అన్వేషించండి

తెలంగాణ ప్రజలతో కేసీఆర్ రుణం తీరిపోయింది- ఇక్కడ పోటీ చేసే అర్హత కోల్పోయారు: రేవంత్‌రెడ్డి

కుటుంబ తగాదాల పరిష్కారం, రాజకీయ దురాశతోనే బీఆర్ఎస్‌ ఆవిర్భవించిందన్నారు రేవంత్ రెడ్డి. తెలంగాణ అనే పదం చంపేయాలనుకున్న హంతకుడని కేసీఆర్‌పై తీవ్ర విమర్శలు చేశారు.

కొత్తగా ఏర్పడిన భారత్‌ రాష్ట్రీయసమితిపై తెలంగాణ పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి ఘాటుగా స్పందించారు. 2001 నుంచి 2022 వరకు కేసీఆర్‌ తెలంగాణ పేరుతో ఆర్థికంగా బలోపేతమయ్యారని విమర్శించారు. అందుకే ఇప్పుడు మరింత విస్తృతమయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. వినాశకాలే విపరీత బుద్ది అన్నట్టు కేసీఆర్ వ్యవహార శైలి ఉందన్నారు. తెలంగాణ అస్థిత్వాన్ని కేసీఆర్ చంపేశారని హాట్ కామెంట్స్ చేశారు.  తెలంగాణలో తన ఆర్థిక, రాజకీయ ప్రయోజనాలకు కాలం చెల్లిందని గ్రహించే ఈ జాతీయ పార్టీ పాటపాడుతున్నారని విమర్శించారు. తెలంగాణ ప్రజలకు కేసీఆర్‌కు రుణం తీరిపోయిందని అభిప్రాయపడ్డారు. తెలంగాణ అనే పదం జాతీయ స్థాయిలో వినిపించకుండా కేసీఆర్ కుట్ర చేస్తున్నారన్నారు. 

కుటుంబ తగాదాల పరిష్కారంతోపాటు రాజకీయ దురాశతోనే బీఆర్ఎస్‌ ఆవిర్భవించిందన్నారు రేవంత్ రెడ్డి. తెలంగాణ అనే పదం ఇక్కడి ప్రజల జీవన విధానంలో భాగమని... అలాంటి పదం చంపేయాలనుకున్న హంతకుడని కేసీఆర్‌పై తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణ హంతకుడిని వదిలే ప్రసక్తే లేదన్నారు. ఒక తెలంగాణ బిడ్డగా కేసీఆర్ దుర్మార్గపు ఆలోచనను తీవ్రంగా ఖండిస్తున్నట్టు పేర్కొన్నారు. కేసీఆర్‌లో వికృత ఆలోచనలకు ఇది పరాకాష్టగా అభివర్ణించారు. 

తెలంగాణ అస్థిత్వాన్ని చంపేసిన కీసీఆర్‌ ఈ ప్రాంతంలో పోటీ చేయడానికి కూడా అర్హత లేదన్నారు రేవంత్‌రెడ్డి. తెలంగాణ ప్రజలు ఈ విషయంలో ఆలోచించుకోవాలన్నారు. ప్రజల్ని మభ్య పెట్టడానికే బీఆరెస్ తెరపైకి తీసుకొచ్చారని అభిప్రాయపడ్డారు. 
ఇది అయిపోయిన తర్వాత ప్రపంచ రాష్ట్ర సమితి అని కూడా పెట్టినా ఆశ్చర్య పోనవసరం లేదని కేసీఆర్‌ను ఎద్దేవా చేశారు. కేసీఆర్ లాంటి దుష్ట శక్తి నుంచి తెలంగాణ ప్రజలకు విముక్తి కలిగించాలని దేవుడిని కోరుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. 

