News
News
X

దేశానికే కేసీఆర్‌ రోల్ మోడల్- సరైన టైంలో తెలివైన నిర్ణయం తీసుకున్నారు: తిరుమావళవన్

దళిత బంధు, రైతు బంధు ఈ రెండు స్కీంలు విప్లవాత్మకమైన పథకాలుగా తెలిపారు తిరుమావళవన్. సిఎం కెసిఆర్ బడుగు బలహీన అట్టడుగు వర్గాల అభివృద్ధి మీద దృష్టి కేంద్రీకరించారని వివరించారు.

FOLLOW US: 

తెలంగాణ సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయ పార్టీ ప్రకటనకు ఏర్పాటు చేసిన మీటింగ్‌లో ప్రముఖ దళిత నేత, ఎంపీ, విసికె అధినేత తిరుమావళవన్ పాల్గొన్నారు. బిఆర్ఎస్ అధ్యక్షుడు కెసిఆర్‌కి శుభాకాంక్షలు చెప్పారు. తనను ఆహ్వానించడం గొప్ప గౌరవంగా భావిస్తున్నట్టు పేర్కొన్నారు. ఇది తనకు ప్రత్యేకమైన మరిచిపోలేని రోజని తెలిపారు. టిఆర్ఎస్... బిఆర్ఎస్‌గా మారిందని ఇది కేవలం పేరు మార్పు కాదన్నారు. టి నుంచి బి కి జరిగే పరిణామ క్రమమని అభివర్ణించారు. టి అంటే టార్చ్‌ అని బి అంటే బ్రైట్ అని వివరించారు. బీఆర్‌ఎస్‌తు అద్భుతమైన భవిష్యత్ ఉందన్నారు.  

కెసిఆర్ పూర్తిగా ప్రత్యేకతలు కలిగిన నాయకుడని అభివర్ణించారు తిరుమావళవన్‌. ఆయన ఆలోచనలు, పని విధానం, పోరాటాలు, విజయాలు, అన్నీ కూడా దేనికవే ప్రత్యేకతను కలిగిఉన్నాయన్నారు. తెలంగాణ ప్రజల కోసం ఓ ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించారని కీర్తించారు. ఇప్పుడు భారత దేశ ప్రజల కోసం ముందడుగు వేస్తున్నారన్నారు. విసికే పార్టీ తరఫున శుభాభినందనలు తెలుపారు.  

కేసీఆర్‌ దేశానికే రోల్ మోడల్ అని పేర్కొన్నారు తిరుమావళవన్‌. ఈ దేశంలో మరే ముఖ్యమంత్రి కూడా దళితుల కోసం గిరిజనుల కోసం రైతుల కోసం ఇంతటి గొప్ప కార్యక్రమాలు చేపట్టలేదన్నారు. దళిత బంధు, రైతు బంధు ఈ రెండు స్కీంలు కూడా విప్లవాత్మకమైన పథకాలుగా తెలిపారు. సిఎం కెసిఆర్ బడుగు బలహీన అట్టడుగు వర్గాల అభివృద్ధి మీద దృష్టి కేంద్రీకరించారని వివరించారు. దళితులు రైతులు గిరిజనులు వీల్లే తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్‌ను చేశారన్నారు. సిఎం కెసిఆర్ దార్శనికత కలిగిన నాయకుడని.... పార్టీ పేరును పరిణామం చేయడం అనే నిర్ణయం సరైన సమయంలో తీసుకున్న సమయ స్పూర్తితో కూడిన నిర్మయంగా చెప్పారు. సిఎం కెసిఆర్ తెలంగాణను సాధించినట్టే భారత దేశ అభివృద్ధిని కూడా సాధించాలని కోరుకుంటున్నానని ఆకాంక్షించారు.  
  
ఈ సందర్భంగా వీసీకే పార్టీ తరఫున సందేశాన్ని చదివి వినిపించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల సాధికారత కోసం పాటు పడుతున్న తెలంగాణ ప్రభుత్వానికి అభినందనలు తెలుపుతున్నాను. తెలంగాణ సచివాలయానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరును పెట్టడం గొప్ప విషయం అందుకు అభినందనలు. ఇదే స్పూర్తితో భారత పార్లమెంటుకు కూడా అంబేద్కర్ పేరు పెట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండు చేస్తున్నాం. తెలంగాణలో 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నందుకు సిఎం కేసీఆర్‌కి కృతజ్జతలు. 

