అన్వేషించండి

Hyderabad: మాజీ హోంగార్డు హత్య కేసును ఛేదించిన పోలీసులు, 8 మంది అరెస్టు

Hyderabad: మాజీ హోంగార్డు మహ్మద్ రిజ్వాన్ హత్య కేసును పోలీసులు ఛేదించారు.

Hyderabad: హైదరాబాద్ లో సంచలనం సృష్టించిన మాజీ హోంగార్డు మహ్మద్ రిజ్వాన్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసును సీరియస్ గా తీసుకున్న పోలీసులు.. పలు బృందాలుగా ఏర్పడి దర్యాప్తు చేపట్టారు. రిజ్వాన్ ను చంపిన హంతకుల కోసం సెర్చ్ ఆపరేషన్ నిర్వహించిన సౌత్ & ఈస్ట్ జోన్ పోలీసులు నిందితులను పట్టుకున్నారు. మాజీ హోంగార్డు మహ్మద్ రిజ్వాన్ హత్య కేసుకు సంబంధించిన వివరాలను గురువారం రోజు సౌత్ & ఈస్ట్ జోన్ డీసీపీ రమేష్ వెల్లడించారు.

మహ్మద్ రిజ్వాన్ హత్య కేసులో 8 మందిని అరెస్టు చేసినట్లు డీసీపీ రమేష్ తెలిపారు. కాజ, సలీం, నయీం, హరిప్రసాద్, ఫరీద్, షాహిద్, గులాం, అబ్దుల్ లను పోలీసులు అరెస్టు చేశారు. ఎనిమిది మంది నిందితుల నుంచి 3 వాహనాలు, 8 సెల్‌ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ నెల 11వ తేదీన కాజా నయీం, సలీంలు మాజీ హోంగార్డు మహ్మద్ రిజ్వాన్ ను కిడ్నాప్ చేశారు. అయితే గతంలో హోంగార్డు మహ్మద్ రిజ్వాన్.. కాజా నయీం, ఫహద్ అనే ఫైనాన్షియర్ల వద్ద కొంత మొత్తంలో అప్పు తీసుకున్నాడు. దానిపై కాజా, ఫహద్ లు వడ్డీ, చక్రవడ్డీ వేయడంతో భారీగా పెరిగిపోయింది. మొత్తంగా 33 లక్షల రూపాయలు కట్టాలని వారు మహ్మద్ రిజ్వాన్ ను ఒత్తిడికి గురిచేశారు. అయినప్పటికీ రిజ్వాన్ చెల్లించకపోవడంతో.. కాజా, సలీం రౌడీ షీటర్లు కాజా ఫరీద్ చోర్, హరిప్రసాద్ లు మాజీ హోంగార్డు రిజ్వాన్ ను కిడ్నాప్ చేసి చిత్ర హింసలు పెట్టారు. ఈ నెల 11 నుంచి 13 తేదీ వరకు నాంపల్లిలోని ఓ బిల్డింగ్ సెల్లార్ లో మహ్మద్ రిజ్వాన్ ను నిందితులు కొట్టి చిత్ర హింసలు పెట్టారు.

ఈ నెల 13వ తేదీన మహ్మద్ రిజ్వాన్ తల్లిదండ్రులకు ఫోన్ చేసి డబ్బులు డిమాండ్ చేశారు. దీంతో రిజ్వాన్ తండ్రి కిడ్నాపర్లకు 2 లక్షల రూపాయలు ఆన్‌లైన్‌ లో పంపించారు. దీంతో రిజ్వాన్ ను కిడ్నాపర్లు వదిలేశారు. అప్పటికే తీవ్రగాయాలతో ఉన్న రిజ్వాన్ ను తండ్రి ఉస్మానియా ఆస్పత్రిలో చేర్చారు. మహ్మద్ రిజ్వాన్ ను కిడ్నాప్ చేసి, చిత్రహింసలు పెట్టినప్పటికీ.. ఆయన తండ్రి పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు చేయలేదు. అయితే ఉస్మానియా ఆస్పత్రి నుంచి మెడికో లీగల్ రిఫర్ కేసు పోలీసుల వద్దకు వచ్చింది. దీంతో పోలీసులు ఆస్పత్రికి వెళ్లి రిజ్వాన్ తండ్రి నుంచి స్టేట్ మెంట్ తీసుకున్నారు. 8 మందిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఆ మేరకు దర్యాప్తు మొదలుపెట్టారు.

