అన్వేషించండి

Telangana News: తెలంగాణలో డ్రగ్స్‌ కంట్రోల్‌కు ప్రత్యేక సైన్యం - కీలక నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం

Telangana News: డ్రగ్స్ నియంత్రణలో ప్రభుత్వ ఉద్యోగులందర్నీ భాగస్వాములను చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అందుకే ప్రత్యేక సైన్యాన్ని ఏర్పాటు చేస్తోంది. కమిటీలు నియమించబోతోంది.

Telangana News: తెలంగాణలో డ్రగ్స్‌ నియంత్రణకు ప్రభుత్వం మరో కీలకమైన నిర్ణయం తీసుకుంది. డ్రగ్స్ నియంత్రణకు సోల్జర్స్‌ను, నియంత్రణ కమిటీలను ఏర్పాటు చేయబోతోంది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేయనుంది. ఇప్పటి వరకు డ్రగ్స్ వాడకం నగరాలకు, పట్టణాలకు మాత్రమే పరిమితం అయ్యేది. ఇప్పుడు గ్రామస్థాయికి చేరుకుంది. కొన్ని ప్రాంతాల్లో స్కూల్‌కు సమీపంలో ఉన్న దుకాణాల్లో కూడా అమ్మకాలు మొదలు పెట్టారు డ్రగ్స్ పెడ్లర్లు. 

ఇలా రోజుకో రూపంలో గంజాయి లాంటి మత్తు పదార్థాలను విక్రయించే ముఠాలను అరికట్టడం పోలీసులకు ప్రభుత్వానికి సవాల్‌గా మారింది. ఒకట్రెండు డిపార్టమెంట్లతో దీన్ని నిర్మూలించడంలో సమస్యలు ఎదురవుతున్నాయి. సమాచారం ఇవ్వాలని ప్రజలకు అవగాహన కల్పిస్తున్నా చైతన్యం అవుతున్న వాళ్లు తక్కువమందే ఉంటున్నారు. 

ప్రజల సహకారంతో ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఓవైపు పెడ్లర్లపై ఉక్కుపాదం మోపుతూనే వినియోగదారులను అరికట్టే ప్రయత్నాల్లో ప్రభుత్వం సరికొత్త విధానం తీసుకొస్తోంది. ప్రభుత్వ టీచర్లు, ప్రిన్సిపల్, రెవెన్యూ అధికారులను ఇందులో భాగస్వాములను చేయనుంది. వీరితోపాటు వైద్యులు, పారామెడికల్ స్టాఫ్‌, ఆశా వర్కర్లు, అంగన్వాడీలతో కమిటీలు ఏర్పాటు చేయనున్నారు. వీళ్లకు డ్రగ్స్ కంట్రోల్‌లో ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. 

గ్రామస్థాయిలో పోలీస్ సర్వేలెన్స్‌కు దూరంగా మాదక ద్రవ్యాలు విక్రయిస్తున్న, వినియోగిస్తున్న వారి వివరాలు సేకరించనున్నారు. వారికి కౌన్సిలింగ్ ఇవ్వడం, వాటికి దూరంగా ఉండేలా చేయనున్నారు. ఇలా దశల వారీగా వివిధ ప్రణాళికలు అమలు చేసి డ్రగ్స్‌రహిత రాష్ట్రంగా తీర్చి దిద్దాలని చూస్తున్నారు.

ఇప్పటికే తెలంగాణలో డ్రగ్స్‌పై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. పబ్బులు, ఇతర ప్రైవేటు పార్టీలపై దాడులు చేస్తోంది. అమ్మేవారిపై నిఘా పెట్టారు. కొంటున్న వారికి కౌన్సిలింగ్ ఇస్తున్నారు. విమానాశ్రయం, బస్టాండ్‌లు, రైల్వేస్టేషన్లలో తనిఖీలు విస్తృతం చేశారు. అనుమానం ఉన్న వాహనాలను తనిఖీలు చేస్తున్నారు. ఇప్పుడు ప్రభుత్వం ఉద్యోగులందరితోపాటు ప్రజలను కూడా భాగస్వాములను చేయాలని చూస్తోంది ప్రభుత్వం. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

