అన్వేషించండి

Revanth Reddy Police Martyrs Day: మిగతా మావోయిస్టులు కూడా లొంగిపోయి, జన జీవన స్రవంతిలో కలవాలి: రేవంత్ రెడ్డి

Telangana CM Revanth Reddy | రౌడీ షీటర్ రియాజ్ దాడిలో చనిపోయిన నిజామాబాద్ కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం అండగా నిలిచింది. కోటి పరిహారం, ఇంటి స్థలం, మరింత సాయం ప్రకటించారు.

Police Martyrs Day In Hyderabad | హైదరాబాద్: అజ్ఞాతంలో ఉన్న మిగిలిన మావోయిస్టులు కూడా జనజీవన స్రవంతిలో కలిసిపోవాలని, తద్వారా దేశ అభివృద్ధిలో  భాగస్వామ్యులు కావాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. గోషామహల్‌ పోలీసు గ్రౌండ్స్‌లో పోలీసు అమరవీరుల సంస్మరణ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి పోలీసులపై ప్రశంసలు కురిపించారు. పోలీస్ అంటే సమాజానికి ఒక నమ్మకం, భరోసా అని, విధి నిర్వహణలో ఒక్కోసారి ప్రాణాలను సైతం పణంగా పెట్టాల్సి వచ్చినా పోలీస్ వెనుకడుగు వేయడన్నారు. ఒకవైపు నెత్తురు చెందుతున్నా, ప్రజల రక్షణ కోసం ప్రాణాలు అర్పించిన వీరులు ఎందరో ఉన్నారని.. విధి నిర్వహణలో దేశం కోసం ప్రాణాలు అర్పించిన ఎందరో పోలీసు అమర వీరులను స్మరించు కోవడం మనందరి కర్తవ్యం అన్నారు. మనకున్న బాధ్యతతతోనే దేశవ్యాప్తంగా ప్రతీ సంవత్సరం ‘అక్టోబరు 21’న“పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవంగా ఘనంగా నిర్వహించుకుంటున్నాం అన్నారు.

దేశం కోసం పోలీసుల ప్రాణత్యాగాలు

పోలీసు అమరవీరులను స్మరించుకునే రోజు అక్టోబర్ 21కి మహోన్నత చరిత్ర ఉంది. ఆనాటి నుంచి ఈనాటి వరకు ఎందరో పోలీసులు దేశం కోసం ప్రాణ త్యాగం చేశారు. వారందరికీ పేరు పేరునా హృదయపూర్వక శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను. ఈ సంవత్సరం దేశవ్యాప్తంగా 191 మంది పోలీస్ సిబ్బంది, తెలంగాణ రాష్ట్రంలో ఆరుగురు పోలీసులు విధి నిర్వహణలో ప్రాణాలను అర్పించారు. గ్రేహౌండ్స్ కమాండోలు.. టి. సందీప్, వి.శ్రీధర్, ఎన్. పవన్ కళ్యాణ్లు సంఘవిద్రోహ శక్తులతో పోరాడుతూ వీరమరణం చెందారు. అసిస్టెంట్ కమాండెంట్ బానోతు జవహర్లాల్, నల్గొండ కానిస్టేబుల్ బి.సైదులు విధినిర్వహణలో మరణించారు. 


Revanth Reddy Police Martyrs Day: మిగతా మావోయిస్టులు కూడా లొంగిపోయి, జన జీవన స్రవంతిలో కలవాలి: రేవంత్ రెడ్డి

