News
News
X

Hyderabad Traffic Today: వాహనదారులకు అలర్ట్! నేడు ఈ రూట్స్‌లోకి నో ఎంట్రీ, భారీ ట్రాఫిక్ జామ్‌! వేరే మార్గాలివీ

BiBi Ka Alam 2022 ఊరేగింపును పురస్కరించుకొని దబీర్‌పురా, చాదర్‌ఘాట్, యాకుత్‌పురా ప్రాంతాల్లో ఆంక్షలను విధించారు.

FOLLOW US: 

Traffic Diversion in Hyderabad: నేడు (ఆగస్టు 9) హైదరాబాద్ వాసులకు ట్రాఫిక్ కష్టాలు (Hyderabad Traffic News) ఎదురుకానున్నాయి. పలుచోట్ల ట్రాఫిక్‌ ఆంక్షలు అమలులో ఉంటాయని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. మొహర్రం (Muharram Festival) సందర్భంగా ఈ ఆంక్షలు ఉంటాయని చెప్పారు. మంగళవారం ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఆంక్షలు ఉండడం వల్ల వాహనదారులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు. మొహర్రం సందర్భంగా బీబీకా ఆలవా నుంచి (Bibi Ka Alam Live) చాదర్‌ఘాట్‌ వరకు బీబీకా ఆలం ఊరేగింపు జరగనుంది.

బీబీ-కా-ఆలం (BiBi Ka Alam 2022) ఊరేగింపును దృష్టిలో ఉంచుకుని, దబీర్‌పురా, చాదర్‌ఘాట్, యాకుత్‌పురా ప్రాంతాల్లో ఆంక్షలను విధించారు. ఈ ఊరేగింపు బీబీ కా ఆలవా, దబీర్‌పురా నుండి చాదర్‌ఘాట్‌లోని మస్జీద్-ఎ-ఇలాహి వైపు (Bibi Ka Alam Procession) ప్రారంభమవుతుంది. ఈ సమయంలో మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఆ మార్గంలో ట్రాఫిక్ ను అనుమతించరు.

Bibi Ka Alam Route Map: వాహనాలు సునర్‌గల్లి టీ జంక్షన్ వద్ద బీబీ కా అలవా వైపు వెళ్లడం నిషేధం. యాకుత్‌పురా వైపు దబీర్‌పురా దర్వాజా, గంగా నగర్ నాలా వైపు మళ్లిస్తారు. అంతేకాకుండా, షేక్ ఫైజ్ కమాన్ వైపు వాహనాలను వెళ్లనివ్వరు. ఆ మార్గంలో ట్రాఫిక్ ను నిలిపివేసి, వాటిని జబ్బార్ హోటల్ వద్ద దబీర్‌పురా దర్వాజా లేదా చంచల్‌గూడ (Chanchalguda) వైపు మళ్లిస్తారు. ఎతేబార్ చౌక్ నుండి వెళ్లే వాహనాలు బడా బజార్ వైపు అనుమతించరు. కానీ ఎతేబార్ చౌక్ వద్ద కోట్లా అలీజా లేదా పురానా హవేలీ వైపు నుంచి మళ్లిస్తారు.

మరోవైపు, గౌలిగూడ లేదా అఫ్జల్‌గంజ్ నుండి వచ్చే ట్రాఫిక్‌ను సాలార్ జంగ్, శివాజీ బ్రిడ్జ్ వైపు అనుమతించరు. ఈ రోజు మొత్తం టీఎస్ఆర్టీసీ సిటీ బస్సులు (TSRTC) సహా జిల్లాలకు వెళ్లి లేదా వచ్చే బస్సులను రంగ్‌మహల్, అఫ్జల్‌గంజ్ వైపు ఉదయం 10 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు దారి మళ్లించనున్నారు. మొహర్రం బీబీ కా అలం ఊరేగింపు ముగిసే వరకు కాలీఖబర్, మీరాలం మండి రోడ్డు వైపు వాహనదారులు రావద్దని ట్రాఫిక్ పోలీసులు సూచించారు.

ట్రాఫిక్ సమస్య పరిష్కారం కోసం టాస్క్ ఫోర్స్
మరోవైపు, మామూలు సమయాల్లో సైబరాబాద్‌ పోలీస్ కమిషనరేట్‌ పరిధిలో అక్కడక్కడా ట్రాఫిక్‌ రద్దీ ఏర్పడే సంగతి తెలిసిందే. ఇందుకోసం ప్రత్యేక ట్రాఫిక్‌ టాస్క్‌ఫోర్స్‌ సేవలు మొదలయ్యాయి. రాష్ట్రంలో తొలిసారిగా ట్రాఫిక్‌ టాస్క్‌ఫోర్స్‌ సేవలను సైబరాబాద్‌లో ఆదివారం ట్రాఫిక్‌ డీసీపీ శ్రీనివాసరావుతో కలిసి సీపీ స్టీఫెన్‌ రవీంద్ర ప్రారంభించారు. ఇందుకోసం ప్రత్యేక బైక్‌లను ఏర్పాటు చేశారు.

