News
News
X

Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీ నిరవధిక వాయిదా - పలు బిల్లులు, తీర్మానాలపై చర్చ

Telangana Budget 2023 Session: సీఎం కేసీఆర్ సుదీర్ఘ ప్రసంగం ముగిసిన తరువాత స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి తెలంగాణ అసెంబ్లీని నిరవధిక వాయిదా వేశారు.

FOLLOW US: 
Share:

హైదరాబాద్‌ : తెలంగాణ శాసన సభ సమావేశాలు ఆదివారం సాయంత్రం ముగిశాయి. సీఎం కేసీఆర్ సుదీర్ఘ ప్రసంగం ముగిసిన తరువాత స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి తెలంగాణ అసెంబ్లీని నిరవధిక వాయిదా వేశారు. ఈ నెల 3న తెలంగాణ బడ్జెట్‌ సమావేశాలు గర్నవర్‌ తమిళిసై ప్రసంగంతో మొదలైన తాజా సెషన్ 12వ తేదీన ముగిసింది. ఈసారి బడ్జెట్‌ సమావేశాలు మొత్తం 56 గంటల 25 నిమిషాల పాటు కొనసాగాయి. 

ఫిబ్రవరి 3న బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాగా.. ఈ నెల 6న ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు రాష్ట్ర అసెంబ్లీలో తెలంగాణ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. రూ.2.90 లక్షల కోట్ల మేర 2023 -24 వార్షిక బడ్జెట్ ను తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఆ మరుసటి రోజు గవర్నర్‌ తమిళిసై ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై సభలో చర్చ జరిగింది. తాజా సమావేశాల చివరి రోజైన ఆదివారం ఆర్థికమంత్రి హరీష్ రావు ద్రవ్య వినియమ బిల్లును ప్రవేశపెట్టారు. ఈ సమావేశాలలో పలు బిల్లులు, తీర్మానాలు, తెలంగాణ బడ్జెట్ కేటాయింపులు, నిధుల వినియోగం, ఖర్చులపై కీలకంగా చర్చ సాగింది. ప్రశ్నోత్తరాల్లో భాగంగా సమీకృత వ్యవసాయ మార్కెట్లు, పంట రుణాల మాఫీ, బస్తీ దవాఖానాలు, గురుకులాలు, హరితవనాలు, పునరుత్పాదక ఇంధన వనరులు, అక్షరాస్యత తదితర అంశాలపై సంబంధిత నేతలు సమాధానాలు ఇచ్చారు. ఆదివారం ద్రవ్య వినిమయ బిల్లును మంత్రి హరీష్ రావు ప్రవేశపెట్టారు. బిల్లుపై చర్చ అనంతరం సీఎం కేసీఆర్‌ సమాధానం ఇచ్చారు.

ప్రతి ఇంటికి కృష్ణా, గోదావరి జలాలు వస్తున్నాయని.. బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే దేశంలో ప్రతి రాష్ట్రంలో నీటి సమస్య లేకుండా చేస్తామన్నారు కేసీఆర్. రాష్ట్రంలో కాలువల్లో నీళ్లు ఎలా పారుతున్నాయో... రేపు ఎన్నికల్లో కూడా ఓట్లు పారుతాయని అసెంబ్లీ వేదికగా సీఎం కేసీఆర్‌ వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వ విధానాలను సభలో ఎండగట్టారు కేసీఆర్. దేశంలో రాజకీయ మార్పులు ఎందుకు అవసరం ఉందన్నది పలు విషయాలను ప్రస్తావిస్తూ తన ప్రసంగంలో వివరించారు. అనంతరం శాసనసభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు అసెంబ్లీ స్పీకర్‌ పోచారం శ్రీనివాసరెడ్డి ప్రకటించారు.

మోదీ గెలిచారు, దేశం ఓడింది 
"మన్మోహన్ సింగ్ బాగా పనిచేసినా బీజేపీ బద్నాం చేసింది. మోదీ కంటే మన్మోహన్‌సింగ్ ఎక్కువ పనిచేశారు. కాంగ్రెస్ బాగా పనిచేయలేదని 2014లో మోదీకి ఓటేశారు. పెనంపై నుంచి పొయ్యిలో పడ్డట్టు అయ్యింది. మోదీ గెలిచారు దేశం ఓడింది. మన్మోహన్‌ కన్నా మోదీ పాలనలో దేశం ఎక్కువ నష్టపోయింది. ఎప్పుడో చనిపోయిన నెహ్రూ, ఇందిరాగాంధీ పేర్లతో రాజకీయమేంది?  నువ్వెన్ని ప్రభుత్వాలు కూలగొట్టావంటే నువ్వెన్ని అంటూ మోదీ, రాహుల్‌ గొడవపడుతున్నారు. దేశం పరిస్థితి క్రిటికల్‌గా ఉంటే మోదీ మాట్లాడరు. కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు అన్యాయం జరిగింది. దేశంలో 157 మెడికల్ కాలేజీలు ఇస్తే తెలంగాణకు ఒక్కటి కూడా రాలేదు. ఇదేనా ఫెడరల్ వ్యవస్థ?. మనకు రావాల్సిన రూ.470 కోట్లు ఏపీకి ఇచ్చారు. మావి మాకు ఇవ్వాలని ఏడేళ్ల నుంచి అడుగుతున్నాం. పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్న మోదీ దిల్లీకి కూడా నీళ్లు ఇవ్వడం లేదు. పరిశ్రమలు మూతబడుతున్నాయ్.. బీజేపీ అధికారంలోకి వచ్చాక 20 లక్షల మంది దేశ పౌరసత్వాన్ని వదిలేశారు. ఇంత దౌర్భాగ్య పరిస్థితి ఎందుకు వచ్చింది?" -సీఎం కేసీఆర్

