Rajasingh Bail : రాజాసింగ్ కేసులో ట్విస్ట్ - బెయిల్ మంజూరు !
రాజాసింగ్ రిమాండ్ రిపోర్టును న్యాయమూర్తి తిరస్కరించారు. నిబంధనల ప్రకారం అరెస్ట్ చేయకపోవడంతో నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
Rajasingh Bail : తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఆయనకు బెయిల్ తిరస్కరించారని.. రిమాండ్‌కు తరలించారన్న ప్రచారం జరిగింది. కానీ న్యాయమూర్తి రిమాండ్ రిపోర్టును తిరస్కరించారు. 41 సి అర్ పి సి కండిషన్ ను పోలీసులు పాటించ లేదని రాజాసింగ్ తరపు లాయర్ కోర్టులో వాదించారు. పోలీసులు రిమాండ్ చేసిన విధానం సరిగా లేదని న్యాయస్థానం అభిప్రాయపడింది. దీంతో రాజా సింగ్ రిమాండ్ ను తిరస్కరిస్తూ నిర్ణయం తీసుకుంది. వెంటనే రాజా సింగ్ ను విడుదల చేయాలని ఆదేశించింది.
ఓ వర్గానికి చెందిన వారి మనోభావాలు కించ పరిచే విధంగా వీడియో
ఓ వర్గానికి చెందిన వారి మనోభావాలను కించ పరిచే విధంగా వీడియో పోస్టు చేయడంతో ఆయనపై కేసులు నమోదయ్యాయి. పాతబస్తీలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడటంతో పోలీసులు ఆ వీడియోను తొలగింప చేశారు. రాజాసింగ్‌పై కేసు పెట్టి ఉదయం అరెస్ట్ చేశారు. సాయంత్రం వరకూ విచారణ చేసి.. నాంపల్లి కోర్టులో హాజరు పరిచారు. మొదట ఆయనకు రిమాండ్ విధించినట్లుగా ప్రచారం జరిగింది. కానీ పోలీసులు ఎలాంటి నోటీసులు జారీ చేయకుండా అరెస్ట్ చేసిన విషయాన్ని రాజాసింగ్ లాయర్ హైలెట్ చేశారు. రాజాసింగ్ లాయర్ వాదనలతో న్యాయమూర్తి ఏకీబవించారు.
తెలంగాణలో మరో ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీపై ఐటీ దాడులు - అంతా గోప్యం !
అరెస్టులో నిబంధనలు పాటించకపోవడంతో బెయిల్ మంజూరు చేసిన నాంపల్లి కోర్టు
ఈ వివాదం తీవ్ర దుమారం రేపడంతో ఆయనను బీజేపీ నుంచే సస్పెండ్ చేశారు. పది రోజుల్లో వివరణ ఇవ్వకపోతే పార్టీ నుంచి బహిష్కరిస్తామని కూడా స్పష్టం చేశారు. ఇటీవల హైదరాబాద్‌లో స్టాండప్ కమెడియన్ మునావర్ ఫారుఖీ ప్రదర్శన ఇచ్చారు. ఈ ప్రదర్శనకు అనుమతి ఇవ్వవొద్దని రాజాసింగ్ డిమాండ్ చేశారు. ఆయన గతంలో హిందూ దేవుళ్లను అవమానిస్తూ స్టాండప్ కామెడీ చేశారని.. అందుకే ప్రదర్శనకు అంగీకరించబోమన్నారు. అయితే కేటీఆర్ ప్రత్యేక ఆహ్వానం మీద మునావర్ షో ఇవ్వడానికి వచ్చినందున పోలీసులు కూడా ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకుని షోను సక్సెస్ చేశారు. రెండు రోజుల పాటు రాజాసింగ్‌ను అరెస్ట్ చేశారు. అయితే తమ కార్యకర్తలు టిక్కెట్లు కొన్నారని.. మునావర్‌ను కొడతామని .. వేదికను తగులబెడతామని హెచ్చరించారు. దానికి ప్రతీకారంగానే ఆయన వీడియో పెట్టినట్లుగా తెలుస్తోంది.
తెలంగాణలో మరో ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీపై ఐటీ దాడులు - అంతా గోప్యం !
రాజాసింగ్ వ్యాఖ్యలతో పాతబస్తీలో ఉద్రిక్తత - భారీ భద్రత ఏర్పాటు
రాజాసింగ్ కారణంగా పాతబస్తీలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. నాంపల్లి కోర్టు వద్దనే రాజాసింగ్ అనుకూల.. వ్యతిరేక వర్గాలు మోహరించడంతో పోలీసులు టెన్షన్ పడ్డారు. ఇప్పుడు రాజాసింగ్‌కు బెయిల్ లభించడం మరొక సవాల్‌గా మారింది. అల్లర్లు చెలరేగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రాజాసింగ్‌పై పీడీయాక్ట్ పెట్టాలని కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ డిమాండ్ చేస్తున్నారు.