News
News
X

No Immersion: హుస్సేన్ సాగర్ లో ప్లాస్టర్ పారిస్ విగ్రహాలు నిమజ్జనం చేయొద్దు - తెలంగాణ హైకోర్టు

No Immersion: హుస్సేన్ సాగర్ తో పాటు నదుల్లో లో పీఓపీ విగ్రహాలు నిమజ్జనం చేయడానికి వీళ్లేదంట తెలంగాణ హైకోర్టు తెలిపింది. జీహెచ్ఎంసీ ఏర్పాటు చేసిన చెరువుల్లో మాత్రమే నిమజ్జనం చేయాలని సూచించింది.  

FOLLOW US: 

No Immersion: హైదరాబాద్ జంట నగరాల్లోని హుస్సేన్ సాగర్ తో పాటు నదుల్లో  ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తో తయారు చేసిన విగ్రహాలను నిమజ్జనం చేయడానికి వీళ్లేదని తెలంగాణ హైకోర్టు తెలిపింది. కేవులం చిన్న చిన్న చెరువుల్లో మాత్రమే నిమజ్జనం చేయాలని తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భుయాన్, జస్టిస్ ఎస్ నందాతో కూడిన ద్విసభ్య ధర్మాసనం గురువారం స్పష్టం చేసింది. పీఓపీ విగ్రహాలను నిషేధించడంపై ఓం ప్రకాష్ అనే వ్యక్తి రిట్ పిటిషన్ వేశారు. కళాకారుల తతఫున పిటిషన్ వేసిన ఇతను.. పీఓపీ విగ్రహాల వల్ల పర్యావరణానికి ఎలాంటి ప్రమాదం లేదని తెలిపారు. అలాగే విగ్రహాలను నిషేధిస్తే.. దానిపై ఆదారపడి బతుకున్న వేలాది మంది రోడ్డున పడతారని వివరించారు. స్పందించిన ధర్మాసనం విచారణ చేపట్టింది.

తయారీపై, విక్రయంపై నిషేధం లేదు..

ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తో విగ్రహాలను తయారు చేయడంపై కానీ, విక్రయించడం పై కానీ ఎలాంటి నేషేధం లేదని.. కేవలం విగ్రహాలను నిమజ్జనం చేసే నీటి వనరుల గురించే సమస్య ఉందని హైకోర్టు గమనించింది. అయితే కరోనా కారణంగా వినాయక నవరాత్రుల్లో పాల్గొనే భక్తులంతా కచ్చితంగా మాస్కులు ధరించేలా చూడాలంటూ కమిషనర్ కు ఆదేశాలు జారీ చేసింది అత్యున్నత న్యాయస్థానం.

ఇప్పటి వరకూ ఎలాంటి ఉత్తర్వలు జారీ చేయలేదు..

నీటి కాలుష్యం నుండి సరస్సులను రక్షించాలని కోరుతూ మామిడి వేణు మాధవ్ దాఖలు చేసిన ధిక్కార కేసులో... గతంలో సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయినప్పటికీ ఇప్పటి వరకు గణేశ విగ్రహాల నిమజ్జనానికి సంబంధించి ఎలాంటి ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేయలేదని ప్యానెల్ గతంలోనే గమనించింది. అటు వంటి విగ్రహాలను సరస్సులలో నిమజ్జనం చేయడం వల్ల పర్యావరణ క్షీణత అలాగే పర్యావరణ స్థాయి నాశనం అవుతుందని దృష్టిలో ఉంచుకున్న ప్యానెల్..  కాలుష్యానికి కారణాన్ని తగ్గించడానికి రీసైక్లింగ్ కోసం అటు వంటి ఘన వ్యర్థాలను వెంటనే సాలిడ్ డంప్ వేస్ట్ యార్డుకు పంపించాలని ప్యానెల్ జీహెచ్ఎంసీని ఆదేశించింది. తదుపరి విచారణను సెప్టెంబర్ 15వ తేదీకి వాయిదా వేసింది.