నిజామాబాద్ కానిస్టేబుల్ కుటుంబానికి పరిహారం, ఇంటి స్థలం

మూడు రోజుల కింద నిజామాబాద్ లో సిసిఎస్ కానిస్టేబుల్ ఎంపల్లి ప్రమోద్ కుమార్ విధి నిర్వహణలో వీర మరణం చెందారు. భర్త ప్రమోద్ ను పోగొట్టుకున్న అతని భార్య ప్రణీతకు, అతి చిన్న వయసులోనే తండ్రిని కోల్పోయిన అతని ముగ్గురు కుమారులకు, వారి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుంది. ఒక కోటి రూపాయలు ఎక్స్ గ్రేషియా, అమరుడైన కానిస్టేబుల్ పదవీ విరమణ వరకు లాస్ట్ పే డ్రాన్ సాలరీ తో పాటు కుటుంబ సభ్యులలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, 300 గజాల ఇంటి స్థలం మంజూరు చేస్తున్నాం. వీటితోపాటు పోలీస్ భద్రత సంక్షేమం నుండి 16 లక్షల ఎక్స్ గ్రేషియా, పోలీస్ వెల్ఫేర్ నుండి 8 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా ను ప్రమోద్ కుటుంబానికి చెల్లించి వారి కుటుంబానికి అండగా ఉంటాం.


Revanth Reddy Police Martyrs Day: మిగతా మావోయిస్టులు కూడా లొంగిపోయి, జన జీవన స్రవంతిలో కలవాలి: రేవంత్ రెడ్డి
 
 29-06-2008 న ఒరిస్సాలో మావోయిస్టుల దాడిలో మరణించిన 33 మంది పోలీస్ కుటుంబాలకు గాజులరామారంలో 200 గజాల స్థలం కేటాయించాం. తెలంగాణ పోలీస్ శాఖ అవలంబిస్తున్న విధానాలు, నూతన సాంకేతిక పరిజ్ఞానంతో రాష్ట్ర పోలీస్ శాఖ దేశంలోనే అగ్రస్థానంలో నిలవడం మా ప్రభుత్వానికి గర్వకారణం. ఇండియా జస్టిస్ రిపోర్ట్ 2025 ప్రకారం, దేశంలోనే తెలంగాణ పోలీస్ శాఖకు ప్రథమ స్థానం లభించింది. అదేవిధంగా, పాస్‌పోర్ట్‌ వెరిఫికేషన్ విధానంలోనూ  విదేశాంగ శాఖ నుంచి ప్రత్యేక అభినందనలు పొందింది. ఈ విజయాలు తెలంగాణ పోలీస్‌ సిబ్బంది నిరంతర కృషి, అంకితభావానికి నిదర్శనం. ఇలాగే, ప్రజల భద్రత, శాంతిని కాపాడుతూ, తెలంగాణ పోలీస్ శాఖ దేశంలోనే అగ్రస్థానంలో కొనసాగాలని ఆశిస్తున్నా.
 
తీవ్రవాదం, ఉగ్రవాదం, సంఘ విద్రోహ కార్యకలాపాలు, మతతత్వ ఆందోళనలు, వైట్ కాలర్ నేరాలు, మాదకద్రవ్యాలు, సైబర్ నేరాలు, కల్తీ ఆహారాలు, గుట్కాలు, మట్కాలు, ఇతర అసాంఘిక కార్యకలాపాలు రాష్ట్రంలో పెరగనివ్వకుండా అహర్నిశలు శ్రమిస్తూ తెలంగాణ పోలీసులు దేశానికే ఆదర్శంగా నిలిచారు. నేరం చేసి తప్పించుకోలేమన్న పరిస్థితిని సృష్టించడం ద్వారా ప్రజల విశ్వాసాన్ని పెంచిన తెలంగాణ పోలీస్‌ శాఖను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను.

తెలంగాణలో డ్రగ్స్ మహమ్మారిని పూర్తిగా నిర్మూలించే లక్ష్యంతో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ‘ఈగల్’ వింగ్ సమర్థవంతంగా తన బాధ్యతలు నిర్వర్తిస్తుంది. తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చాలి అనేది మా ప్రభుత్వ సంకల్పం. ఇందుకోసం పోలీస్ శాఖకు పూర్తి స్వేచ్ఛతోపాటు విస్తృత అధికారాలు ఇచ్చాం. డ్రగ్స్ దందా వెనక ఎంతటి వారున్నా వదిలిపెట్టొద్దు అనే ఆదేశాలను జారీ చేశాం. ఒకప్పటితో పోలీస్తే నేరాల స్వభావం మారుతోంది. సైబర్ నేరాలు, డిజిటల్ మోసాలు, మార్ఫింగ్ కంటెంట్, డ్రగ్స్, హ్యూమన్ ట్రాఫికింగ్ వంటి కొత్త తరహా నేరాలు పోలీసులకు సవాలుగా మారుతున్నాయి. 

