News
News
వీడియోలు ఆటలు
X

Telangana Inter Results 2023: తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో ఫస్ట్ ఇయర్‌ పాస్‌ పర్సంటేజ్‌ 65 శాతం

Telangana Inter Results 2023: తెలంగాణలో ఈ ఏడాది మార్చి 15 నుంచి ఏప్రిల్‌ 5 వరకు ఇంటర్ పరీక్షలు నిర్వహించారు. మొత్తం 9.47 లక్షళ మంది విద్యార్థులు పరీక్షలు రాశారు.

FOLLOW US: 
Share:

తెలంగాణలో ఇంటర్ వార్షిక పరీక్షల ఫలితాలు మే 9న విడుదలయ్యాయి. విద్యాశాఖమంత్రి సబితా ఇంద్రారెడ్డి నాంపల్లిలోని ఇంటర్మీడియట్ కార్యాలయంలో ఫలితాలను విడుదల చేశారు.  ఇంటర్ ఫస్టియర్‌లో 63.85 శాతం మంది ఉత్తీర్ణులు కాగా, సెకండియర్‌లో 67.26 శాతం ఉత్తీర్ణులయ్యారు. తెలంగాణ ఇంటర్ సెకండ్‌ ఇయర్ ఫలితాల్లో 1,73,61 మందికి గ్రేడ్‌-ఎ వచ్చింది. ఇక 54,776 మంది విద్యార్థులకు గ్రేడ్‌-బి వచ్చింది. సెకండ్ ఇయర్‌లో మొత్తం 2,56,241 మంది ఉత్తీర్ణత సాధించారు. జిల్లాలవారీగా చూస్తే ఫస్టియర్ ఫలితాల్లో మేడ్చల్(75.27 %) మొదటి స్థానం, రంగారెడ్డి (72.82 %), కొమరంభీమ్ ఆసిఫాబాద్ (72.96%) మొదటి మూడుస్థానాల్లో నిలిచాయి. అదేవిధంగా సెకండియర్‌ ఫలితాల్లో ములుగు (85.08 %), కొమరంభీమ్ ఆసిఫాబాద్ (80.16 %),  మేడ్చల్(72.27 %) జిల్లాలు మొదటి మూడుస్థానాల్లో నిలిచాయి .

ఫలితాలపై సందేహాలున్న విద్యార్థుల సౌలభ్యం కోసం రీకౌంటింగ్, రీవెరిఫికేషన్‌కు అవకాశం కల్పిస్తున్నట్లు సబితా వెల్లడించారు. పరీక్షలో ఫెయిల్ అయిన విద్యార్థులకు జూన్ 4 నుంచి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలను నిర్వహించనున్నట్లు మంత్రి తెలిపారు. విద్యార్థులపై ఒత్తిడి ఉండకూడదనే ఈ సారి ఎంసెట్‌లో ఇంటర్ మార్కులకు వెయిటేజీ తొలగింపు.

ఇంటర్ ఫస్ట్ ఇయర్‌ రిజల్ట్స్‌ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇంటర్ సెకండ్ ఇయర్‌ ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఫస్ట్ ఇయర్‌లో 2,41,673 మంది బాలికలు పరీక్షలు రాస్తే... 1,65,994 మంది పాస్ అయ్యారు. 68.68l%మంది బాలికలు ఉత్తీర్ణత సాధించారు. 2,41,002 మంది అబ్బాయిలు పరీక్ష రాస్తే... 1,31,747 మంది పాస్ అయ్యారు. బాలురు 54.66% మంది ఉత్తీర్ణత సాధించారు. జిల్లాలవారీగా చూస్తే ఫస్టియర్ ఫలితాల్లో మేడ్చల్(75.27 %) మొదటి స్థానం, రంగారెడ్డి (72.82 %), కొమరంభీమ్ ఆసిఫాబాద్ (72.96%) మొదటి మూడుస్థానాల్లో నిలిచాయి. చివరిస్థానంలో మెదక్‌(38%) నారాయణ పేట్‌(41%) జయశంకర్ భూపాల్‌పల్లి(45%), వికారాబాద్‌(46%), పెదపల్లి(46%)తో నిలిచాయి. 

ఈ సంద‌ర్భంగా మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. ఇవాళ 2022-23 ఫ‌లితాల‌ను విడుద‌ల చేశాం. మార్చి 15 నుంచి ప‌రీక్ష‌లు నిర్వ‌హించాం. విద్యార్థి ద‌శ‌లో ఇంట‌ర్ అనేది కీల‌క‌మైంది. జీవితానికి ట‌ర్నింగ్ పాయింట్. మన రాష్ట్రంలో ఫ‌స్టియ‌ర్, సెకండియ‌ర్ 9,45,153 మంది హాజ‌ర‌య్యారు. 1473 కేంద్రాల్లో ప‌రీక్ష‌లు నిర్వ‌హించాం. 26 వేల మంది సేవ‌లందించారు. ప‌రీక్ష‌లు ప్ర‌శాంతంగా జ‌రిగేందుకు స‌హ‌క‌రించిన అన్ని విభాగాల వారికి ప్ర‌త్యేకంగా ధ‌న్య‌వాదాలు అని స‌బితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. ఎంసెట్ విష‌యంలో ఇంట‌ర్ వెయిటేజీని తీసేస్తున్నామ‌ని ప్ర‌క‌టించారు. పిల్ల‌లు ఎవ‌రూ కూడా ఒత్తిడికి గురి కావొద్ద‌నే ఉద్దేశంతోనే ఈ నిర్ణ‌యం తీసుకున్నామ‌ని స‌బితా ఇంద్రారెడ్డి స్ప‌ష్టం చేశారు.

