Vc Sajjanar: పిల్లల ప్రాణాలతో చెలగాటం అవసరమా? - ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ట్వీట్ వైరల్
Telangana News: ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ చేసిన తాజా ట్వీట్ వైరల్‌గా మారింది. ఓ వ్యక్తి ప్రమాదకరంగా బైక్‌పై పిల్లలను తీసుకెళ్తున్న ఫోటో షేర్ చేసిన ఆయన.. వారి ప్రాణాలతో చెలగాటం అవసరమా అని ప్రశ్నించారు.
RTC MD Sajjanar Tweet Viral: ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని పోలీసులు ఎంత అవగాహన కల్పిస్తున్నా కొందరి తీరు మారదు. బైక్స్, కార్లలో ప్రమాదకరంగా ప్రయాణిస్తుంటారు. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే తెలంగాణ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ (VC Sajjanar) ట్విట్టర్ వేదికగా అలాంటి ఘటనలను ఎప్పటికప్పుడు ఉదాహరిస్తూ అవగాహన కల్పిస్తుంటారు. ఈ క్రమంలోనే ఆయన తాజాగా చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి బైక్‌పై ఐదుగురు పిల్లలను ఎక్కించుకుని ప్రమాదకరంగా వెళ్తోన్న ఓ ఫోటోను ఆయన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. 'పిల్లల ప్రాణాలతో చెలగాటం అవసరమా?' అంటూ ప్రశ్నించారు. పిల్లలకు చిన్నతనం నుంచి ట్రాఫిక్ రూల్స్‌పై అవగాహన కల్పించాల్సింది పోయి.. ఇలా ప్రమాదకర రీతిలో వారిని ఇలా బైక్‌పై తీసుకెళ్లడం బాధాకరమని అన్నారు. ఇలాంటి డేంజర్ ప్రయాణాలను ప్రోత్సహిస్తూ.. పిల్లలకు ఏం నేర్పిస్తున్నారో ఒకసారి ఆలోచించాలని సూచించారు. 'రన్నింగ్‌లో చిన్న ప్రమాదం జరిగిన వారి ప్రాణాలకే ప్రమాదమనే విషయం మీకు తెలియదా!?' అంటూ నిలదీశారు.
పిల్లల ప్రాణాలతో చెలగాటం అవసరమా!?
— V.C. Sajjanar, IPS (@SajjanarVC) September 16, 2024
పిల్లలకు చిన్నతనం నుంచి ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన కల్పించాల్సింది పోయి.. ప్రమాదకర రీతిలో వారిని ఇలాబైక్పై తీసుకెళ్లడం బాధాకరం. ఇలాంటి డేంజర్ ప్రయాణాలను ప్రోత్సహిస్తూ.. పిల్లలకు ఏం నేర్పిస్తున్నారో ఒకసారి ఆలోచించాలి. రన్నింగ్ లో చిన్న ప్రమాదం… pic.twitter.com/Fe53uP8nke
Also Read: Hyderabad News: ఆ కారు ధర రూ.51 లక్షలు - రిపేర్లకు రూ.50 లక్షల అంచనా, అసలు ట్విస్ట్ ఏంటంటే?