Hyderabad News: హైదరాబాద్‌లో మరోసారి కాల్పుల కలకలం- నాంపల్లిలో డెకాయి ఆపరేషన్‌లో ఘటన
Telangana News హైదరాబాద్‌లో ఐదోసారి కాల్పులు కలకలం రేపాయి. ఇన్నాళ్లు శివారు ప్రాంతాల్లో జరిగితే... ఈసారి నడిబొడ్డులో జరిగాయి.
![Hyderabad News: హైదరాబాద్‌లో మరోసారి కాల్పుల కలకలం- నాంపల్లిలో డెకాయి ఆపరేషన్‌లో ఘటన Telangana Police open firing on thieves at Nampally in in Hyderabad Hyderabad News: హైదరాబాద్‌లో మరోసారి కాల్పుల కలకలం- నాంపల్లిలో డెకాయి ఆపరేషన్‌లో ఘటన](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/12/3f6eceb8e447a5f5edbff31a1f77ef9f1720752581861215_original.png?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Hyderabad Crime News: గురువారం అర్థరాత్రి హైదరాబాద్‌లోని నాంపల్లిలో కాల్పులు కలకలం రేపాయి. రైల్వేస్టేషన్‌కు సమీపంలో అనుమానస్పదంగా తిరుగుతున్న ముఠాను పట్టుకునేందు పోలీసులు ప్రయత్నించడం వాళ్లు తిరగబడటంతో కాల్పులకు దారి తీసింది.
రైల్వేస్టేషన్‌లో తిరుగుతున్న పాత నేరస్థులను పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నించారు. వెంటనే అలర్ట్ అయిన దొంగల ముఠా దాడికి యత్నించిండి. ఒకరితో గొడ్డలితో దాడికి యత్నిస్తే... మరికొందరు రాళ్లతో దాడికి యత్నించారు.
దీంతో పోలీసులు తిరిగి ఫైర్ చేశారు. ఈ కాల్పుల్లో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. రాజు అనే వ్యక్తి తొడలోకి బులెట్ దూసుకెళ్లింది. అనీస్ అనే వ్యక్తి కూడా గాయపడ్డారు. ఇద్దర్నీ ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు పోలీసులు. ఆపరేషన్ చేసిన వైద్యులు రాజు కాలికి ఉన్న బులెట్‌ను తొలగించారు.
వారంతా దోపిడీ దొంగలుగా పోలీసులు అనుమానిస్తున్నారు. అందుకే వారిని వెంబడించేందుకు పోలీసులు ప్రయత్నించడం వారు ప్రతిఘటించడం కాల్పులు చేయడం జరిగింది. హైదరాబాద్‌లో ఈ మధ్య కాలంలో ఇలా కాల్పులు జరగడం ఐదోసారి.
ఈ మధ్య కాలంలో హైదరాబాద్‌లో క్రైమ్ రేట్ పెరిగిపోతోంది. రాత్రివేళల్లో తిరిగేవారిని టార్గెట్ చేసుకుంటున్నారు. బస్ స్టాండ్ రైల్వే స్టేషన్‌లలో ప్రయాణికులను కూడా టార్గెట్ చేసుకుంటున్నారు కొన్ని బ్యాచ్‌లు. వారి నుంచి డబ్బులు, నగలు, సెల్‌ఫోన్లు కొట్టేస్తున్నారు. ఇలాంటి బ్యాచ్‌లను పట్టుకునేందుకు చాలా రోజుల నుంచి పోలీసులు డెకాయి ఆపరేషన్ చేస్తున్నారు.
నాంపల్లి రైల్వేస్టేషన్‌లో కూడా గురువారం రాత్రి పోలీసులు డెకాయి ఆపరేషన్ నిర్వహించారు. కమిషనర్ ఆదేశాల మేరకు రాత్రి నాంపల్లి రైల్వే స్టేషన్‌లో ఆపరేషన్ చేపట్టారు. అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరు వ్యక్తులను పట్టుకున్నారు. వారిని ప్రశ్నించారు. ఇంతలో పక్కనే ఉన్న మరో ఇద్దరు అలర్ట్ అయ్యి పోలీసులపై దాడికి యత్నించారు. పోలీసుల నుంచి తప్పించుకునేందుకు ఒకరు గొడ్డలితో దాడికి ప్రయత్నించగా... మరో వ్యక్తి రాళ్ల దాడికి దిగాడు.
వారిని పట్టుకునేందుకు, ఆత్మ రక్షణ కోసం పోలీసులు ఫైరింగ్ ఓపెన్ చేశారు. పోలీసులు చేసిన కాల్పుల్లో ఇద్దరు దొంగలు గాయపడ్డారు. వారికి ఉస్మానియాలో చికిత్స అందిస్తున్నారు. నాంపల్లి పోలీసులు, యాంటీ డెకయిట్ టీమ్ సంయుక్తంగా ఆపరేషన్ చేపట్టారు. పోలీసులకు చిక్కిన వారంతా మాంగర్ బస్తికి చెందిన వారుగా గుర్తించారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)