News
News
వీడియోలు ఆటలు
X

Vijayashanti: బీఆర్ఎస్ అంటే ఆ పార్టీలకు భయం పట్టుకుంది: విజయశాంతి

Vijayashanti: బీఆర్ఎస్ పార్టీ పేరు చెబితే కొన్ని పార్టీలు భయపడుతున్నాయని బీజేపీ నాయకురాలు విజయశాంతి అన్నారు.

FOLLOW US: 
Share:

Vijayashanti: భారతీయ రాష్ట్ర సమితి - బీఆర్ఎస్ పేరు చెబితే మిగతా రాష్ట్రాల రాజకీయ పార్టీలు భయపడుతున్నాయని.. ఏం చెయ్యాలో పాలుపోని పరిస్థితిలో ఉన్నాయని బీజేపీ నాయకురాలు విజయశాంతి అన్నారు. గురువారం ట్విట్టర్ వేదికగా స్పందించిన విజయశాంతి బీఆర్ఎస్ పార్టీపై విమర్శలు గుప్పించారు. మహారాష్ట్రలో ఒక చిన్న రైతు సంఘం ఎన్నికలకు కూడా కోట్ల రూపాయలు పంచి అదే స్థాయిలో ముందెన్నడూ అక్కడ లేని విధంగా ఇతర రాజకీయ పార్టీలు డబ్బు పంపిణీ చేయ్యాల్సిన దుర్మార్గ పరిస్థితిని తీసుకువచ్చారని మండిపడ్డారు. మున్ముందు దేశం అంతటా ఇదే రకం వ్యవస్థను బీఆర్ఎస్ పార్టీ పేరుతో తీసుకువస్తారని అన్నారు. తెలంగాణలో దోపిడీ చేసిన లక్షల కోట్ల అవినీతి ధనం అండతో దేశంలోని అన్ని పార్టీల ఎన్నికలకు అయ్యే ఖర్చును తామే భరిస్తామని కేసీఆర్ వెళ్తున్న విధానం, మొత్తం భారత ప్రజాస్వామ్య వ్యవస్థనే అవహేళన చేస్తుందని అన్నారు. ఇది నియంతృత్వ ప్యూడల్ ధోరణికి దారి తీస్తున్న పరిస్థితి కావొచ్చేమోనని ట్వీట్ లో పేర్కొన్నారు. 

అటు ఆంధ్రప్రదేశ్ లో జనసేన పార్టీని కూడా వెయ్యి కోట్ల ప్రలోభంతో మోసగించి దెబ్బ తియ్యాలనే ప్రయత్నాన్ని కొన్ని పత్రికలు వార్తలుగా ఇచ్చాయని తెలిపారు. ఇక అవినీతి వ్యతిరేకంగా అన్నా హజారే స్ఫూర్తితో పుట్టిన ఆమ్ ఆద్మీ పార్టీకి బీఆర్ఎస్ కుటుంబం ఢిల్లీ, పంజాబ్ లలో తెచ్చిపెట్టిన స్కాముల సమస్యతో ఆప్ అసలుకే నాశనం అయ్యేట్లు అనిపిస్తోందని విజయశాంతి ట్వీట్ చేశారు. 

"బీఆర్ఎస్ పేరు చెబితే భయపడుతున్న మిగతా రాష్ట్రాల రాజకీయ పార్టీలు.. ఏం చెయ్యాలో పాలుపోని పరిస్థితి.. మహారాష్ట్రలో ఒక చిన్న రైతు సంఘం ఎన్నికలకు కూడా కోట్ల రూపాయలు పంచి ఒక్క స్థానం కూడా గెలవక ఓడిపోయినప్పటికీ.. అదే స్థాయిలో ముందెన్నడూ అక్కడ లేని విధంగా ఇతర రాజకీయ పార్టీలు డబ్బు పంపిణీ చెయ్యవలసిన దుర్మార్గాన్ని తయారు చేసి, రేపటి రోజు దేశమంతా ఇదే భ్రష్టాచార వ్యవస్థను బీఆరెస్ పేరుతో, తెలంగాణలో దోపిడీ చెయ్యబడ్డ లక్షల కోట్ల అవినీత ధన తోడ్పాటుతో దేశంలోని అన్ని పార్టీల ఎన్నికల ఖర్చు మేమే భరిస్తామని కేసీఆర్ గారు వెళ్తున్న విధానం, మొత్తం భారత ప్రజాస్వామ్య వ్యవస్థనే అవహేళన చేసి, నియంతృత్వ ఫ్యూడల్ ధోరణికి దారి చేస్తున్న పరిస్థితి కావచ్చేమో అని తప్పక అనిపిస్తున్నది.

