగ్గురు నిందితుల ఇళ్లలో సిట్ సోదాలు చేసింది. షమీమ్ ఇంట్లో గ్రూప్ -1 కి సంబంధించిన మాస్టర్ ప్రశ్నాపత్రం దొరికింది. దాన్ని సిట్ బృందం స్వాధీనం చేసుకుంది. గ్రూప్-1 ప్రిలిమ్స్‌లో 100 మార్కులకు పైగా వచ్చిన అభ్యర్థులను సిట్ కార్యాలయంలో విచారణ చేస్తున్నారు. ఇప్పటికే అరెస్టయి జైల్లో ఉన్న రాజేందర్, ప్రశాంత్, తిరుపతయ్యను కస్టడీ విచారణకు అనుమతించాలని కోర్టులో పిటిషన్ వేసింది సిట్. ఈరోజు నాంపల్లి కోర్టులో వారి కస్టడీ పిటిషన్ మీద విచారణ జరుగుతుంది.

హవాలా ట్రాన్సాక్షన్స్ జరిగాయా?

పేపర్ లీకేజీ వ్యవహారంపై రంగంలోకి దిగాలని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) భావిస్తోంది. లక్షల రూపాయలు చేతులు మారినట్టు గుర్తించిన ఈడీ.. అవన్నీ హవాలా మార్గంలో నడిచాయని అనుమానిస్తోంది. ఇప్పటికే పోలీసుల నుంచి పూర్తి వివరాలు సేకరించింది. సిట్ నుంచి FIR తీసుకుని, ECIR నమోదు చేసి, సిట్ దర్యాప్తు జరిపిన పత్రాలను కోర్టు నుంచి తీసుకునే ఆలోచనలో ఈడీ ఉంది. ఈ కేసులో సిట్ దర్యాప్తు ముమ్మరంగా జరిపిందని ఈడీ భావిస్తోంది. జైల్లో వున్న నిందితులను విచారిస్తే ఆర్థిక లావాదేవీలు, హవాలా ట్రాన్సాక్షన్స్ అన్నీ బయట పడతాయని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు భావిస్తున్నారు.

రేణుకకు బెయిల్ ఇస్తారా?

ఇదిలావుంటే TSPSC కేసులో రేణుక బెయిల్ పిటిషన్‌పై నాంపల్లి కోర్టు నుంచి తీర్పు రాబోతోంది. 4రోజుల క్రితం రేణుక తరుపున బెయిల్ పిటిషన్ దాఖలైంది. ఈ కేసులో రిమాండ్ గడువు ముగిసిందని, ఆమె అనారోగ్యంతో ఉన్నందున బెయిల్ ఇవ్వాలంటూ రేణుక కోరింది. ఆమెకు చిన్నపిల్లలు ఉన్నారని, అందుకే బెయిల్ ఇవ్వాలని రేణుక తరపున లాయర్ విజ్ఞప్తి చేశారు. కేసు విచారణకు ఆమె మొదటినుంచీ సహకరిస్తోందని, ఇక ముందు కూడా కోఆపరేట్ చేస్తుందని లాయర్ వకాలత్ ఇచ్చారు. ఈ కేసులో ఆమె ప్రత్యక్ష ప్రమేయం లేదని, ఇది కేవలం ప్రాథమిక నేరాభియోగం మాత్రమే అని రేణుక న్యాయవాది తెలిపారు. అయితే, ఈ కేసు విచారణ ఇంకా పూర్తి కాలేదని, ఇందులో చాలామంది పాత్ర ఉందనే విషయం సిట్ విచారణలో వెల్లడైందని పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టుకు తెలిపారు. ఈ దశలో రేణుకకి బెయిల్ ఇస్తే విచారణపై ప్రభావం పడుతుందని PP వాదించారు.    

ఎవరీ రేణుక?