సైబర్ క్రైమ్ పెరిగింది

మానవ నేరాలను మించి సైబర్ క్రైమ్ వార్తలు పత్రికల్లో ఎక్కువ కనిపిస్తున్నాయి. టెక్నాలజీ రూపంలో ఎదురవుతున్న సవాళ్లకు టెక్నాలజీతోనే తెలంగాణ పోలీసులు సమాధానం చెబుతున్న తీరు భేష్. సాంకేతికత వినియోగంలో తెలంగాణ పోలీసులు  అందరికంటే ముందంజలో ఉండటం మనకు గర్వకారణం. సైబర్ నేరాలను ఎదుర్కొనేందుకు డీజీపీ స్థాయి అధికారి ఆధ్వర్యంలో 'సైబర్ సెక్యూరిటీ బ్యూరో'ను ఏర్పాటు చేశాం. ఈ విభాగం అత్యంత సమర్ధవంతంగా విధులు నిర్వహిస్తూ దేశంలో ది బెస్ట్ గా నిలిచింది. సైబర్ నేరగాళ్ళను అరికట్టడానికి అంతర్ రాష్ట్ర ఆపరేషన్లు సైతం నిర్వహిస్తున్న తెలంగాణ పోలీసులకు యావత్ దేశం సెల్యూట్ చేస్తోంది.

తీవ్రవాదం, మావోయిస్టు కార్యకలాపాలు గతంలో రాష్ట్రంలో విస్తృతంగా జరిగేవి. కానీ నేడు పోలీస్‌ శాఖ చర్యల వల్ల శాంతి నెలకొంది. మావోయిస్టు ఉద్యమంలో ఉన్న అజ్ఞాత నాయకులను జనజీవన స్రవంతిలో కలవాలని విజ్ఞప్తి చేస్తున్నాను. ఇటీవల కొందరు మావోయిస్టు కీలక నాయకులు లొంగిపోయిన విషయం మీ అందరికీ తెలుసు. అజ్ఞాతంలో ఉన్న మిగిలిన మావోయిస్టులు కూడా జనజీవన స్రవంతిలో కలిసిపోవాలి. దేశాభివృద్ధిలో  భాగస్వామ్యులు కావాలి. 

మహిళా ఐపీఎస్‌లకు కీలక పదవులతో దేశానికి ఆదర్శం..
ప్రజా సంక్షేమం పట్ల నిబద్ధతతో పని చేసిన అధికారుల కృషిని మా ప్రభుత్వం గుర్తించింది. పోలీసు శాఖలోని పలు కీలక విభాగాల్లో అర్హత కలిగిన మహిళా ఐపీఎస్ అధికారులకు పోస్టింగులు ఇచ్చి దేశానికే ఆదర్శంగా నిలిచింది. తెలంగాణ పోలీసు అకాడమీ, జైళ్ల శాఖ, ఎస్ఐబీ, ఏసీబీ,  సీఐడీ, విజిలెన్స్, ఆర్మ్‌డ్ రిజర్వ్, సీసీఎస్, సైబర్ సెక్యూరిటీ బ్యూరోలకు మహిళా ఐపీఎస్‌ల సారధ్యం వహించడం మా ప్రభుత్వానికి గర్వకారణం. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ ఈ కీలక పోలీసు కమిషనరేట్లలో జోన్ డీసీపీలుగా ఏడుగురు మహిళా అధికారులే. రెండేసి కీలక విభాగాలను సైతం సమర్థవంతంగా నడిపిస్తున్న మహిళా ఐపీఎస్ అధికారులను చూసి తెలంగాణ గర్విస్తోంది.