జూన్ 4 నుంచి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు...
ఇంటర్ ఫలితాల్లో ఫెయిల్ అయిన విద్యార్థులకు జూన్ 4 నుంచి సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు మంత్రి సబితా తెలిపారు. ఫెయిల్ అయిన ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ విద్యార్థులు ఆందోళన చెందవద్దని ఆమె సూచించారు. ముఖ్యంగా సెకండియర్ విద్యార్థులు టెన్షన్ పడొద్దని, తల్లిదండ్రులు కూడా వారి పరిస్థితి అర్థం చేసుకోవాలని, పిల్లలపై కోపడవద్దని కోరారు. ఫలితాలపై సందేహాలున్న విద్యార్థుల సౌలభ్యం కోసం రీకౌంటింగ్, రీవెరిఫికేషన్‌కు అవకాశం కల్పిస్తున్నట్లు సబితా వెల్లడించారు. పరీక్షలో ఫెయిల్ అయిన విద్యార్థులకు జూన్ 4 నుంచి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలను నిర్వహించనున్నట్లు మంత్రి తెలిపారు. విద్యార్థులపై ఒత్తిడి ఉండకూడదనే ఈ సారి ఎంసెట్‌లో ఇంటర్ మార్కులకు వెయిటేజీ తొలగించారు. 

Published at : 09 May 2023 11:11 AM (IST) Tags: Intermediate results Telangana inter TS Inter Results ABP Desam breaking news Telangana Inter Results 2023 Telangana Inter news Inter Results Today

సంబంధిత కథనాలు

TSRTC Services: 'గ్రూప్-1' ప్రిలిమిన‌రీ ప‌రీక్షకు ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు!

TSRTC Services: 'గ్రూప్-1' ప్రిలిమిన‌రీ ప‌రీక్షకు ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు!

TS Police DV: పోలీసు అభ్యర్థులకు అలర్ట్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ తేదీలు ఖరారు! ఇవి తప్పనిసరి!

TS Police DV: పోలీసు అభ్యర్థులకు అలర్ట్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ తేదీలు ఖరారు! ఇవి తప్పనిసరి!

Apsara Murder Case Update : అప్సర హత్య వెనుక ఇన్ని కోణాలున్నాయా ? - మర్డర్ మిస్టరీలో పోలీసులు చెప్పిన సంచలన విషయాలు !

Apsara Murder Case Update :  అప్సర హత్య  వెనుక ఇన్ని కోణాలున్నాయా ? -  మర్డర్ మిస్టరీలో పోలీసులు చెప్పిన  సంచలన విషయాలు !

Saroornagar News: అప్సరకు అబార్షన్, పోలీసులతో నిందితుడు సాయిక్రిష్ణ, తల్లి వాదన మరోలా!

Saroornagar News: అప్సరకు అబార్షన్, పోలీసులతో నిందితుడు సాయిక్రిష్ణ, తల్లి వాదన మరోలా!

Group 1 Exam: 'గ్రూప్-1' ప్రిలిమ్స్ పరీక్ష వాయిదాపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు, ఏమందంటే?

Group 1 Exam: 'గ్రూప్-1' ప్రిలిమ్స్ పరీక్ష వాయిదాపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు, ఏమందంటే?

టాప్ స్టోరీస్

KCR Good News: దివ్యాంగులకు సీఎం కేసీఆర్ తీపి కబురు - వచ్చే నెల నుంచే అమలు

KCR Good News: దివ్యాంగులకు సీఎం కేసీఆర్ తీపి కబురు - వచ్చే నెల నుంచే అమలు

Varun Tej, Lavanya Engagement: తన ‘లవ్’తో వరుణ్ తేజ్ ఎంగేజ్మెంట్ - ఇవిగో ఫొటోలు

Varun Tej, Lavanya Engagement: తన ‘లవ్’తో వరుణ్ తేజ్ ఎంగేజ్మెంట్ - ఇవిగో ఫొటోలు

Schools Reopen: వేసవి సెలవులు పొడిగింపు ప్రచారం - విద్యాశాఖ ఏం చెప్పిందంటే?

Schools Reopen: వేసవి సెలవులు పొడిగింపు ప్రచారం - విద్యాశాఖ ఏం చెప్పిందంటే?

IND vs AUS, WTC Final 2023: 300కు చేరిన ఆసీస్ ఆధిక్యం - డబ్ల్యూటీసీ ఫైనల్‌పై పట్టు బిగించిన కంగారూలు

IND vs AUS, WTC Final 2023: 300కు చేరిన ఆసీస్ ఆధిక్యం - డబ్ల్యూటీసీ ఫైనల్‌పై పట్టు బిగించిన కంగారూలు