News
News
X

ఈడీ విచారణకు హాజరైన ఎల్ రమణ- క్యాసినో లింకులపై ప్రశ్నలు

క్యాసినో కేసులో దర్యాప్తును ఈడీ స్పీడప్ చేసింది. ఇప్పటికే పలువురు ప్రజాప్రతినిధులను విచారించిన దర్యాప్తు సంస్థ... మరికొంతమందిని పిలుస్తోంది. అందులో భాగంగానే ఈడీ విచారణకు ఎల్‌ రమణ హాజరయ్యారు

FOLLOW US: 

తెలంగాణలో క్యాసినో కేసు ప్రకంపనలు సృష్టిస్తోంది. ఐదురోజులుగా కొనసాగుతున్న దర్యాప్తులో చాలా మంది ప్రజాప్రతినిధులను ఈడీ విచారిస్తోంది. తాజాగా టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ ఎల్‌ రమణను పిలిచి రెండో రోజు విచారిస్తోంది. ఆయన విదేశాల్లో క్యాసినో ఆడినట్టు అనుమానిస్తోంది దర్యాప్తు సంస్థ. 

క్యాసినో కేసులో దర్యాప్తును ఈడీ స్పీడప్ చేసింది. ఇప్పటికే పలువురు ప్రజాప్రతినిధులను విచారించిన దర్యాప్తు సంస్థ... మరికొంతమందిని పిలుస్తోంది. అందులో భాగంగానే ఈడీ విచారణకు ఎల్‌ రమణ హాజరయ్యారు. ఈడీ ఇచ్చిన నోటీసుల మేరకు దర్యాప్తునకు టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ వచ్చారు. వారి సూచించినట్టుగానే బ్యాంకు స్టేట్‌మెంట్లతో ఈడీ ముందుకు వచ్చారు రమణ. 

ఇప్పటికే ఈ కేసులో చాలా మందిని విచారించిన ఈడీ అధికారులు... వాళ్లు ఇచ్చిన సమాచారంతోనే రమణను విచారిస్తున్నారు. ఆయన విదేశాల్లో క్యాసినో ఆడినట్టు వాళ్లు చెప్పిన ఆధారాలతో రమణను క్వశ్చన్ చేస్తున్నారు. చికోటి ప్రవీణ్‌, ఇతరులతో నేరుగా సంబంధాలపైకూడా ఆరా తీస్తున్నారు. ఎక్కడెక్కడ క్యాసినో ఆడారు... అక్కడకు వెళ్లిన తర్వాత జరిగిన లావాదేవీలపై ప్రశ్నలు సంధిస్తున్నారు. 

ఇప్పటికే కొందరు నేతలను విచారించిన ఈడీ

News Reels

కేసినో కింగ్ చీకోటి ప్రవీణ్ వ్యవహారంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ వంద మందికి నోటీసులు జారీ చేసింది. టీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎల్.రమణ గురువారం ఈడీ ఎదుట హాజరయ్యారు. బుధవారమే మంత్లి తలసాని సోదరులు విచారణకు హాజరయ్యారు. చీకోటి ప్రవీణ్ కేసినో ఖాతాదారుల్లో తెలంగాణ నుంచే కాదు.. ఏపీ నుంచి కూడా  ప్రముఖులు ఉన్నారు. వైఎస్ఆర్‌సీపీ మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్ రెడ్డికి కూడా ఈడీ నోటీసులు జారీ చేసింది. ఆయన కూడా విచారణకు హాజరయ్యారు. అనంతపురం అర్బన్‌ నుుంచి గతంలో కాంగ్రెస్,  వైఎస్ఆర్‌సీపీ తరపున ఎమ్మెల్యేలగా గెలిచారు గుర్నాథ్ రెడ్డి. ప్రస్తుతం వైఎస్ఆర్‌సీపీలోనే ఉన్నారు. 