Revanth Reddy Police Martyrs Day: మిగతా మావోయిస్టులు కూడా లొంగిపోయి, జన జీవన స్రవంతిలో కలవాలి: రేవంత్ రెడ్డి
 
పోలీసు ఉద్యోగమంటే కత్తి మీద సాము వంటిదే. పోలీసులకు ప్రతి క్షణం పరీక్షే, ప్రతి దినం పోరాటమే. ఒకవైపు నేరాల అదుపు, మరోవైపు నేరాల విచారణ, ట్రాఫిక్ నియంత్రణ, పగటి గస్తీ, రాత్రి గస్తీ, బందోబస్తు, VIP రక్షణ.. ఇలా సవాలక్ష బాధ్యతలతో విరామం లేకుండా పని చేస్తూ మనమందరం ప్రశాంతంగా జీవించేందుకు తమ జీవితాలను త్యాగం చేస్తుంటారు. ఇంతటి కఠినమైన సవాళ్లతో బాధ్యతలు నిర్వర్తిస్తున్న పోలీసులకు ఎటువంటి కష్టం రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది.  మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 16 వేల మంది కానిస్టేబుల్స్, ఎస్ఐలను రిక్రూట్ చేసింది.  రాజకీయ జోక్యం లేకుండా పోలీసులు స్వేచ్ఛగా విధులు నిర్వర్తించే పరిస్థితులు కల్పించాం.

తెలంగాణలో అత్యధిక నష్టపరిహారం
సంఘ విద్రోహ శక్తులు, తీవ్రవాదులు, ఉగ్రవాదుల దాడుల్లో వీరమరణం పొందిన లేదా గాయపడి, అంగవైకల్యం పొందిన పోలీసు అధికారులు, సిబ్బందికి, దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణలో అత్యధిక నష్టపరిహారం అందించాం. విధినిర్వహణలో వీరమరణం పొందిన పోలీసు కుటుంబాల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, ఇంటి స్థలం, వారి పిల్లలకు రెసిడెన్షియల్ స్కూళ్ళల్లో ఉచిత విద్య, వైద్యం, బస్ పాస్ సౌకర్యం తదితర పథకాలను అందజేస్తున్నాం. మెడికల్ సీట్ల లోను పోలీస్ అమరుల పిల్లలకు ప్రత్యేకంగా సీట్లను కేటాయిస్తున్నాం.

కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబానికి భారీ ఆర్థికసాయం
 
తీవ్రవాదుల, ఉగ్రవాదుల హింసలో చనిపోయిన వారికి అందించే ఎక్స్ గ్రేషియాను కానిస్టేబుల్ నుంచి ఏఎస్ఐల వరకు కోటి రూపాయలను, ఎస్సై సీఐలకు కోటి 25 లక్షల రూపాయలను, డీఎస్పీ, అడిషనల్ ఎస్పీలకు కోటి 50 లక్షల రూపాయలను, ఎస్పీలకు ఇతర ఐపీఎస్ అధికారులకు రెండు కోట్ల రూపాయలకు పెంచుతూ మా ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. మన ప్రాణానికి వారి ప్రాణాలను అడ్డుపెట్టే పోలీసుల రుణం ఏమిచ్చినా తీరదు. సమాజ శ్రేయస్సే ఊపిరిగా విధులు నిర్వర్తిస్తున్న పోలీసులకు అండగా నిలవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. ఆ బాధ్యతతోనే పోలీసు సిబ్బంది పిల్లలకు ప్రత్యేక విద్యా సంస్థలను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చాం. అందులో భాగంగా పోలీసుల పిల్లలకు అంతర్జాతీయ ప్రమాణాలతో నాణ్యమైన విద్యను అందించే ఉద్దేశంతో రంగారెడ్డి జిల్లా మంచిరేవులలో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ను ప్రారంభించాం. ఇందులో 50 శాతం సీట్లు పోలీస్ సిబ్బంది పిల్లలకు, మిగతా 50 శాతంసాధారణ పౌరుల పిల్లలకు కేటాయించాం. 