గతేడాది హైదరాబాద్ లోని హుస్సేన్ సాగర్ లో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో తయారు చేసిన విగ్రహాలను నిమజ్జనానికి సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. కానీ ఓ ఒక్క ఏడాది మాత్రమే నిమజ్జనం చేయాలని, ఇచి చివరి అవకాశమని తెలిపింది. అంతే కాకుండా విగ్రహాలను నిమజ్జనం చేసిన వెంటనే తొలగిస్తామని జీహెచ్ఎంసీ అధికారులు హామీ ఇవ్వడం వల్లే ఇందుకు ఒప్పుకుంటున్నామని సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ పేర్కొన్నారు. 

Published at : 22 Jul 2022 01:57 PM (IST) Tags: Telangana High Court No Immersion No Immersion of POP Ganesh Idols Telangana HC Comments on Immersion Plaster of Paris Idols Making

సంబంధిత కథనాలు

Karnataka Accident : కర్ణాటక బీదర్ లో ఘోర రోడ్డు ప్రమాదం, ఐదుగురు హైదరాబాద్ వాసులు మృతి

Karnataka Accident : కర్ణాటక బీదర్ లో ఘోర రోడ్డు ప్రమాదం, ఐదుగురు హైదరాబాద్ వాసులు మృతి

Governor At Home : రాజ్ భవన్ ఎట్ హోమ్ కు సీఎం కేసీఆర్ గైర్హాజరు, ఆఖరి నిమిషంలో రద్దు

Governor At Home : రాజ్ భవన్ ఎట్ హోమ్ కు సీఎం కేసీఆర్ గైర్హాజరు, ఆఖరి నిమిషంలో రద్దు

Tummmala Nageswararao : హత్యారాజకీయాలు మంచిది కాదు, కార్యకర్తలు ఆవేశపడొద్దు - తుమ్మల

Tummmala Nageswararao :  హత్యారాజకీయాలు మంచిది కాదు, కార్యకర్తలు ఆవేశపడొద్దు - తుమ్మల

Revanth Reddy : తెలంగాణను ఫిరాయింపుల ప్రయోగశాలగా మార్చేశారు- రేవంత్ రెడ్డి

Revanth Reddy : తెలంగాణను ఫిరాయింపుల ప్రయోగశాలగా మార్చేశారు- రేవంత్ రెడ్డి

బస్సే అంబులెన్స్ అయింది, అందుకే వారికి అవార్డు వచ్చింది!

బస్సే అంబులెన్స్ అయింది, అందుకే వారికి అవార్డు వచ్చింది!

టాప్ స్టోరీస్

Brahmaji: పెళ్లై, బాబు ఉన్న మహిళను ప్రేమ వివాహం చేసుకున్నా: బ్రహ్మాజీ

Brahmaji: పెళ్లై, బాబు ఉన్న మహిళను ప్రేమ వివాహం చేసుకున్నా: బ్రహ్మాజీ

ఈ విమానం రెప్పపాటులో గమ్యానికి చేరుస్తుంది, టికెట్ జస్ట్ రూ.1,645 మాత్రమే!

ఈ విమానం రెప్పపాటులో గమ్యానికి చేరుస్తుంది, టికెట్ జస్ట్ రూ.1,645 మాత్రమే!

Kuppam Gold Mines : కుప్పంలో బంగారు గనులకు ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్, రూ.450 కోట్లకు ఎన్ఎండీసీ టెండర్లు!

Kuppam Gold Mines : కుప్పంలో బంగారు గనులకు ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్, రూ.450 కోట్లకు ఎన్ఎండీసీ టెండర్లు!

Independence Day 2022: ఆట పెంచిన ప్రేమ - భారతదేశానికి స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన విదేశీ ఆటగాళ్లు!

Independence Day 2022: ఆట పెంచిన ప్రేమ - భారతదేశానికి స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన విదేశీ ఆటగాళ్లు!