అన్వేషించండి

Telangana News: గోదావరి బోర్డుపై ఎన్జీటీ ఫైర్ - ఉత్తర్వులు ఇచ్చినా సీతమ్మసాగర్ పనుల కొనసాగింపు ఏంటని ప్రశ్న

Telangana News: ఉత్తర్వులకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రభుత్వం సీతమ్మ సాగర్ ప్రాజెక్టు పనులు కొనసాగించడంపై జాతీయ హరిత ట్రిబ్యునల్ ఆగ్రహం వ్యక్తం చేసింది. 

Telangana News: మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసినప్పికీ తెలంగాణ ప్రభుత్వం సీతమ్మ సాగర్ ప్రాజెక్టు పనులు కొనసాగించడాన్ని చెన్నైలోని జాతీయ హరిత ట్రిబ్యునల్ వ్యతిరేకించింది. కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ, గోదావరి నది నిర్వహణ బోర్డులతో కూడిన సంయుక్త కమిటీ నివేదిక ఈ విషయాన్ని స్పష్టం చేస్తోందని తెలిపింది. అయినప్పటికీ తెలంగాణ ప్రభుత్వంపై చర్యలు తీసుకునే అధికారం తమకు లేదని బీఆర్ఎంబీ కౌంటర్ దాఖలు చేయడాన్ని తప్పు పట్టింది. గోదావరి జలాల పంపిణీపై అధికారం ఉన్న జీఆర్ఎంబీ, ఆ జలాల ఆధారంగా తెలంగాణ ప్రభుత్వం ప్రాజెక్టు నిర్మిస్తే.. తమకు సంబంధం లేదనడం ఆశ్చర్యం కల్గిస్తోందని చెప్పింది. అలాంటి అధికారం లేనప్పుడు 2021లో డీపీఆర్, అనుమతులు లేకుండా పనులు కొనసాగించరాదంటూ రాష్ట్ర ప్రభుత్వానికి నోటీలుసు ఎలా జారీ చేసిందని ప్రశ్నించారు. కౌంటర్ దాఖలు చేసిన జీఆర్ఎంబీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీరుకు జీఆర్ఎంబీ విధులు, అధికారాలు తెలుసా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. బోర్డు కార్యదర్శి నుంచి ఆ వివరాలు తెలుసుకోవాలనుకుంటున్నామని స్పష్టం చేశారు. 

అనుమతులు లేకుండా పనులు కొనసాగించడం ఉత్తర్వుల ఉల్లంఘనే

మార్చి 24వ తేదీ నుంచిి జూన్ 28 వరకు కేవలం అక్కడ ఉన్న యంత్రాలు, షట్టర్లు, తొలగిస్తున్నామని మాత్రమే తెలంగాణ ప్రభుత్వం చెబుతున్నప్పటికీ అక్కడ పనులకు సంబంధించిన రిజిస్టర్లు పెట్టలేదని వివరించింది. అక్కడ ఎలాంటి రికార్డులు లేకుండా, అనుమతులు లేకుండా పనులు చేస్తున్నట్లు కనిపిస్తోందని వెల్లడించింది. ఒకవేళ ఏవైనా షట్టర్ల తొలగింపు వంటి పనులు చేపట్టాలనుకుంటే ట్రైబ్యునల్ అనుమతి అవసరం అని.. అనుమతి లేకుండా పనులు కొనసాగించడం ఉత్తర్వుల ఉల్లంఘనే అవుతుందని పేర్కొంది. 