క్రీడాకారులకు ఉద్యోగాలిచ్చి గౌరవం

ఒలంపియన్, బాక్సర్ నిఖత్ జరీన్, వరల్డ్ కప్ విన్నర్ క్రికెటర్ మహమ్మద్ సిరాజ్ కు డీఎస్పీగా ఉద్యోగాలు ఇచ్చి తెలంగాణ పోలీసుల ప్రతిష్టతను పెంచాం.  పోలీస్ శాఖ గౌరవం పెరిగితే రాష్ట్ర ప్రతిష్ట పెరుగుతుంది. పోలీస్‌ శాఖ ఇదే పనితీరును కొనసాగిస్తూ దేశంలోనే అగ్రస్థానంలో నిలవాలని కోరుకుంటున్నాను. పారదర్శకత, జవాబుదారీతనం, నైతిక విలువలు పాటించడం పోలీసింగ్ కు మూల స్థంభాలు. ఇవే సమాజాన్ని పోలీసులకు దగ్గరికి చేయడంతోపాటు పోలీస్ శాఖపై నమ్మకాన్ని పెంపొందిస్తాయి. కాబట్టి పోలీసులు తమ వృత్తి నిర్వహణలో వీటిని పాటించడానికి ప్రయత్నించాలి. ప్రజల సమస్యల పరిష్కారం, నేరాల నిరోధం, పోలీస్ శాఖపై నమ్మకం పెంచేలా మీ బాధ్యతలు ఉండాలి. 

సమాజానికి దగ్గరగా ఉండే పోలీసింగ్ మోడల్ ను అనుసరించాలి.ముఖ్యంగా శరవేగంగా అభివృద్ధి చెందుతున్న తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రతలు అనేవి అత్యంత ప్రాధాన్యతో కూడిన అంశం. సోషల్ మీడియా ప్రభావం బాగా పెరిగిన ఈ కాలంలో పోలీసుల ప్రతి అడుగు, మాట జాగ్రత్తగా ఉండాలి. 'ఫ్రెండ్లీ పోలీసింగ్' అంటే చట్టాన్ని గౌరవించే పౌరుల కోసమే, చట్టాన్ని ఉల్లంఘించే వారికి కాదనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ప్రజాస్వామ్య పాలనలో ప్రజల హక్కులను కాపాడుతూ, వారి సమస్యలను తెలియజేసేందుకు చేపట్టే నిరసన కార్యక్రమాలకు పోలీసులు అనుమతి ఇస్తూనే, ఈ సందర్భంలో సాధారణ ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఎంతో సున్నితంగా వ్యవహరించాలి. అమరవీరుల కుటుంబాలకు  ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని’ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Ind vs Sa 3rd t20 highlights: మూడో టీ20లో భారత్ ఘన విజయం.. బౌలర్లు భేష్, ఆపై అభిషేక్ తుఫాన్ ఇన్నింగ్స్
మూడో టీ20లో భారత్ ఘన విజయం.. బౌలర్లు భేష్, ఆపై అభిషేక్ తుఫాన్ ఇన్నింగ్స్
Trending Jobs In 2025: ఈ ఉద్యోగాలకు ఏడాది పొడవునా డిమాండ్.. మార్కెట్లో ఈ రంగాలకు తగ్గని ఆదరణ
ఈ ఉద్యోగాలకు ఏడాది పొడవునా డిమాండ్.. మార్కెట్లో ఈ రంగాలకు తగ్గని ఆదరణ
Sahana Sahana Song : 'ది రాజా సాబ్' నుంచి కూల్ మెలోడి సాంగ్ - 'సహానా సహానా' ప్రోమో చూశారా?
'ది రాజా సాబ్' నుంచి కూల్ మెలోడి సాంగ్ - 'సహానా సహానా' ప్రోమో చూశారా?
CM Revanth Reddy: తెలంగాణ అంటే ఎక్సలెన్స్, ఆతిథ్యం.. మెస్సీ అండ్ టీంకు సీఎం రేవంత్ థ్యాంక్స్
తెలంగాణ అంటే ఎక్సలెన్స్, ఆతిథ్యం.. మెస్సీ అండ్ టీంకు సీఎం రేవంత్ థ్యాంక్స్
Advertisement