TSPSC కమిషన్‌ కార్యదర్శి దగ్గర పీఏగా పనిచేస్తున్న ప్రవీణ్‌ స్నేహితురాలే రేణుక! ఈమెకి ప్రవీణ్ AE ప్రశ్నపత్రం ఇచ్చి రూ.10 లక్షలు తీసుకున్నట్లు దర్యాప్తులో తేలింది. ఆ క్వశ్చన్ పేపరుని రేణుక, ఆమె భర్త డాక్యా నాయక్‌ కలిసి మరో అయిదుగురికి అమ్ముకున్నారు. తలా రూ. 5లక్షల చొప్పున రూ.25 లక్షల వరకూ వసూలు చేసినట్లు సిట్ గుర్తించింది. వాళ్లకే కాకుండా ఇంకొందరికీ ప్రశ్నపత్రం అమ్మి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. మొత్తమ్మీద ఈ లావాదేవీల గుట్టు బయటపెట్టేందుకే ఈడీ రంగంలోకి దిగుతోందని తెలుస్తోంది. ప్రశ్నపత్రాల లీకేజీ పొలిటికల్ టర్న్‌ తీసుకున్న ఈ తరుణంలో ఈడీ ఎంట్రీ ఎలావుంటుందో చూడాలి! 

Published at : 31 Mar 2023 03:11 PM (IST) Tags: Crime Jobs SIT TSPSC TS Govt

సంబంధిత కథనాలు

Skill Based Courses: 'నైపుణ్య' డిగ్రీ కోర్సులకు ముందుకు రాని కళాశాలలు!

Skill Based Courses: 'నైపుణ్య' డిగ్రీ కోర్సులకు ముందుకు రాని కళాశాలలు!

తెలంగాణ రాజకీయాల్లో ‘ధరణి’ దుమారం- తగ్గేదేలే అంటున్న అధికార, ప్రతిపక్ష పార్టీలు!

తెలంగాణ రాజకీయాల్లో ‘ధరణి’ దుమారం- తగ్గేదేలే అంటున్న అధికార, ప్రతిపక్ష పార్టీలు!

TS PGECET: జూన్ 8న తెలంగాణ పీజీఈసెట్‌ ఫలితాల వెల్లడి, రిజల్ట్ టైమ్ ఇదే!

TS PGECET: జూన్ 8న తెలంగాణ పీజీఈసెట్‌ ఫలితాల వెల్లడి, రిజల్ట్ టైమ్ ఇదే!

BRS News: బీఆర్ఎస్‌లో చేరిన 50 మంది మహారాష్ట్ర సర్పంచ్‌లు, మధ్యప్రదేశ్ కీలక వ్యక్తి కూడా

BRS News: బీఆర్ఎస్‌లో చేరిన 50 మంది మహారాష్ట్ర సర్పంచ్‌లు, మధ్యప్రదేశ్ కీలక వ్యక్తి కూడా

Civils Coaching: సివిల్స్‌ శిక్షణ కోసం దరఖాస్తుల ఆహ్వానం, వీరు అర్హులు!

Civils Coaching: సివిల్స్‌ శిక్షణ కోసం దరఖాస్తుల ఆహ్వానం, వీరు అర్హులు!

టాప్ స్టోరీస్

YS Viveka Case : వివేకా లెటర్‌కు నిన్ హైడ్రిన్ టెస్టుకు ఓకే - కోర్టు అనుమతి

YS Viveka Case :  వివేకా లెటర్‌కు నిన్ హైడ్రిన్ టెస్టుకు ఓకే - కోర్టు అనుమతి

Odisha Train Accident: ఒడిశాలో మరో రైలు విషాదం, బోగీల కింద నలిగి ఆరుగురు మృతి!

Odisha Train Accident: ఒడిశాలో మరో రైలు విషాదం, బోగీల కింద నలిగి ఆరుగురు మృతి!

Dimple Hayathi Case: అరెస్ట్ చేయవద్దని నటి డింపుల్‌ హయతి పిటిషన్, హైకోర్టు ఏం చెప్పిందంటే!

Dimple Hayathi Case: అరెస్ట్ చేయవద్దని నటి డింపుల్‌ హయతి పిటిషన్, హైకోర్టు ఏం చెప్పిందంటే!

10,000 టికెట్లు ఫ్రీ, ‘ఆదిపురుష్’ నిర్మాత కీలక నిర్ణయం - కేవలం వాళ్లకు మాత్రమే!

10,000 టికెట్లు ఫ్రీ, ‘ఆదిపురుష్’ నిర్మాత కీలక నిర్ణయం - కేవలం వాళ్లకు మాత్రమే!