అనుమతులు ఉన్నాయంటున్న తెలంగాణ సర్కారు

పర్యావరణ అనుమతులు లేకుండా సీతమ్మ సాగర్ మల్టీ పర్సస్ ప్రాజెక్టు పనులను కొనసాగించరాదంటూ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులకు విరుద్ధంగా తెలంగాణ ప్రభుత్వం పనులు కొనసాగిస్తోందని టి నరేష్ కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఎన్జీటీ బుధవారం విచారణ చేపట్టింది. ఆయా ఉత్తర్వులు గురువారం అందుబాటులోకి వస్తాయని వెల్లడించింది. బుధవారం జరిగిన విచారణలో తెలంగాణ ప్రభుత్వం తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ప్రధాన ప్రాజెక్టు సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం పనులకు పర్యావరణ అనుమతులు ఉన్నాయని చెప్పారు. దీని విస్తరణలో భాగంగానే సీతమ్మ సాగర్ మల్టీ పర్సస్ ప్రాజెక్టు పనులను చేపట్టామని అయినా విస్తరణకు అనుమతులు కోరుతూ దరఖాస్తు చేశామని వివరించారు. ట్రైబ్యునల్ ఉత్తర్వులను ఉల్లఘించలేదని చెప్పారు. సీతమ్మ సాగర్ ప్రాజెక్టుకు డీపీఆర్ సమర్పించాలని, అనుమతులు వచ్చే వరకూ పనులు చేపట్టరాదంటూ 2021 డిసెంబర్ లో తెలంగాణకు లేఖ రాసినట్లు జీఆర్ఎంబీ దాఖలు చేసిన కౌంటర్ లో పేర్కొంది. 

మధ్యంతర ఉత్తర్వులు కొనసాగుతాయి...

ఈ ఏడాది మార్చిలో అందిన డీపీఆర్ ను కేంద్ర జలసంఘానికి పంపినట్లు తెలిపింది. అయినా పనులకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిందని.. దానిపై చర్య తీసుకునే అధికారం తమకు లేదని వెల్లడించింది. ఈ కౌంటర్ ను పరిశీలించిన ఎన్జీటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. గోదావరి జలాలపై అధికారం ఉన్న బోర్డుకు.. అనుమతుల్లేని నిర్మాణాలు చేపడుతున్న రాష్ట్రంపై చర్య తీసుకునే అధికారం లేదన్న సమాచారం సహేతుకుంగా లేదని స్పష్టం చేసింది. సంయుక్త కమిటీలో సభ్యుడిగా ఉన్న ఎస్ఈ కె. ప్రసాద్ ప్రాజెక్టును సందర్శించి దాని ప్రస్తావన లేకుండా తప్పించుకునేలా కౌంటర్ సమర్పించడం సరికాదని వివరించింది. అక్కడ పనులు చేస్తున్న విషయం స్పష్టం అవుతోందని తెలిపింది. ఈ ఉల్లంఘనలపై పర్యావరణ మంత్రిత్వ శాఖ జీఆర్ఎంబీలు ఏం చర్యలు తీసుకున్నాయన్న విషయంపై నివేదిక సమర్పించే వరకూ వేచి చూస్తామని వ్యాఖ్యానించింది. తదుపరి ఉత్తర్వులు వెలువరించే వరకూ నిర్మాణాలను కొనసాగించరాదని చెప్పింది. అలాగే అప్పటి వరకు మధ్యంతర ఉత్తర్వులు కొనసాగుతాయంటూ విచారణను ఆగస్టు 17వ తేదీకి వాయిదా వేసింది. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Chandrababu First Sign in 2025: నూతన సంవత్సరంలో సీఎం చంద్రబాబు తొలి సంతకం, వారికి అందనున్న ఆర్ధికసాయం
నూతన సంవత్సరంలో సీఎం చంద్రబాబు తొలి సంతకం, వారికి అందనున్న ఆర్ధికసాయం
Visa Fee Reductions : చైనాకు వెళ్లాలనుకునే ఇండియన్స్ కు గుడ్ న్యూస్.. వీసా ఫీజుల తగ్గింపు ఈ ఏడాదికి పెంపు
చైనాకు వెళ్లాలనుకునే ఇండియన్స్ కు గుడ్ న్యూస్ - వీసా ఫీజుల తగ్గింపు ఈ ఏడాదికి పెంపు
SSMB29: ఎక్స్‌క్లూజివ్... మహేష్ బాబు - రాజమౌళి సినిమా లాంచింగ్ డేట్ ఫిక్స్!
ఎక్స్‌క్లూజివ్... మహేష్ బాబు - రాజమౌళి సినిమా లాంచింగ్ డేట్ ఫిక్స్!
Big Blow For Australia: ఆస్ట్రేలియాకు భారీ షాక్, ఐదో టెస్టుకు గాయంతో స్టార్ ప్లేయర్ దూరం! సిరీస్ సమమైతే ట్రోఫీ భారత్ వశం
ఆస్ట్రేలియాకు భారీ షాక్, ఐదో టెస్టుకు గాయంతో స్టార్ ప్లేయర్ దూరం! సిరీస్ సమమైతే ట్రోఫీ భారత్ వశం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

