అన్వేషించండి

HYDRA: రూటు మార్చిన హైడ్రా- అక్రమ కట్టడాల కూల్చివేతలపై సరికొత్త ప్లాన్ ఇదే!

Revanth Reddy: అక్రమ కట్టడాల విషయంలో ఒక అడుగు వెనక్కి తగ్గాలని ప్రభుత్వం భావిస్తోంది. దూకుడుగా వెళ్లడం కంటే ప్రజలను ఒప్పించి టార్గెట్‌ రీచ్ అవ్వాలని ఆలోచిస్తోంది.

Hyderabad: హైడ్రా.. ఈ మధ్య కాలంలో ఇంతలా వినిపించిన పేరు మరొకటి లేదు. తెలుగు రాష్ట్రాల్లో ప్రతి చోట వినిపిస్తున్న పేరు ఇది. చెరువులు, కుంటలు ఆక్రమించి కట్టుకున్న నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతున్న హైడ్రాపై భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. అధికార పార్టీలోనే చాలా మంది ఎమ్మెల్యేలు దీన్ని వ్యతిరేకిస్తున్నారు. ప్రతిపక్షం సరే సరే. ఏకంగా హైడ్రా బాధితుల పేరిట ఓ ఉద్యమాన్నే సిద్దం చేసింది బీఆర్‌ఎస్. ఆ బాటలోనే పయణిస్తోంది బీజేపీ కూడా. 

ఇప్పటి వరకు హైడ్రా తీసుకుంటున్న చర్యలు సమర్ధిస్తూ వస్తున్నప్పటికీ ఈ మధ్య కాలంలో మాత్రం తీవ్ర దుమారం రేపుతున్నాయి. కాయ కష్టం చేసి కట్టుకున్న ఇళ్లను నిట్టనిలువునా కూల్చేస్తుంటే కొందుర పేదలు రోడ్డున పడుతున్నారు. అధికారులు అన్ని అనుమతులు ఇచ్చిన ఇళ్లపై కూడా హైడ్రా బుల్డోజర్లు చేయి వేస్తుంటే తట్టుకోలేకపోతున్నారు. అందుకే కూల్చివేతల టైంలో హైడ్రామాలు చూస్తున్నాం. 

ఈ హైడ్రా చర్యలకు తోడు ఈ మధ్య మూసి నిర్వాసితులు కూడా చేరారు. మూసీ ప్రక్షాళన కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై కూడా విమర్శలు వెల్లువెత్తున్నాయి. మూసీ నదిలో అక్రమంగా నిర్మించిన కట్టడాలను గుర్తించి రెడ్ మార్క్ వేస్తున్నారు అధికారులు. దీన్ని చాలా మంది వ్యతిరేకిస్తున్నారు. ఇలా ఓవైపు హైడ్రా, రెండో వైపు మూసీ ప్రక్షాళన పేరుతో ప్రజలను రోడ్డున పడేస్తోందీ ప్రభుత్వం అని ప్రతిపక్షాలు ఉద్యమ బాట పట్టాయి. బీఆర్‌ఎస్, బీజేపీ పోటాపోటీన ప్రభుత్వంపై దుమ్మెత్తి పోస్తున్నాయి. 

ఇప్పటి వరకు సాఫీగా సాగిన ఈ యజ్ఞంలో ఇప్పుడు సమస్యలు వచ్చి పడుతున్నాయి. ఇన్నాళ్లూ సైలెంట్‌గా ఉన్న అధికార పార్టీ వాళ్లు కూడా స్వరాలు సవరించుకుంటున్నారు. అన్నింటినీ గమనించిన ప్రభుత్వం సరికొత్త వ్యూహాన్ని సిద్ధం చేసింది. హైడ్రా విషయంలో ప్లాన్ మార్చినట్టు తెలుస్తోంది. మరోవైపు మూసీ ప్రక్షాళన విషయంలో కూడా పునరాలోచనలో పడ్డట్టు చెబుతున్నారు. 

