By: ABP Desam | Updated at : 02 Feb 2022 05:23 PM (IST)
క్యాలెండర్ విడుదల చేస్తున్న మంత్రి ఎర్రబెల్లి
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలులో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నెంబర్ వన్ గా నిలిచిందన్నారు రాష్ట్ర పంచాయతీరాజ, గ్రామీణ అభివృద్ధి, మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ లోని మినిస్టర్ క్వార్టర్స్‌లో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం రాష్ట్ర కంప్యూటర్ ఆపరేటర్ అసోసియేషన్ 2022 సంవత్సరపు క్యాలెండర్ ను, డైరీని మంత్రి ఆవిష్కరించారు.
తెలంగాణ రాష్ట్రానికి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 13 కోట్ల 75 లక్షల పనిదినాలు కేటాయిస్తే, ఇప్పటివరకు 13 కోట్ల 40 లక్షల పనిదినాలు (97.97 శాతం) కల్పించామన్నారు మంత్రి. మరో 2 కోట్ల పని దినాలకు ఈ సంవత్సరంలో అనుమతి లభించిందని తెలిపారు. ఉపాధి హామీ పథకం కింద రాష్ట్రంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే ఇప్పటి వరకూ 3 వేల 498 కోట్ల, 40 లక్షల రూపాయలు ఖర్చు చేసినట్టు తెలిపారు మంత్రి. ఈ పథకం కింద కూలీలకు 2 వేల 381 కోట్ల రూపాయలు చెల్లించినట్లు మంత్రి వివరించారు. గ్రామాల‌్లో జీవనోపాధి, మౌలిక వసతుల కల్పనకు 1065 కోట్ల 60 లక్షల రూపాయలు మెటీరియల్ రూపంలో చెల్లించామని ప్రకటించారు.
సీఎం కేసీఆర్ ఆదేశాలతో రాష్ట్రంలో ఉపాధి హామీ పథకం వల్ల ఎన్నో సత్ఫలితాలు సాధిస్తున్నామని మంత్రి తెలిపారు. పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి అధికారులు, ఉద్యోగులు, ఉపాధి హామీ ఉద్యోగులు పథకం అమలుకు ఎంతో కృషి చేస్తున్నారని అన్నారు. గ్రామీణ పేదల ఉపాధికి , గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి అమలు చేస్తున్న జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేస్తున్నదని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆరోపించారు.
కరోనా నేపథ్యంలో నిరుద్యోగులు గ్రామీణ ప్రాంతాలలో ఉపాధి పొందుతున్నారని, ఇప్పుడు వాళ్లకు అవకాశం కూడా దక్కకుండా కేంద్ర చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు ఎర్రబెల్లి. దేశంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి 2021-22 ఆర్థిక సంవత్సరంలో 98 వేల కోట్ల రూపాయలు కేటాయించగా, 2022-23 ఆర్ధిక సంవత్సరంలో 73 వేల కోట్ల రూపాయలకు కుదించడం శోచనీయమని మంత్రి అన్నారు.
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మంత్రి దయాకర్ రావు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.
Also Read: తూర్పుగోదావరి జిల్లాలో కలకలం... కల్లు తాగిన నలుగురు మృతి.. ఇంకొకరి పరిస్థితి విషమం
Also Read: ఈ ఊర్లో వారికి పిల్లను ఇవ్వటంలేదు, హైవేకు దగ్గర్లోనే గ్రామం.. 100 ఏళ్లుగా ఎన్నో కష్టాలు
Also Read త్వరలోనే ‘ఫిష్ ఆంధ్ర’ పథకం.. ట్రయల్ రన్‌లో జగనన్న చేపల వాహనాలు
What's App Calls Cheating : అందమైన అమ్మాయి వాట్సప్ వీడియో కాల్ చేస్తే, మీకు చిక్కులే!
TS EAMCET Results 2022 : రేపు తెలంగాణ ఎంసెట్,ఈసెట్ ఫలితాలు విడుదల
Minister KTR : సీఎం కేసీఆర్ చిత్రపటానికి రాఖీలు కట్టండి, ఆడబిడ్డలకు కేటీఆర్ పిలుపు
TS Cabinet Meet : తెలంగాణ కేబినెట్ భేటీ, మునుగోడు ఉపఎన్నికపై చర్చ!
Hyderabad Crime : జీడిమెట్లలో దారుణం, బ్యూటిషన్ పై స్నేహితుడే అత్యాచారం!
Malik Review: మాలిక్ రివ్యూ: ఫహాద్ ఫాజిల్ గ్యాంగ్స్టర్ థ్రిల్లర్ ఆకట్టుకుంటుందా?
Telangana Cabinet : ఆగస్టు 15 నుంచి పది లక్షల మంది కొత్తగా సామాజిక పెన్షన్లు - తెలంగాణ కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు !
కొణిదెల వారింట పెళ్లి సందడి - ఆ యాంకర్తో మెగా హీరో నిశ్చితార్థం!
టార్గెట్ లోకేష్ వ్యూహంలో వైఎస్ఆర్సీపీ విజయం సాధిస్తుందా?