తప్పతాగి కరెంటు తీగలపై పడుకున్నాడు - వీడియోఅమెరికాలో తెలుగు యూత్ పాడు పని! కేటీఆర్, బండి సంజయ్‌ అనుచరులేనా?Fishing in Yanam | చేపలు పట్టడంలో ఇదో కొత్త పంథాLorry Rushed in to Xerox Shop | విశాఖలో ప్రమాదం..జిరాక్సు షాపులోకి దూసుకెళ్లిన లారీ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu First Sign in 2025: నూతన సంవత్సరంలో సీఎం చంద్రబాబు తొలి సంతకం, వారికి అందనున్న ఆర్ధికసాయం
నూతన సంవత్సరంలో సీఎం చంద్రబాబు తొలి సంతకం, వారికి అందనున్న ఆర్ధికసాయం
Visa Fee Reductions : చైనాకు వెళ్లాలనుకునే ఇండియన్స్ కు గుడ్ న్యూస్.. వీసా ఫీజుల తగ్గింపు ఈ ఏడాదికి పెంపు
చైనాకు వెళ్లాలనుకునే ఇండియన్స్ కు గుడ్ న్యూస్ - వీసా ఫీజుల తగ్గింపు ఈ ఏడాదికి పెంపు
SSMB29: ఎక్స్‌క్లూజివ్... మహేష్ బాబు - రాజమౌళి సినిమా లాంచింగ్ డేట్ ఫిక్స్!
ఎక్స్‌క్లూజివ్... మహేష్ బాబు - రాజమౌళి సినిమా లాంచింగ్ డేట్ ఫిక్స్!
Big Blow For Australia: ఆస్ట్రేలియాకు భారీ షాక్, ఐదో టెస్టుకు గాయంతో స్టార్ ప్లేయర్ దూరం! సిరీస్ సమమైతే ట్రోఫీ భారత్ వశం
ఆస్ట్రేలియాకు భారీ షాక్, ఐదో టెస్టుకు గాయంతో స్టార్ ప్లేయర్ దూరం! సిరీస్ సమమైతే ట్రోఫీ భారత్ వశం
New Year 2025: న్యూ ఇయర్ సందర్భంగా అమాంతం పెరిగిన కండోమ్ ఆర్డర్స్, ఇండియన్స్ ఇంకా ఏమేం కొన్నారంటే!
న్యూ ఇయర్ సందర్భంగా అమాంతం పెరిగిన కండోమ్ ఆర్డర్స్, ఇండియన్స్ ఇంకా ఏమేం కొన్నారంటే!
Hyderabad Drunk And Drive Cases: మందుబాబుల జోరు - హైదరాబాద్‌లో భారీగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు
మందుబాబుల జోరు - హైదరాబాద్‌లో భారీగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు
First Flight Experience : మొదటిసారి విమానంలో ప్రయాణిస్తుంటే ఫాలో అవ్వాల్సిన టిప్స్ ఇవే.. ఆ విషయం అస్సలు మరచిపోకండి
మొదటిసారి విమానంలో ప్రయాణిస్తుంటే ఫాలో అవ్వాల్సిన టిప్స్ ఇవే.. ఆ విషయం అస్సలు మరచిపోకండి
AP Govt Good News ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం డబుల్ బొనాంజా! - గురువారం ప్రకటించే అవకాశం
ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం డబుల్ బొనాంజా! - గురువారం ప్రకటించే అవకాశం
Embed widget