పెద్దలను వదిలేసి పేదల కట్టడాలనే కూలుస్తుందనే అపవాదును మూటగట్టుకుంటున్న హైడ్రా ఇకపై పెద్దలపై ఫోకస్ పెట్టింది. చెరువులు ఆక్రమించి, బఫర్‌ జోన్‌లో, ఎఫ్‌టీఎల్‌లో నిర్మించిన బడా బాబుల నిర్మాణాలపైకి బుల్డోజర్లు వెళ్లనున్నాయి. అలాంటి వారి కట్టడాలపై చర్యలు తీసుకున్న తర్వాత మిగతా వాటి గురించి ఆలోచిస్తామని హైడ్రా అధికారులు చెబుతున్నారు. మొదట్లో ఇలాంటి కట్టడాలను కూల్చేసి అందరి దృష్టిలో పడ్డ హైడ్రా తర్వాత వాటి సంగతి మర్చిపోయిందనే విమర్శ ఉంది. అందుకే ఆలాంటి విమర్శలు, ఆరోపణలకు చెక్ పెట్టేందుకు పెద్ద తలకాయల కట్టాడలపై ఫోకస్ పెట్టిందట. 

మరోవైపు ఆపరేషన్ మూసీ విషయంలో కూడా ఆచితూచి ముందడుగు వేయాలని ప్రభుత్వం భావిస్తోంది. మూసీ చుట్టు ఉన్న బడా బాబుల నిర్మాణాల పని పట్టనుంది. ఆ తర్వాత మిగతా ప్రజల కట్టడాల జోలికి వెళ్లనుంది. వారితో మాట్లాడి ఒప్పించి కూల్చేందుకు కార్యచరణ సిద్ధం చేసింది. మూసీ నిర్వాసితులకు ఇచ్చే ప్యాకేజీ, ఇతర సదుపాయాలపై విస్తృత ప్రచారం కల్పించిన తర్వాత ముందుకెళ్లాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. 

Also Read: హైడ్రా పరిధి అంతవరకే, ఆ కూల్చివేతలతో మాకు ఏ సంబంధం లేదు: రంగనాథ్

టాప్ హెడ్ లైన్స్

మైనర్ కొడుకును కిల్లర్‌గా మార్చిన తల్లి.. సిద్ధిపేటలో దారుణం - క్రైమ్ థ్రిల్లర్ సినిమాను మించేలా
మైనర్ కొడుకును కిల్లర్‌గా మార్చిన తల్లి.. సిద్ధిపేటలో దారుణం - క్రైమ్ థ్రిల్లర్ సినిమాను మించేలా
Sanathnagar MCRTIMS: సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
Indiramma Housing Scheme: ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల గడువు పూర్తి.. లబ్ధిదారుల ఎంపిక ఎప్పుడంటే
ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల గడువు పూర్తి.. లబ్ధిదారుల ఎంపిక ఎప్పుడంటే

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Galle Rain Threat: టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
Sanathnagar MCRTIMS: సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
The Red Bag: పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ చేతికి 'రెడ్ బ్యాగ్'... ప్రసాద్ బెహరా సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ చేతికి 'రెడ్ బ్యాగ్'... ప్రసాద్ బెహరా సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
APPSC Group 1 Scam: గ్రూప్-1 అక్రమాలపై సిట్ ఉచ్చు.. విచారణ ఐఏఎస్, ఐపీఎస్‌లతో ఆగుతుందా.. రాజకీయ పెద్దల వద్దకూ వెళ్తుందా?
గ్రూప్-1 అక్రమాలపై సిట్ ఉచ్చు.. విచారణ ఐఏఎస్, ఐపీఎస్‌లతో ఆగుతుందా.. రాజకీయ పెద్దల వద్దకూ వెళ్తుందా?
Bhogapuram Airport: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు ప్రారంభం! హైదరాబాద్‌ నుంచి తొలి విమానం రాక! ముగిసిన విశాఖ ఎయిర్‌పోర్ట్ సేవలకు భావోద్వేగ వీడ్కోలు!  
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు ప్రారంభం! హైదరాబాద్‌ నుంచి తొలి విమానం రాక! ముగిసిన విశాఖ ఎయిర్‌పోర్ట్ సేవలకు భావోద్వేగ వీడ్కోలు!  
Addanki Ganja News: అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
Gavaskar Comments : జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
Visakhapatnam to Bhogapuram Airport Buses: విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
Embed widget