ఏపీకి మరో గుడ్ న్యూస్ - అమరావతి రైల్వే లైన్‌కు కేంద్రం ఆమోదం
ఏపీకి మరో గుడ్ న్యూస్ - అమరావతి రైల్వే లైన్‌కు కేంద్రం ఆమోదం
Trains Cancelled: తీవ్ర తుపానుగా 'దానా' - 2 రోజులు ఈ రైళ్లు రద్దు, పూర్తి వివరాలివే!
తీవ్ర తుపానుగా 'దానా' - 2 రోజులు ఈ రైళ్లు రద్దు, పూర్తి వివరాలివే!
Nara Lokesh and MohanDas Pai : బెంగళూరు నుంచి ఏపీకి రావాలని లోకేష్ పిలుపు - ఇంకా గ్రౌైండ్ వర్క్ చేయాలన్న పారిశ్రామికవేత్త
బెంగళూరు నుంచి ఏపీకి రావాలని లోకేష్ పిలుపు - ఇంకా గ్రౌైండ్ వర్క్ చేయాలన్న పారిశ్రామికవేత్త
Andhra Pradesh BJP : ఏపీలో కిషన్ రెడ్డి పర్యటన - పార్టీ నేతలతో మంతనాలు - ఏపీ బీజేపీలో మార్పులుంటాయా ?
ఏపీలో కిషన్ రెడ్డి పర్యటన - పార్టీ నేతలతో మంతనాలు - ఏపీ బీజేపీలో మార్పులుంటాయా ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఏబీపీ నెట్‌వర్క్ నేతృత్వంలో సదరన్ రైజింగ్ సమ్మిట్, గ్రాండ్‌గా ఈవెంట్‌లెబనాన్‌పై ఇజ్రాయేల్ భీకర దాడులు, నేలమట్టమైన నగరంఐదేళ్ల తరవాత మోదీ జిన్‌పింగ్ భేటీ, ఎవరు ఏం మాట్లాడారంటే?హెజ్బుల్లా కీలక నేతని మట్టుబెట్టిన ఇజ్రాయేల్ సైన్యం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ఏపీకి మరో గుడ్ న్యూస్ - అమరావతి రైల్వే లైన్‌కు కేంద్రం ఆమోదం
ఏపీకి మరో గుడ్ న్యూస్ - అమరావతి రైల్వే లైన్‌కు కేంద్రం ఆమోదం
Trains Cancelled: తీవ్ర తుపానుగా 'దానా' - 2 రోజులు ఈ రైళ్లు రద్దు, పూర్తి వివరాలివే!
తీవ్ర తుపానుగా 'దానా' - 2 రోజులు ఈ రైళ్లు రద్దు, పూర్తి వివరాలివే!
Nara Lokesh and MohanDas Pai : బెంగళూరు నుంచి ఏపీకి రావాలని లోకేష్ పిలుపు - ఇంకా గ్రౌైండ్ వర్క్ చేయాలన్న పారిశ్రామికవేత్త
బెంగళూరు నుంచి ఏపీకి రావాలని లోకేష్ పిలుపు - ఇంకా గ్రౌైండ్ వర్క్ చేయాలన్న పారిశ్రామికవేత్త
Andhra Pradesh BJP : ఏపీలో కిషన్ రెడ్డి పర్యటన - పార్టీ నేతలతో మంతనాలు - ఏపీ బీజేపీలో మార్పులుంటాయా ?
ఏపీలో కిషన్ రెడ్డి పర్యటన - పార్టీ నేతలతో మంతనాలు - ఏపీ బీజేపీలో మార్పులుంటాయా ?
YS Jagan: ఘర్‌ ఘర్‌ కా ఖహానీ - షర్మిలతో ఆస్తి తగాదాలపై స్పందించిన జగన్
ఘర్‌ ఘర్‌ కా ఖహానీ - షర్మిలతో ఆస్తి తగాదాలపై స్పందించిన జగన్
Pushpa 2 : 'పుష్ప 2'లో శ్రద్ధా స్పెషల్ సాంగ్... ఒక్క పాట కోసం ఈ బాలీవుడ్ బ్యూటీకి మైండ్ బ్లోయింగ్ రెమ్యూనరేషన్
'పుష్ప 2'లో శ్రద్ధా స్పెషల్ సాంగ్... ఒక్క పాట కోసం ఈ బాలీవుడ్ బ్యూటీకి మైండ్ బ్లోయింగ్ రెమ్యూనరేషన్
Telangana News: తెలంగాణలో పేలనున్న పొలిటికల్ బాంబ్‌- తప్పించుకోలేరని మంత్రి పొంగులేటి వార్నింగ్
తెలంగాణలో పేలనున్న పొలిటికల్ బాంబ్‌- తప్పించుకోలేరని మంత్రి పొంగులేటి వార్నింగ్
Game Changer: తెలుగు రాష్ట్రాల్లో ‘గేమ్ ఛేంజర్’ జోరు - వామ్మో థియేట్రికల్ బిజినెస్ అన్ని కోట్లా?
తెలుగు రాష్ట్రాల్లో ‘గేమ్ ఛేంజర్’ జోరు - వామ్మో థియేట్రికల్ బిజినెస్ అన్ని కోట్లా?
Embed widget