(Source: ECI/ABP News/ABP Majha)
BRS Leaders: "బండి సంజయ్, రేవంత్ లు పోటీ పడి మరి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని తిడుతున్నారు"
BRS Leaders: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిలపై.. ప్రభుత్వ విప్ లు గువ్వల బాలరాజు, రేగా కాంతారావులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
BRS Leaders: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు ప్రభుత్వ విప్ లు గువ్వల బాలరాజు, రేగా కాంతారువులు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిలు సీఎం కేసీఆర్ పై నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని గువ్వల బాలరాజు అన్నారు. ఏ మంచి పని చేసినా బండి సంజయ్ అడ్డం పడుతున్నాడని ఆరోపించారు. నిత్యం వార్తల్లో నిలవడానికి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. కొండగట్టు అభివృద్ధి కోసం వంద కోట్ల నిధులు విడుదల చేస్తే.. సీఎం కేసీఆర్ బంధువుల కోసమే నిధులు విడుదల చేశారని బండి అన్నట్లు వివరించారు. ఇంతకన్నా అబద్ధం మరొకటి ఉంటుందా అని ప్రశ్నించారు. బండి సంజయ్ రాష్ట్రమంతా తిరిగేది భూముల కబ్జా కోసమే అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఉద్యోగ నోటిఫికేషన్లు ఇస్తే దాన్ని కూడా బండి తప్పు పడుతున్నారన్నారు. నోటిఫికేషన్లు ఇస్తే తమకు కార్యకర్తలు ఎట్లా అని బండి సంజయ్ వాపోతున్నారని విమర్శించారు. బీజేపీని పాతర వేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. సచివాలయం గుమ్మటాలు కూల్చాలని ఓ పార్టీకి అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి పిలుపు నిచ్చాడని గువ్వల బాలరాజు గుర్తు చేశారు.
కాంగ్రెస్, బీజేపీ అధ్యక్షులు ఉండాల్సింది పిచ్చాసుపత్రుల్లోనే
బండి సంజయ్ గుండు పగల గొట్టాలని ఆయన మెదడు బాగు చేయాలని యువత నిర్ణయానికి వచ్చారని అన్నారు. రాష్ట్రంలో అమలు అవుతున్న గిరిజన రిజర్వేషన్లపై కూడా బండికి సరైన సమాచారం లేదన్నారు. అబద్ధాల మీద అబద్దాలు ఆడుతున్నారని ఫైర్ అయ్యారు. ఒకరు కూలుస్తా, మరొకడు పేలుస్తా అంటున్నాడని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ర్మించే కేసీఆర్ యే తెలంగాణకు కావాలని ప్రజలు ఇప్పటికే నిర్ణయానికి వచ్చారని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్, బీజేపీ అధ్యక్షులు ఉండాల్సింది పిచ్చి ఆస్పత్రుల్లోనే అంటూ ఘాటుగా విమర్శించారు. వారిని చేర్పించేందుకు ఆ పార్టీ నాయకులే చొరవ చూపాలన్నారు. ఆప్ కీ బార్ కిసాన్ సర్కార్ నినాదం కచ్చితంగా సాకారం అవుతుందన్నారు. కేసీఆర్ బర్త్ డే వేడుకలు దేశమంతా ఘనంగా జరగబోతున్నాయని తెలిపారు. ఓడిపోయే వారే పొత్తుల గురించి మాట్లాడుతారని గువ్వల బాలరాజు అన్నారు. ప్రతిపక్ష పార్టీల నేతలు ఇకనైనా హుందాగా వ్యవహరించాలని సూచించారు. ప్రజాస్వామ్య బద్దంగా మాట్లాడాలన్నారు.
మణుగూరులో ముక్కు నేలకు రాయిస్తా..!
బండి సంజయ్, రేవంత్ రెడ్డి తిట్లలో పోటీ పడుతున్నారని ప్రభుత్వ విప్ రేగా కాంతారావు అన్నారు. ఈ తిట్లతో అధికారం రాదని చెప్పారు. వారికి తిట్లు తప్ప ఎజెండా లేదని విమర్శించారు. రేవంత్ రెడ్డి తన మీద చార్జీషీట్ విడుదల చేశాడన్నారు. ఆయన మీటింగ్ కు 3 వేల మంది జనం కూడా రాలేదని తెలిపారు. తాను 300 ఎకరాలను అక్రమంగా సంపాదించానని ఎవరైనా నిరూపిస్తే.. మణుగూరు చౌరస్తాలో ముక్కు నేలకు రాస్తానని స్పష్టం చేశారు. నిరూపించక పోతే ఆరోపణలు చేసిన వారు ముక్కు నేలకు రాయాలని రేగా కాంతారావు అన్నారు. చార్జీ షీట్ లో పేర్కొన్న ఏ ఒక్క అంశాన్ని నిరూపించినా నేను వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని తెలిపారు. గాలి మాటలకు ఓట్లు రాలవని.. తన కులాన్ని కూడా రేవంత్ కించపరిచాడన్నారు. తాను తలచుకుంటే రేవంత్ తన నియోజకవర్గంలో మీటింగ్ పెట్టేవాడా అని ప్రశ్నించారు.