బైక్స్‌ ప్రత్యేకతలు ఏంటంటే
ట్రాఫిక్‌ టాస్క్‌ఫోర్స్‌ కోసం ఆరు మోటార్‌ సైకిళ్లను ప్రత్యేకంగా వినూత్న డిజైన్ తో తయారు చేయించారు. ఒక్కో బైక్‌పై ఇద్దరు చొప్పున మొత్తం 12 మంది కానిస్టేబుళ్లు ఈ టాస్క్‌ఫోర్స్‌ డ్యూటీలో ఉంటారు. వీరికి ఒక ఎస్‌ఐ ర్యాంక్‌ అధికారి ఇన్‌చార్జిగా ఉంటారు. సైబరాబాద్‌ ట్రాఫిక్‌ డీసీపీ శ్రీనివాస్‌ రావు ఆధ్వర్యంలో టాస్క్‌ఫోర్స్‌ పని చేస్తుంది. ట్రాఫిక్‌ టాస్క్‌ఫోర్స్‌కు అందించిన బైక్‌లలో ఫస్ట్ ఎయిడ్ కిట్, పబ్లిక్‌ అడ్రస్‌ సిస్టమ్, డ్రంకెన్‌ డ్రైవ్‌ చెకింగ్‌ కిట్, హెల్మెట్, రిఫ్లెక్టివ్‌ జాకెట్, కళ్లజోడు తదితర వస్తువులు ఉంటాయి.

ట్రాఫిక్ రద్దీగా ఉండే సమయాల్లో ఈ టాస్క్‌ఫోర్స్‌ బృందాలు పెట్రోలింగ్‌ చేస్తుంటాయి. ట్రాఫిక్‌ జాంలను నివారించడంతో పాటు రోడ్లపై అడ్డుగా నిలిచే వాహనాలను క్లియర్‌ చేయడం, నో పార్కింగ్‌ ప్లేస్‌లో ఉన్న వాహనాలను తొలగించడం వంటివి చేస్తాయి.

Published at : 09 Aug 2022 12:20 PM (IST) Tags: tsrtc Hyderabad News Traffic Diversions Muharram Festival Bibi Ka Alam Live bibi ka alam route map

సంబంధిత కథనాలు

Weather Updates: అల్పపీడనం ఎఫెక్ట్ - 3 రోజులపాటు అక్కడ అతి భారీ వర్షాలు, IMD ఆరెంజ్ అలర్ట్

Weather Updates: అల్పపీడనం ఎఫెక్ట్ - 3 రోజులపాటు అక్కడ అతి భారీ వర్షాలు, IMD ఆరెంజ్ అలర్ట్

కేసిఆర్ వేసిన స్కెచ్‌కు ఆ రెండు జాతీయపార్టీలు ఇంతే సంగతులా?

కేసిఆర్ వేసిన స్కెచ్‌కు ఆ రెండు జాతీయపార్టీలు ఇంతే సంగతులా?

Bandi Sanjay : కేసీఆర్, కేఏ పాల్ మాత్రమే సొంత విమానాలు కొన్నారు, భవిష్యత్ లో పొత్తు పెట్టుకుంటారేమో?- బండి సంజయ్

Bandi Sanjay : కేసీఆర్, కేఏ పాల్ మాత్రమే సొంత విమానాలు కొన్నారు, భవిష్యత్ లో పొత్తు పెట్టుకుంటారేమో?- బండి సంజయ్

రూటు మారుస్తున్న గంజాయి స్మగ్లర్లు- హైదరాబాద్ పోలీసుల నిఘాకు చిక్కకుండా స్కెచ్‌

రూటు మారుస్తున్న గంజాయి స్మగ్లర్లు- హైదరాబాద్ పోలీసుల నిఘాకు చిక్కకుండా స్కెచ్‌

Garikapati Narsimharao : చిరంజీవిపై గరికపాటి సీరియస్, అసూయ పరిపాటే అంటూ నాగబాబు ట్వీట్

Garikapati Narsimharao : చిరంజీవిపై గరికపాటి సీరియస్, అసూయ పరిపాటే అంటూ నాగబాబు ట్వీట్

టాప్ స్టోరీస్

ఏపీ సీఐడికి లేక రాసిన విజయ్‌- కేసుల వివరాలు చెప్పాలని డిమాండ్

ఏపీ సీఐడికి లేక రాసిన విజయ్‌- కేసుల వివరాలు చెప్పాలని డిమాండ్

Godfather Box Office : రెండో రోజు 'గాడ్ ఫాదర్' కలెక్షన్స్ - మెగాస్టార్ మేనియా ఎలా ఉందంటే?

Godfather Box Office : రెండో రోజు 'గాడ్ ఫాదర్' కలెక్షన్స్ - మెగాస్టార్ మేనియా ఎలా ఉందంటే?

Sajjala Ramakrishna Reddy : మా విధానం మాకుంది, కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీపై సజ్జల సంచలన వ్యాఖ్యలు

Sajjala Ramakrishna Reddy :  మా విధానం మాకుంది, కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీపై సజ్జల సంచలన వ్యాఖ్యలు

IND vs SA, Match Highlights: సంజు సక్సెస్ - మ్యాచ్ డెడ్ - ఒక్కడి ఊపు సరిపోలేదు!

IND vs SA, Match Highlights: సంజు సక్సెస్ - మ్యాచ్ డెడ్ - ఒక్కడి ఊపు సరిపోలేదు!