Telangana News: విద్యుత్ ఉద్యోగులు, పెన్షనర్లకు డీఏ విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం
DA For Electricity Employes | తెలంగాణ విద్యుత్ ఉద్యోగులు, పెన్షనర్లకు పెంచిన డీఏను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విడుదల చేశారు. ఈ జనవరి నుంచే అమల్లోకి రానుంది.

హైదరాబాద్: విద్యుత్ ఉద్యోగులు, పెన్షనర్లకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త అందించింది. రెండు శాతం డీఏ అందిస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ప్రభుత్వం వారికి 2 శాతం డీఏ విడుదల చేసింది. విద్యుత్ రంగంలో తెలంగాణ దేశానికి దిక్సూచి కావాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆకాంక్షించారు. భవిష్యత్తు సవాళ్లను ఎదుర్కొనేందుకు సిబ్బంది సిద్ధంగా ఉండాలని సూచించారు. ప్రభుత్వం, విద్యుత్ సిబ్బంది ఒక ఆదర్శ కుటుంబంలా పనిచేస్తాయన్నారు.
విద్యుత్ ఉద్యోగులు, పెన్షనర్లకు రెండు శాతం DAతో 71,417 మంది ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రయోజనం కలగనుంది. తెలంగాణ ప్రభుత్వం పెంచిన డిఎ ఈ సంవత్సరం జనవరి నుంచి అమల్లోకి రానుందని డిప్యూటీ సీఎం, విద్యుత్ శాఖ మంత్రి భట్టి విక్రమార్క మల్లు తెలిపారు.
ప్రజా భవన్‌కు ట్రాన్స్‌కో మేనేజ్ మెంట్, సభ్యులు వెళ్లారు. డీఏ విడుదల చేశారని హర్షం వ్యక్తం చేశారు. జేఏసీ తరఫున, ట్రాన్స్ కో యాజమాన్యం, డిస్కంలకు, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు ధన్యవాదాలు తెలిపారు. సమస్యలపై తరువాత కూర్చుని మాట్లాడతాం అన్నారని జేఏసీ తెలిపింది.






