కిడ్నాప్ కేసును విచారిస్తుండగానే ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మాజీ హోంగార్డు మహ్మద్ రిజ్వాన్ మృతి చెందాడు. దీంతో పోలీసులు నిందితులపై ఐపీసీ సెక్షన్ 348, 302, 364, 386, 506, రేడ్ విత్ 34 కింద కేసులు నమోదు చేశారు. నిందితుల కోసం సెర్చ్ ఆపరేషన్ నిర్వహించిన పోలీసులు కాజా, సలీం, నయీం, హరిప్రసాద్, ఫరీద్, షాహిద్, గులాం, అబ్దుల్ ను అరెస్టు చేశారు. కాగా.. కాజా ఫరీద్ చోర్ అనే రౌడీ షీటర్ పై మొత్తం 18 క్రిమినల్ కేసులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ప్రజలను ఎవరైనా వేధింపులకు గురి చేస్తే సహించేది లేదని, నిర్భయంగా పోలీసులను ఆశ్రయిస్తే తగు చర్యలు తీసుకుంటామని డీసీపీ రమేష్ పేర్కొన్నారు.

టాప్ హెడ్ లైన్స్

Breaking News: హైదరాబాద్‌లోని పంజాగుట్ట శ్మశానవాటిలో శిశువు మృతదేహం మాయం
హైదరాబాద్‌లోని పంజాగుట్ట శ్మశానవాటిలో శిశువు మృతదేహం మాయం
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా నుంచి భారీగా ఓట్లు గల్లంతు! టాప్‌లో హైదరాబాద్! పేరు లేకపోతే ఏం చేయాలి?
తెలంగాణ ఓటర్ల జాబితా నుంచి భారీగా ఓట్లు గల్లంతు! టాప్‌లో హైదరాబాద్! పేరు లేకపోతే ఏం చేయాలి?
Hyderabad News: యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
Hyderabad Road Accident: నిన్న రాజమండ్రిలో వైద్య విద్యార్థి! నేడు హైదరాబాద్‌లో రిటైర్డ్ జవాన్‌! ప్రాణాలు తీస్తున్న మద్యం మత్తు!
నిన్న రాజమండ్రిలో వైద్య విద్యార్థి! నేడు హైదరాబాద్‌లో రిటైర్డ్ జవాన్‌! ప్రాణాలు తీస్తున్న మద్యం మత్తు!

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా నుంచి భారీగా ఓట్లు గల్లంతు! టాప్‌లో హైదరాబాద్! పేరు లేకపోతే ఏం చేయాలి?
తెలంగాణ ఓటర్ల జాబితా నుంచి భారీగా ఓట్లు గల్లంతు! టాప్‌లో హైదరాబాద్! పేరు లేకపోతే ఏం చేయాలి?
Prakash Raj: బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
పులిహోర అనే పదం ఎలా వచ్చింది? చరిత్ర, ఆరోగ్యం, ఆధ్యాత్మికత కలసిన దివ్య ప్రసాదం గురించి ఈ విషయాలు తెలుసా?
పులిహోర అనే పదం ఎలా వచ్చింది? చరిత్ర, ఆరోగ్యం, ఆధ్యాత్మికత కలసిన దివ్య ప్రసాదం గురించి ఈ విషయాలు తెలుసా?
17 కేజీల బరువు తగ్గితే.. రెండేళ్ల తర్వాత మళ్లీ ఛాన్స్
17 కేజీల బరువు తగ్గితే.. రెండేళ్ల తర్వాత మళ్లీ ఛాన్స్
Toxic: టాక్సిక్ ఐమ్యాక్స్ రిలీజ్... కన్నడ హీరోల్లో యశ్ రేర్ రికార్డు
టాక్సిక్ ఐమ్యాక్స్ రిలీజ్... కన్నడ హీరోల్లో యశ్ రేర్ రికార్డు
వరుస గాయాలపై BCCI ఫైర్ లక్ష్మణ్ సీక్రెట్ మీటింగ్
వరుస గాయాలపై BCCI ఫైర్ లక్ష్మణ్ సీక్రెట్ మీటింగ్
Kiran Abbavaram: అబ్బవరం ఫ్యామిలీ టూర్... కొడుకు, భార్యతో కిరణ్ ఫోటోలు
అబ్బవరం ఫ్యామిలీ టూర్... కొడుకు, భార్యతో కిరణ్ ఫోటోలు
Rahul Sipligunj: విశాఖలో రాహుల్ సిప్లిగంజ్‌పై ఎఫ్‌ఐఆర్... బావమరిది కోసం యువతిని బెదిరించాడా?
విశాఖలో రాహుల్ సిప్లిగంజ్‌పై ఎఫ్‌ఐఆర్... బావమరిది కోసం యువతిని బెదిరించాడా?
Embed widget