సాయంత్ర 4 గంటలకు ప్రధాని మోడీతో రేవంత్ రెడ్డి సమావేశం
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ ఢిల్లీ వెళ్తున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో సాయంత్రం నాలుగు గంటలకు భేటీ అవనున్నారు. రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా ఢిల్లీ వెళ్లనున్నారు.
Telangana CM Revanth Reddy Delhi Tour: తెలంగాణ (Telangana)ముఖ్యమంత్రి ( Chief Minister) రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఢిల్లీ (Delhi ) చేరుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(PM Narendra Modi)తో సాయంత్రం నాలుగు గంటలకు భేటీ అవనున్నారు. రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా ఢిల్లీ వెళ్లనున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టిన తర్వాత తర్వాత తొలిసారి ప్రధాని మోడీని సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కలు కలవనుండటంతో ప్రాధాన్యత ఏర్పడింది. పెండింగ్ లో ప్రాజెక్టులు, రాష్ట్ర విభజన సమస్యలు, నిధులు, అభివృద్ధి ప్రాజెక్టుల గురించే చర్చించనున్నట్లు కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. గొంతు నొప్పితో బాధ పడుతున్న రేవంత్ రెడ్డి, ప్రధానితో ముందే ఖరారు కావడంతో ఢిల్లీ వెళ్తున్నారు.
ఆర్‌ఆర్‌ఆర్‌తోపాటు ఇతర ప్రాజెక్టులకు కేంద్రం నుంచి రావాల్సిన నిధులపై విన్నవిస్తారని తెలుస్తోంది. ఎఫ్‌ఆర్‌బీఎం నిబంధనలను సడలించాలని మోడీ కోరనున్నట్లు సమాచారం. ఏపీ పునర్‌వ్యవస్థీకరణ చట్టం ప్రకారం తెలుగు రాష్ట్రాల మధ్య పలు సమస్యలు పెండింగులో ఉన్నాయి. 43 వేల కోట్ల రూపాయలు కేంద్రం నుంచి గ్రాట్ల రూపంలో రావాల్సి ఉంది. ఇప్పటి వరకు 5వేల కోట్లు మాత్రం కేంద్రం విడుదల చేసింది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని ప్రధాని మోడీ కోరనున్నారు సీఎం రేవంత్ రెడ్డి.
ప్రధానితో భేటీ ముగిసిన తర్వాత కాంగ్రెస్ అగ్రనేతలను రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క కలవనున్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, కెసి వేణుగోపాల్ వంటి నేతలను కలవనున్నట్లు తెలుస్తోంది. పార్టీ అగ్రనేతలతో నామినేటెడ్ పదవుల భర్తీ, పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, ఆరు గ్యారెంటీల అమలు వంటి కీలకాంశాలను ముఖ్యమంత్రి చర్చించనున్నట్లు సమాచారం.
ముఖ్యమంత్రితో ఫాక్స్ కాన్ ప్రతినిధి బృందం భేటీ
ఢిల్లీ బయల్దేరక ముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో తెలంగాణ సచివాలయంలో ఫాక్స్ కాన్ ప్రతినిధులు సమావేశమయ్యారు. హాన్ హాయ్ ప్రెసిషన్ ఇండస్ట్రీస్ ప్రతినిధి వీ లీ నేతృత్వంలోని ప్రతినిధి బృందం రేవంత్ సమావేశమైంది. ఈ సమావేశంలో రాష్ట్ర ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు, సీఎస్ శాంతికుమారి, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ భేటీలో ఫాక్స్ కాన్ ప్రతినిధులో మాట్లాడిన సీఎం... ప్రజాకాంక్షలకు అనుగుణంగా అన్ని వర్గాలతో స్నేహపూర్వక వాతావరణం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.
పారిశ్రామికవేత్తలు ఎవరూ భయపడాల్సిన పని లేదని భరోసా ఇచ్చారు రేవంత్. వారికి పూర్తిగా సహకరిస్తామని అన్నారు. పరిశ్రమల ఏర్పాటు, విస్తరణ కోసం త్వరిగతిన అనుమతు వచ్చేల విధానం తీసుకొస్తామని వివరించారు రేవంత్. మౌలిక వసతుల కల్పనలో కూడా అన్ని రాష్ట్రాల కంటే మెరుగ్గా అందజేస్తామని తెలియజేశారు.