కేసీఆర్‌ నుంచి తెలంగాణ నుంచి విముక్తి లబించాలని దసరా జమ్మి చెట్టు పూజల్లో కాగితంపై రాసి పెట్టాలని ప్రజలకు రేవంత్ పిలుపునిచ్చారు. తాను కూడా జమ్మి చెట్టు పూజలో కాగితంపై రాసి దేవుడిని కోరుకున్నట్టు వెల్లడించారు. తెలంగాణలో 12 నెలల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ, ఏపీ విభజన సమస్యలను తామే పరిష్కరించుకుటామన్నారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Rythu Bharosa: రైతు భరోసా విధి విధానాలపై మంత్రుల కమిటీ కసరత్తు - అన్నదాతల ఖాతాల్లో నిధుల జమ ఎప్పుడంటే?
రైతు భరోసా విధి విధానాలపై మంత్రుల కమిటీ కసరత్తు - అన్నదాతల ఖాతాల్లో నిధుల జమ ఎప్పుడంటే?
Ramcharan Cutout: 256 అడుగుల రామ్‌చరణ్ భారీ కటౌట్ - హెలికాఫ్టర్ సాయంతో పూలవర్షం, ప్రపంచ రికార్డుల్లోకి..
256 అడుగుల రామ్‌చరణ్ భారీ కటౌట్ - హెలికాఫ్టర్ సాయంతో పూలవర్షం, ప్రపంచ రికార్డుల్లోకి..
Numaish: ప్రతిష్టాత్మక నుమాయిష్‌కు సర్వం సిద్దం - ప్రారంభ తేదీ వాయిదా, ఎప్పటి నుంచంటే?
ప్రతిష్టాత్మక నుమాయిష్‌కు సర్వం సిద్దం - ప్రారంభ తేదీ వాయిదా, ఎప్పటి నుంచంటే?
Fake Calls: ఫేక్ కాల్స్ ఎక్కువ వస్తున్నాయా? - వెంటనే ఇలా చేయండి!
ఫేక్ కాల్స్ ఎక్కువ వస్తున్నాయా? - వెంటనే ఇలా చేయండి!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్, అసలు నిజాలు చెప్పిన పోలీసులుగవాస్కర్ కాళ్లు మొక్కిన నితీష్ తండ్రి..  ఎమోషనల్ వీడియోసెంచరీ చేసిన నితీశ్ రెడ్డి, సోషల్ మీడియాలో స్టిల్స్ వైరల్మాజీ ప్రధాని మన్మోహన్ అంత్యక్రియలు పూర్తి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rythu Bharosa: రైతు భరోసా విధి విధానాలపై మంత్రుల కమిటీ కసరత్తు - అన్నదాతల ఖాతాల్లో నిధుల జమ ఎప్పుడంటే?
రైతు భరోసా విధి విధానాలపై మంత్రుల కమిటీ కసరత్తు - అన్నదాతల ఖాతాల్లో నిధుల జమ ఎప్పుడంటే?
Ramcharan Cutout: 256 అడుగుల రామ్‌చరణ్ భారీ కటౌట్ - హెలికాఫ్టర్ సాయంతో పూలవర్షం, ప్రపంచ రికార్డుల్లోకి..
256 అడుగుల రామ్‌చరణ్ భారీ కటౌట్ - హెలికాఫ్టర్ సాయంతో పూలవర్షం, ప్రపంచ రికార్డుల్లోకి..
Numaish: ప్రతిష్టాత్మక నుమాయిష్‌కు సర్వం సిద్దం - ప్రారంభ తేదీ వాయిదా, ఎప్పటి నుంచంటే?
ప్రతిష్టాత్మక నుమాయిష్‌కు సర్వం సిద్దం - ప్రారంభ తేదీ వాయిదా, ఎప్పటి నుంచంటే?
Fake Calls: ఫేక్ కాల్స్ ఎక్కువ వస్తున్నాయా? - వెంటనే ఇలా చేయండి!
ఫేక్ కాల్స్ ఎక్కువ వస్తున్నాయా? - వెంటనే ఇలా చేయండి!
Boxing Day Test Updates: భారత్ నెగ్గాలంటే ఎంసీజీ రికార్డు బద్దలవ్వాల్సిందే - 96 ఏళ్ల కిందట టార్గెట్ ఛేదన, ఆసీస్ ఇన్నింగ్స్ ఎందుకు డిక్లేర్ చేయలేదు!
భారత్ నెగ్గాలంటే ఎంసీజీ రికార్డు బద్దలవ్వాల్సిందే - 96 ఏళ్ల కిందట టార్గెట్ ఛేదన, ఆసీస్ ఇన్నింగ్స్ ఎందుకు డిక్లేర్ చేయలేదు!
New Year Celebrations: హైదరాబాద్‌లో న్యూఇయర్ వేడుకలు - ఈ పబ్బులకు నో పర్మిషన్, ఎంజాయ్ చేయండి.. కానీ ఇవి తప్పనిసరి!
హైదరాబాద్‌లో న్యూఇయర్ వేడుకలు - ఈ పబ్బులకు నో పర్మిషన్, ఎంజాయ్ చేయండి.. కానీ ఇవి తప్పనిసరి!
Borewell Deaths: పదేళ్ల బాలుడి ఉసురు తీసిన బోరుబావి - 16 గంటలు శ్రమించినా దక్కని ఫలితం, చిన్నారుల పాలిట మృత్యుపాశాలుగా..
పదేళ్ల బాలుడి ఉసురు తీసిన బోరుబావి - 16 గంటలు శ్రమించినా దక్కని ఫలితం, చిన్నారుల పాలిట మృత్యుపాశాలుగా..
Sandhya Theater Stampede: 'ఆ రోజు థియేటర్ నిర్వహణ మైత్రీ మూవీ మేకర్స్ తీసుకుంది' - పోలీసులకు సంధ్య థియేటర్ యాజమాన్యం లేఖ
'ఆ రోజు థియేటర్ నిర్వహణ మైత్రీ మూవీ మేకర్స్ తీసుకుంది' - పోలీసులకు సంధ్య థియేటర్ యాజమాన్యం లేఖ
Embed widget