ఈడీ ఎదుటకు మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్ రెడ్డి, మాజీ ఎంపీ బుట్టా  రేణుక సోదరుడు 

అనూహ్యంగా గుర్నాథ్‌ రెడ్డితో పాటు యుగంధర్ అనే వ్యక్తి కూడా ఈడీ విచారణకు హాజరయ్యారు. ఆయన వైఎస్ఆర్‌సీపీ మాజీ ఎంపీ బుట్టా రేణుక సోదరుడు అని తెలుస్తోంది. వీరిద్దరూ చీకోటి ప్రవీణ్ నిర్వహించిన కేసినోల్లో పాల్గొనడానికి ఇతర దేశాలకు వెళ్లారని.. హవాలా మార్గం ద్వారా డబ్బులు చెల్లించారన్న  ఆరోపణలపై ఈడీ ప్రశ్నించినట్లుగా తెలుస్తోంది. మొత్తంగా ఇప్పటి వరకూ వంద మందికి ఈడీ నోటీసులు జారీ చేసింది. కేసినో అంటే.. లక్షల్లో ఉండే వ్యవహారం కావడం.. ఎక్కువగా బ్లాక్ మనీతోనే  లావాదేవీలు నిర్వహిస్తారు కానీ.. రాజకీయ నేతలు.. వారితో సంబంధాలున్నవారే ఈ కేసుల్లో ఉన్నారు. దీంతో నోటీసులు అందుకున్న వారి పేర్లు బయటకు వచ్చే కొద్దీ సంచలనం అవుతున్నాయి. 

చీకోటి ప్రవీణ్ దగ్గర లభించిన ఆధారాలతో  ఈడీ నోటీసులు 

విదేశాల్లో క్యాసినో నిర్వహణ, ఆర్థిక లావాదేవీల వంటి అంశాలపై ఆరా తీశారు. ఫెమా యాక్ట్ నిబంధనలు, మనీలాండరింగ్‎పై ఈడీ కూపీ లాగుతోంది.   చీకోటి ప్రవీణ్, మాధవ్‎రెడ్డి కాల్‎డేటా ఆధారంగా వివరాలు సేకరించారు.  ట్రావెల్ ఏజెన్సీ ద్వారా ఫ్లైట్ బుకింగ్స్ వివరాలు సేకరించిన ఈడీ వాటి ఆధారంగా అనుమానితులను విచారణకు పిలుస్తున్నారు. గతంలో చీకోటి ప్రవీణ్‌ను ఈడీ నాలుగు రోజుల పాటు ప్రశ్నించింది. తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ నాయకులు, స్థిరాస్తి వ్యాపారాలు అనేక మంది క్యాసినోలకు వెళ్లినట్లు ఈడీ ఆధారాలు సేకరించింది. దీనిపై కూడా ప్రవీణ్ బృందాన్ని లోతుగా ప్రశ్నించింది.   క్యాసినోలో జూదం ఆడాలంటే విదేశీ మారక ద్రవ్యం కావాలి. పెద్ద మొత్తంలో విదేశీ మారక ద్రవ్యం తీసుకు వెళ్లడం సాధ్య పడదు. ఈ క్రమంలోనే తమకు కావాల్సిన విలువకు తగ్గట్టు నగదు చెల్లిస్తే ప్రవీణ్, అతని అనుచరులు ఇక్కడే టోకెన్లు ఇచ్చే వారని, వాటితోనే విదేశాల్లో జూదం ఆడేవారని తెలుస్తోంది. ఫెమా నిబంధనల ప్రకారం ఇది చట్ట విరుద్ధం. దీనిపైనే ప్రస్తుతం ఈడీ విచారిస్తోంది. 

