అన్వేషించండి

Ganesh Nimajjanam : వినాయక నిమజ్జనంలో బోల్తాపడ్డ రేవంత్ సర్కార్-కోర్టుకు చిక్కినట్లేనా..?

Nimajjanam In Hyderabad : హైదరాబాద్‌లో హుస్సేన్ సాగర్ నిమజ్జనాలు లేవంటూ ఫ్లెక్సీలు పెట్టిన రేవంత్ రెడ్డి సర్కారు.. గణేష్ ఉత్సవ సమితి ఆగ్రహంతో వెనక్కి తగ్గింది. సరే ఇప్పుడు కోర్టుకు ఏం చెప్పబోతోంది.?

Revanth Reddy: హైదరాబాద్ హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనం ఏర్పాట్ల విషయంలో రెేంత్ రెడ్డి సర్కారు వ్యూహం లెక్క తప్పింది అనే విమర్శలు వినిపిస్తున్నాయి. భక్తుల ఆగ్రహం నుంచి బయటపడేందుకు కోర్టుకు అడ్డంగా దొరికిపోయారా అనే అనుమానాలు బలపడుతున్నాయి. ఏటా హుస్సేస్ సాగర్‌లో వేలాది విగ్రహాలు నిమజ్జనం చేస్తుంటారు. అయితే తొలిసారి నిమజ్జ ప్రక్రియను చేపట్టిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం తడబాటుకు గురైందని అంటున్నారు విమర్శకులు.

ప్రతీ ఏటా నిమజ్జనం టైంలో ఈ ఘర్షణ పూరిత వాతావరణం కనిపిస్తూనే ఉంది. కోర్టుల నిబంధనలు చెప్పి నిజ్జనానికి అడ్డుపుల్లలు వేయడం, తర్వాత మళ్లీ పూజా కమిటీల ఆగ్రహంతో గేట్లు తెరవడం కామన్‌గా మారిపోతోంది. ఈసారి గత ప్రభుత్వ తీరుకు భిన్నంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వ్యవహరించింది. హైకోర్టు తీర్పుకు ముందు రోజు ట్యాంక్ బండ్‌పై విగ్రహాల నిమజ్జనం నిషేధం అంటూ బ్యానర్లు పెట్టి, సాగర్ చుట్టూ ఇనుప కంచె, భారీ కేడ్లు ఏర్పాటు చేశారు. 2021లొ ఇచ్చిన తీర్పు కొనసాగుతుందని కోర్టు చెబుతూ నిమజ్జనం అడ్డుకోవాలనే పిటిషన్ కొట్టివేసింది. 

Also Read: గణేష్ నిమజ్జనంలో పాల్గొనేవారు తీసుకోవాల్సిన జాగ్రత్తలివి!

అలా అని తీర్పు పిఓపి విగ్రహాలను కూడా నిమజ్జనం చేసి సాగర్‌ను కలుషితం చేయమని కాదు. సాగర‌ను కలుషితం  కాకుండా చర్యలు తీసుకోవాలని, మట్టి విగ్రహాలు మాత్రమే నిమజ్జనం చేయాలని గతంలో ఇచ్చిన ఆదేశాలకు కొనసాగింపు అన్నమాట. 

నిమజ్జనాకిి కొద్ది గంటలముందు గణేష్ ఉత్సవ సమితి సభ్యులు ఆగ్రహంతో బారికేడ్లు  తొలిగించడం, ప్లెక్సీలు పీకేయ్యడంతో నిమజ్జనానికి లైన్ క్లియర్ అయ్యింది సరే.. కానీ ఇక్కడే అసలు సమస్య మొదలైయ్యింది. ఈరోజు వేలాదిగా విగ్రహాలు ట్యాంక్ బండ్ వద్ద నిమజ్జనం చేస్తున్నారు. హుస్సేన్ సాగర్‌లో హైదరాబాద్ నలుమూలల నుంచి వచ్చే విగ్రహాలు భారీగానే ఉంటున్నాయి. అందులో పిఓపి విగ్రహాలు ఎక్కువశాతం ఉంటే కొంత వరకూ మట్టి విగ్రహాలు కూడా ఉంటాయి. 