News Reels

రైతుల కోసం, దళితుల కోసం, గిరిజనుల కోసం, విప్లవాత్మక కార్యాచరణతో కూడిన పథకాలను సిఎం కెసిఆర్ అమలు చేస్తున్నారు. ఇందులో తెలంగాణ దేశానికే రోల్ మోడల్‌గా నిలిచింది. అందుకు కేసీఆర్‌కు కృతజ్జతలు తెలుపుతున్నాం.
నిజంగా సిఎం కెసిఆర్ దార్శనికత కలిగిన నాయకుడు. రానున్న కాలంలో బిజెపి ఓటమే లక్ష్యంగా అందరం కలిసి పనిచేయాలి. మత విధ్వేషాలను రెచ్చగొడుతూ, దేశంలో విచ్చిన్నతకు కారణమౌతున్న బిజెపి విభజన రాజకీయాలను తిప్పికొట్టాలి. అందుకు అందరం కలిసి పని చేద్దాం అని సందేశాన్ని ముగించారు తిరుమావళవన్. 

Published at : 05 Oct 2022 07:36 PM (IST) Tags: TRS BRS Telangana KCR VCK Tholkappiyan Thirumavalavan

సంబంధిత కథనాలు

CM KCR : యాదాద్రి ప్లాంట్ నుంచి హైదరాబాద్ కు కనెక్టివిటీ, 2023 డిసెంబర్ నాటికి విద్యుత్ ఉత్పత్తి స్టార్ట్ చేయాలి- సీఎం కేసీఆర్

CM KCR : యాదాద్రి ప్లాంట్ నుంచి హైదరాబాద్ కు కనెక్టివిటీ, 2023 డిసెంబర్ నాటికి విద్యుత్ ఉత్పత్తి స్టార్ట్ చేయాలి- సీఎం కేసీఆర్

Komatireddy Rajagopal Reddy : కర్ణాటకతో పాటే తెలంగాణలో ఎన్నికలు, ముందస్తుపై రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Komatireddy Rajagopal Reddy : కర్ణాటకతో పాటే తెలంగాణలో ఎన్నికలు, ముందస్తుపై రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

KTR: డిఫెన్స్ పెట్టుబడులకు తెలంగాణ అత్యంత అనుకూలమైన ప్రాంతం - మంత్రి కేటీఆర్

KTR: డిఫెన్స్ పెట్టుబడులకు తెలంగాణ అత్యంత అనుకూలమైన ప్రాంతం - మంత్రి కేటీఆర్

TS New DGP : నూతన డీజీపీ నియామకంపై తెలంగాణ సర్కార్ కసరత్తు, రేసులో ఆ ముగ్గురు!

TS New DGP : నూతన డీజీపీ నియామకంపై తెలంగాణ సర్కార్ కసరత్తు, రేసులో ఆ ముగ్గురు!

Bandi Sanjay : ఎంఐఎం, టీఆర్ఎస్ ఎన్ని కుట్రలు చేసినా పాదయాత్ర ఆపే ప్రసక్తే లేదు - బండి సంజయ్

Bandi Sanjay : ఎంఐఎం, టీఆర్ఎస్ ఎన్ని కుట్రలు చేసినా పాదయాత్ర ఆపే ప్రసక్తే లేదు - బండి సంజయ్

టాప్ స్టోరీస్

Minister Ambati Rambabu : పవన్ సినిమాల్లోనే హీరో, రాజకీయాల్లో పెద్ద జోకర్ - మంత్రి అంబటి రాంబాబు

Minister Ambati Rambabu : పవన్ సినిమాల్లోనే హీరో, రాజకీయాల్లో పెద్ద జోకర్ - మంత్రి అంబటి రాంబాబు

IT Politics : ఐటీ ఎదుట హాజరైన మల్లారెడ్డి కుటుంబీకులు - విచారణ తర్వాత ఫుల్ కాన్ఫిడెన్స్ !

IT Politics : ఐటీ ఎదుట హాజరైన మల్లారెడ్డి కుటుంబీకులు -  విచారణ తర్వాత ఫుల్ కాన్ఫిడెన్స్ !

AP: ఏపీలో 6,511 పోలిస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

AP: ఏపీలో 6,511 పోలిస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

Pushpa The Rise: రష్యాలో కూడా తగ్గేదే లే - రిలీజ్ ఎప్పుడంటే?

Pushpa The Rise: రష్యాలో కూడా తగ్గేదే లే - రిలీజ్ ఎప్పుడంటే?