అక్రమంగా  డబ్బులు తరలించిన కోణంలోనే విచారణ

హవాలా మార్గంలో ద్రవ్య మారకం జరిగనట్లు ప్రాథమిక ఆధారాలు లభించడంతో దాని వెనుక ఇంకా ఎవరెవరు ఉన్నారని ఈడీ లోతుగా విచారిస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాలులోని ప్రజాప్రతినిధులు, ప్రముఖుల పేర్లు వినిపిస్తున్నాయి. విదేశీ మారక ద్రవ్యానికి సంబంధించి వీరి ప్రమేయం ఉన్నట్లు బయట పడితే... రెండు రాష్ట్రాల్లో రాజకీయంగా సంచలనం అయ్యే అవకాశం ఉంది.  

Published at : 18 Nov 2022 11:29 AM (IST) Tags: ED Investigation Chikoti Praveen Casino case L Ramana ED aggression in casino case

సంబంధిత కథనాలు

Kishan Reddy Fires on KCR:

Kishan Reddy Fires on KCR: "ప్రజా సమస్యలను పక్కన పడేసిన టీఆర్ఎస్ - బీజేపీపై దాడులు చేస్తోంది"

YS Vijayamma : వైఎస్ షర్మిల ఇంటి వద్ద ఉద్రిక్తత, విజయమ్మను అడ్డుకున్న పోలీసులు!

YS Vijayamma : వైఎస్ షర్మిల ఇంటి వద్ద ఉద్రిక్తత, విజయమ్మను అడ్డుకున్న పోలీసులు!

YS Sharmila : పంజాగుట్ట పీఎస్ లో వైఎస్ షర్మిలపై కేసు నమోదు

YS Sharmila : పంజాగుట్ట పీఎస్ లో వైఎస్ షర్మిలపై కేసు నమోదు

Hayathnagar Molested Case: హయత్ నగర్ రేప్‌ కేసులో విస్మయం కలిగించే నిజాలు, బాలుర తీరుతో దిగ్భ్రాంతి!

Hayathnagar Molested Case: హయత్ నగర్ రేప్‌ కేసులో విస్మయం కలిగించే నిజాలు, బాలుర తీరుతో దిగ్భ్రాంతి!

BJP MP Dharmapuri Arvind : చంపుతానని బెదిరించిన ఎమ్మెల్సీ కవితపై చర్యలు తీసుకోండి, హైకోర్టును ఆశ్రయించిన ఎంపీ అర్వింద్

BJP MP Dharmapuri Arvind :  చంపుతానని బెదిరించిన ఎమ్మెల్సీ కవితపై చర్యలు తీసుకోండి, హైకోర్టును ఆశ్రయించిన ఎంపీ అర్వింద్

టాప్ స్టోరీస్

AP New CS Jawahar Reddy: ఏపీ సీఎస్‌గా జవహర్ రెడ్డి నియామకం, ఉత్తర్వులు జారీ చేసిన సర్కార్

AP New CS Jawahar Reddy: ఏపీ సీఎస్‌గా జవహర్ రెడ్డి నియామకం, ఉత్తర్వులు జారీ చేసిన సర్కార్

Green Signal To Sharmila Padayatra : షర్మిల పాదయాత్రకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ - వివాదాస్పద వ్యాఖ్యలు చేయవద్దని షరతు !

Green Signal To Sharmila Padayatra :   షర్మిల పాదయాత్రకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ - వివాదాస్పద వ్యాఖ్యలు చేయవద్దని షరతు !

Chandrababu On Viveka Case : సొంత బాబాయ్ హత్య కేసు వేరే రాష్ట్రానికి బదిలీ, తలెక్కడ పెట్టుకుంటావ్ - చంద్రబాబు

Chandrababu On Viveka Case : సొంత బాబాయ్ హత్య కేసు వేరే రాష్ట్రానికి బదిలీ, తలెక్కడ పెట్టుకుంటావ్ - చంద్రబాబు

Ram Charan NTR : ఎన్టీఆర్, చరణ్ మధ్య నో గొడవ, నథింగ్ - ముందే అంతా మాట్లాడుకుని

Ram Charan NTR : ఎన్టీఆర్, చరణ్ మధ్య నో గొడవ, నథింగ్ - ముందే అంతా మాట్లాడుకుని