పిఓపి విగ్రహాల వల్ల సాగర్ కలుషితం అవుతుంది అనే విమర్శల నేపధ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు పిఓపి విగ్రహాలకు ప్రత్యేకంగా నిమజ్జన పాండ్‌లు ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. కానీ ఈరోజు విగ్రహాల సంఖ్యకు సరిపడా పాండ్‌లు  ఏర్పాటు చేశారా అంటే అంతంతమాత్రమే అది కూడా అరకొరగ ఏర్పాటు చేసిన చిన్న పాండ్‌లు విగ్రహాల సంఖ్యకు ఏమాత్రం సరిపోవు. మరి పిఓపి విగ్రహాలు కూడా సాగర్‌లో నిమజ్జనం తప్పదు. హుస్సేన్ సాగర్ కు ప్రత్యాన్మయ ఏర్పాట్లు సాధ్యం కాని పరిస్దితి.

సరేే నిమజ్జనం వైభవంగా జరిగిపోతుంది. అడ్డుకుంటే భక్తుల వ్యతిరేకతను ప్రభుత్వం తట్టుకోలేదు కాబట్టి చూసి చూడనట్లుగా పోతుంది.కానీ ఇదే ఆరోపణలు కోర్టు  దృష్టికి వెళితే కచ్చితంగా కోర్టుకు సమాధానం చెప్పక తప్పదు. సాగర్ రక్షణకు చేపట్టిన ప్రత్యామ్నాయ ఏర్పాట్ల లెక్కలు చూపక తప్పదు. సాగర్ నిమజ్జనాలు, పిఓపి విగ్రహాల ప్రభావం వీడియో ఆధారాలతో సహా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే కొత్త చిక్కులు తెచ్చుకున్నట్లే.

గణపతి నిమజ్జనం భారీ వేడుకలు..ఈ విషయం ప్రభుత్వ పెద్దలకు ,అధికారులకు  తెలుసుకు కానీ, ఏళ్లు గడుస్తున్నా యథారాజా తథా ప్రజా అన్నట్లుగా కళ్ల ముందు సాగర్ కలుషితమవుతుందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నా. అధికారులు చూస్తున్నా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఆశించన స్దాయిలో చేయకపోవడం ప్రతీ ఏటా రిపీట్ అవుతోంది. ఈసారి కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం గట్టగా ట్రైచేసి నిండా మునిగిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. 