Published at : 12 Feb 2023 07:14 PM (IST) Tags: Telangana Budget Telangana Telangana Budget 2023 TS Assembly Adjourne Sine Die

సంబంధిత కథనాలు

Bhatti Vikramarka Padayatra : టీఎస్పీఎస్పీ పేపర్ల లీకేజీకి బాధ్యత వహిస్తూ సీఎం కేసీఆర్ రాజీనామా చేయాలి - భట్టి విక్రమార్క

Bhatti Vikramarka Padayatra : టీఎస్పీఎస్పీ పేపర్ల లీకేజీకి బాధ్యత వహిస్తూ సీఎం కేసీఆర్ రాజీనామా చేయాలి - భట్టి విక్రమార్క

TS TOSS Exam Schedule: తెలంగాణ ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షల షెడ్యూలు విడుదల - పరీక్షల తేదీలివే!

TS TOSS Exam Schedule: తెలంగాణ ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షల షెడ్యూలు విడుదల - పరీక్షల తేదీలివే!

Minister Errabelli : పేపర్ లీక్ పై పిచ్చి పిచ్చి ఆరోపణలు, దమ్ముంటే నిరూపించండి - బండి సంజయ్, రేవంత్ రెడ్డికి మంత్రి ఎర్రబెల్లి సవాల్

Minister Errabelli : పేపర్ లీక్ పై పిచ్చి పిచ్చి ఆరోపణలు, దమ్ముంటే నిరూపించండి - బండి సంజయ్, రేవంత్ రెడ్డికి మంత్రి ఎర్రబెల్లి సవాల్

రైతులపై కేసీఆర్ ది ఎన్నికల ప్రేమ, మీరిచ్చే రూ.10 వేలు ఏ మూలకు సరిపోతాయి - వైఎస్ షర్మిల

రైతులపై కేసీఆర్ ది ఎన్నికల ప్రేమ,  మీరిచ్చే రూ.10 వేలు ఏ మూలకు సరిపోతాయి - వైఎస్ షర్మిల

Minister Vemula Prashanth Reddy : కేసీఆర్ ను కట్టడి చేయాలని కవితపై కేసుల వేధింపులు- మంత్రి వేముల

Minister Vemula Prashanth Reddy : కేసీఆర్ ను కట్టడి చేయాలని కవితపై కేసుల వేధింపులు- మంత్రి వేముల

టాప్ స్టోరీస్

YSRCP Reverse : దెబ్బ మీద దెబ్బ - వ్యూహాత్మక తప్పిదాలే వైఎస్ఆర్‌సీపీకి నష్టం చేస్తున్నాయా ?

YSRCP Reverse :   దెబ్బ మీద దెబ్బ  - వ్యూహాత్మక తప్పిదాలే వైఎస్ఆర్‌సీపీకి నష్టం చేస్తున్నాయా ?

MIW Vs UPW Highlights: యూపీని ఎలిమినేటర్‌లోనే ఆపేసిన ముంబై - 72 పరుగుల విజయంతో ఫైనల్లోకి ఎంట్రీ!

MIW Vs UPW Highlights: యూపీని ఎలిమినేటర్‌లోనే ఆపేసిన ముంబై - 72 పరుగుల విజయంతో ఫైనల్లోకి ఎంట్రీ!

AP Cag Report : 13.99 శాతం వడ్డీకి అప్పులు తెస్తున్న ఏపీ సర్కార్ - కాగ్ రిపోర్టులో సంచలన విషయాలు

AP Cag Report :  13.99 శాతం వడ్డీకి అప్పులు తెస్తున్న ఏపీ సర్కార్ - కాగ్ రిపోర్టులో సంచలన విషయాలు

Jio IPL Plans: రూ.219కే రోజూ 3 జీబీ డేటా - అదనంగా 2 జీబీ కూడా - ఐపీఎల్ ముందు జియో కొత్త ప్లాన్లు!

Jio IPL Plans: రూ.219కే రోజూ 3 జీబీ డేటా - అదనంగా 2 జీబీ కూడా - ఐపీఎల్ ముందు జియో కొత్త ప్లాన్లు!