Telangana Congress: విద్యుత్ సౌధ ముట్టడించిన కాంగ్రెస్ నేతలు- సుమారు రెండు గంటలపాటు హైడ్రామా
Vidyuth Soudha Blockade: హౌస్ అరెస్టును ఛేదించుకొని విద్యుత్ సౌధ వద్దకు చేరుకున్నారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. ఆయనతోపాటు కాంగ్రెస్ నేతలు చాలా మంది అక్కడుకు చేరుకున్నారు.
కాంగ్రెస్ చేపట్టిన విద్యుత్ సౌధ ముట్టడి తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. హౌస్ అరెస్టును ఛేదించుకొని విద్యుత్ సౌధ వద్దకు చేరుకున్నారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. ఆయనతోపాటు కాంగ్రెస్ నేతలు చాలా మంది అక్కడుకు చేరుకున్నారు. భారీగా శ్రేణులు కూడా వారితో ఉన్నారు.
విద్యుత్ సౌధ వద్ద కాంగ్రెస్ నేతల ధర్నాతో ఆప్రాంతంలో భారీగా ట్రాపిక్ జామ్ అయింది. పోలీసులు ముందస్తుగానే మోహరించి విద్యుత్ సౌధ లోపలికి ఎవర్నీ రానీయకుండా జాగ్రత్త పడ్డారు. గేట్లు వేసేసి బారికేడ్లు ఏర్పాటు చేశారు. రోడ్డుపైనే కాంగ్రెస్ నేతలు ధర్నా చేస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గేట్లు తీయాలని.. వినతి పత్రం ఇచ్చి వెళ్తామని ఎంత చెప్పినా అధికారులు గేట్లు తీయలేదు.
We will fight a battle everyday for the betterment of people of Telangana….#FuelPriceHike#PaddyProcurement pic.twitter.com/JDnp4FBOdR
— Revanth Reddy (@revanth_anumula) April 7, 2022
పరిస్థితి చేయి దాటిపోతుందని గ్రహించిన పోలీసులు కొందరి నేతలనే లోపలికి అనుమతించారు. పది మందిని విద్యుత్ సౌధరలోకి వెళ్లనిచ్చారు. అలా విద్యుత్ సౌధ లోపలికి వెళ్లిన వారిలో రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క శ్రీధర్‌బాబు, మధుయాష్కీ ఉన్నారు. పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని విద్యుత్ అధికారులతో కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు.
పేదలు,మధ్య తరగతిని దోచుకోవడంలో మోడీ - కేడీ అవిభక్త కవలలు… వారిద్దరి నుండి దేశ ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు విముక్తి కల్పించడమే కాంగ్రెస్ లక్ష్యం.#FuelPriceHike#PaddyProcurement
— Revanth Reddy (@revanth_anumula) April 7, 2022
పెంచిన విద్యుత్ చార్జీలను నిరసనగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారి పిలుపు మేరకు ఫిషర్మెన్ కాంగ్రెస్ చైర్మన్ @Mettusaikumar ఆధ్వర్యంలో విద్యుత్ సౌదా ను ముట్టడించి, నిరసన తెలుపడం జరిగింది. pic.twitter.com/vFT9qMwnuI
— Telangana Congress (@INCTelangana) April 7, 2022
We will fight a battle everyday for the betterment of people of Telangana….#FuelPriceHike#PaddyProcurement pic.twitter.com/JDnp4FBOdR
— Revanth Reddy (@revanth_anumula) April 7, 2022