వీడియోలు

భారతదేశంలోనే అత్యంత విచిత్రమైన ఆచారాలు పాటించే ఉడిపి శ్రీకృష్ణ మందిరం
Abhishek Sharma to Break Virat Record | కోహ్లీ అరుదైన రికార్డుపై కన్నేసిన అభిషేక్
India vs South Africa 3rd T20 | భారత్ x సౌతాఫ్రికా మూడో టీ20
Robin Uthappa on Gambhir Ind vs SA | గంభీర్ పై ఉత్తప్ప కామెంట్స్
Suryakumar Yadav Form in SA T20 Series | సూర్య కుమార్ యాదవ్ పై ట్రోల్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ind vs Sa 3rd t20 highlights: మూడో టీ20లో భారత్ ఘన విజయం.. బౌలర్లు భేష్, ఆపై అభిషేక్ తుఫాన్ ఇన్నింగ్స్
మూడో టీ20లో భారత్ ఘన విజయం.. బౌలర్లు భేష్, ఆపై అభిషేక్ తుఫాన్ ఇన్నింగ్స్
Trending Jobs In 2025: ఈ ఉద్యోగాలకు ఏడాది పొడవునా డిమాండ్.. మార్కెట్లో ఈ రంగాలకు తగ్గని ఆదరణ
ఈ ఉద్యోగాలకు ఏడాది పొడవునా డిమాండ్.. మార్కెట్లో ఈ రంగాలకు తగ్గని ఆదరణ
Sahana Sahana Song : 'ది రాజా సాబ్' నుంచి కూల్ మెలోడి సాంగ్ - 'సహానా సహానా' ప్రోమో చూశారా?
'ది రాజా సాబ్' నుంచి కూల్ మెలోడి సాంగ్ - 'సహానా సహానా' ప్రోమో చూశారా?
CM Revanth Reddy: తెలంగాణ అంటే ఎక్సలెన్స్, ఆతిథ్యం.. మెస్సీ అండ్ టీంకు సీఎం రేవంత్ థ్యాంక్స్
తెలంగాణ అంటే ఎక్సలెన్స్, ఆతిథ్యం.. మెస్సీ అండ్ టీంకు సీఎం రేవంత్ థ్యాంక్స్
Movie Shootings Famous Tree: సినిమా చెట్టు బతికిందోచ్.. ప్రాణం పెట్టి కాపాడితే రిజల్ట్ ఎలా ఉందో చూశారా..
సినిమా చెట్టు బతికిందోచ్.. ప్రాణం పెట్టి కాపాడితే రిజల్ట్ ఎలా ఉందో చూశారా..
Hardik Pandya Records: చరిత్ర సృష్టించిన హార్దిక్ పాండ్యా.. ప్రపంచంలో తొలి ఆల్ రౌండర్‌గా అరుదైన ఘనత
చరిత్ర సృష్టించిన హార్దిక్ పాండ్యా.. ప్రపంచంలో తొలి ఆల్ రౌండర్‌గా అరుదైన ఘనత
Ind u19 vs Pak u19 highlights: ఆసియా కప్‌లో పాకిస్తాన్‌ను చిత్తు చేసిన భారత్.. 90 పరుగులతో ఘన విజయం
ఆసియా కప్‌లో పాకిస్తాన్‌ను చిత్తు చేసిన భారత్.. 90 పరుగులతో ఘన విజయం
Itlu Arjuna Teaser : ప్రొడ్యూసర్‌గా మారిన డైరెక్టర్ - కింగ్ నాగార్జున వాయిస్ ఓవర్... ఇంట్రెస్టింగ్‌గా 'ఇట్లు అర్జున' టీజర్
ప్రొడ్యూసర్‌గా మారిన డైరెక్టర్ - కింగ్ నాగార్జున వాయిస్ ఓవర్... ఇంట్రెస్టింగ్‌గా 'ఇట్లు అర్జున' టీజర్
Embed widget