Also Read: బాలాపూర్‌ లడ్డూ వేలంలో కొత్త రూల్‌- ఆ డబ్బు డిపాజిట్ చేస్తేనే పాటలో పాల్గొనే ఛాన్స్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Hyderabad IAF Airshow: ఆదివారం భారీ ఎయిర్ షో, హైదరాబాద్‌లో ఆ ఏరియాలో ట్రాఫిక్ ఆంక్షలు
ఆదివారం భారీ ఎయిర్ షో, హైదరాబాద్‌లో ఆ ఏరియాలో ట్రాఫిక్ ఆంక్షలు
CM Chandrababu: సీఎం చంద్రబాబు వర్సెస్ మంత్రి లోకేశ్ - టగ్ ఆఫ్ వార్‌లో ఎవరు గెలిచారంటే?
సీఎం చంద్రబాబు వర్సెస్ మంత్రి లోకేశ్ - టగ్ ఆఫ్ వార్‌లో ఎవరు గెలిచారంటే?
Sukumar: నా మనసు వికలమైంది... రేవతి ప్రాణాన్ని తీసుకురాలేను... మహిళ మృతిపై సుకుమార్ ఎమోషనల్ మూమెంట్
నా మనసు వికలమైంది... రేవతి ప్రాణాన్ని తీసుకురాలేను... మహిళ మృతిపై సుకుమార్ ఎమోషనల్ మూమెంట్
OnePlus Ace 5 Mini: వన్‌ప్లస్ కాంపాక్ట్ ఫోన్ లాంచ్ త్వరలో - చిన్న సైజులో, క్యూట్ డిజైన్‌తో!
వన్‌ప్లస్ కాంపాక్ట్ ఫోన్ లాంచ్ త్వరలో - చిన్న సైజులో, క్యూట్ డిజైన్‌తో!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అడిలైడ్ టెస్ట్‌లో ఓటమి దిశగా భారత్బాత్‌రూమ్‌లో యాసిడ్ పడి విద్యార్థులకు అస్వస్థతఏపీలో వాట్సప్ గవర్నెన్స్, ఏందుకో చెప్పిన చంద్రబాబుమళ్లీ కెలుక్కున్న వేణుస్వామి, అల్లు అర్జున్ జాతకం కూడా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad IAF Airshow: ఆదివారం భారీ ఎయిర్ షో, హైదరాబాద్‌లో ఆ ఏరియాలో ట్రాఫిక్ ఆంక్షలు
ఆదివారం భారీ ఎయిర్ షో, హైదరాబాద్‌లో ఆ ఏరియాలో ట్రాఫిక్ ఆంక్షలు
CM Chandrababu: సీఎం చంద్రబాబు వర్సెస్ మంత్రి లోకేశ్ - టగ్ ఆఫ్ వార్‌లో ఎవరు గెలిచారంటే?
సీఎం చంద్రబాబు వర్సెస్ మంత్రి లోకేశ్ - టగ్ ఆఫ్ వార్‌లో ఎవరు గెలిచారంటే?
Sukumar: నా మనసు వికలమైంది... రేవతి ప్రాణాన్ని తీసుకురాలేను... మహిళ మృతిపై సుకుమార్ ఎమోషనల్ మూమెంట్
నా మనసు వికలమైంది... రేవతి ప్రాణాన్ని తీసుకురాలేను... మహిళ మృతిపై సుకుమార్ ఎమోషనల్ మూమెంట్
OnePlus Ace 5 Mini: వన్‌ప్లస్ కాంపాక్ట్ ఫోన్ లాంచ్ త్వరలో - చిన్న సైజులో, క్యూట్ డిజైన్‌తో!
వన్‌ప్లస్ కాంపాక్ట్ ఫోన్ లాంచ్ త్వరలో - చిన్న సైజులో, క్యూట్ డిజైన్‌తో!
Rishabh Pant: డబ్బు కోసమే మమ్మల్ని కాదనుకున్నాడు, రిషభ్ పంత్ పై ఢిల్లీ కోచ్ సంచలన ఆరోపణలు
డబ్బు కోసమే మమ్మల్ని కాదనుకున్నాడు, రిషభ్ పంత్ పై ఢిల్లీ కోచ్ సంచలన ఆరోపణలు
Toyota Innova Hycross: ఇన్నోవా హైక్రాస్ ధరను పెంచిన టయోటా - ఇప్పుడు రేటెంత?
ఇన్నోవా హైక్రాస్ ధరను పెంచిన టయోటా - ఇప్పుడు రేటెంత?
Telangana News: మూసీ, హైడ్రాలపై కాంగ్రెస్ వాళ్లకు అవగాహన లేదు, BRSను ఎదుర్కోలేకపోతున్నాం: ABP దేశంతో ఫిరోజ్ ఖాన్
మూసీ, హైడ్రాలపై కాంగ్రెస్ వాళ్లకు అవగాహన లేదు, BRSను ఎదుర్కోలేకపోతున్నాం: ABP దేశంతో ఫిరోజ్ ఖాన్
Pawan Kalyan: 'సినీ నటుడిగా చెబుతున్నా, మీ టీచర్లే మీ హీరోలు' - విద్యార్థులతో కలిసి భోజనం చేసిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
'సినీ నటుడిగా చెబుతున్నా, మీ టీచర్లే మీ హీరోలు' - విద్యార్థులతో కలిసి భోజనం చేసిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
Embed widget