ఇది చాలదన్నట్లు ఏపీలో జనసేన వంటి పోరాడే పార్టీని కూడా వెయ్యి కోట్ల ప్రలోభంతో (జనసేన అసహ్యించుకుని స్పందించనప్పటికీ..) మోసగించి దెబ్బ తియ్యాలనే మీ ప్రయత్నం ఆంధ్రజ్యోతి వంటి అగ్రశ్రేణి దినపత్రికలలో వార్తలుగా వచ్చింది. ఇక అవినీతికి వ్యతిరేకంగా అన్నా హజారే స్ఫూర్తితో పుట్టిన ఆమ్ ఆద్మీ పార్టీకి మీ బీఆరెస్ కుటుంబం ఢిల్లీ, పంజాబ్‌లలో తెచ్చిపెట్టిన స్కాంల సమస్యతో ఆప్ అసలుకే నాశనమయ్యేట్లు అనిపిస్తున్నది నేటి.. రేపటి నిజం"
- విజయశాంతి

Published at : 04 May 2023 06:19 PM (IST) Tags: Vijayashanti BRS Telangana News Telangana Politics Bjp leader

సంబంధిత కథనాలు

YS Viveka Murder Case: వైఎస్‌ భాస్కర్‌రెడ్డి అభ్యర్థనకు సీబీఐ కోర్టు ఓకే, ప్రత్యేక కేటగిరీ ఖైదీగా ఎంపీ అవినాష్ తండ్రి

YS Viveka Murder Case: వైఎస్‌ భాస్కర్‌రెడ్డి అభ్యర్థనకు సీబీఐ కోర్టు ఓకే, ప్రత్యేక కేటగిరీ ఖైదీగా ఎంపీ అవినాష్ తండ్రి

TSPSC Paper Leakage: నిందితుడు డీఈ రమేష్ కస్టడీ కోరుతూ నాంపల్లి కోర్టును ఆశ్రయించిన సిట్

TSPSC Paper Leakage: నిందితుడు డీఈ రమేష్ కస్టడీ కోరుతూ నాంపల్లి కోర్టును ఆశ్రయించిన సిట్

Telangana Formation Day: తెలంగాణ ప్రజలను అందరూ మోసం చేస్తే, సోనియా వారి బాధను అర్థం చేసుకున్నారు: మీరా కుమార్

Telangana Formation Day: తెలంగాణ ప్రజలను అందరూ మోసం చేస్తే, సోనియా వారి బాధను అర్థం చేసుకున్నారు: మీరా కుమార్

Bandi Sanjay: రేవంత్ రెడ్డిలా డబ్బులు పంచడం, పార్టీలు మారడం నాకు చేతకాదు: బండి సంజయ్ సెటైర్లు

Bandi Sanjay: రేవంత్ రెడ్డిలా డబ్బులు పంచడం, పార్టీలు మారడం నాకు చేతకాదు: బండి సంజయ్ సెటైర్లు

Hyderabad Accident: హైదరాబాద్ లో కారు డ్రైవర్ నిర్లక్ష్యానికి రెండేళ్ల పాప మృతి, డోర్ తీయడంతో విషాదం

Hyderabad Accident: హైదరాబాద్ లో కారు డ్రైవర్ నిర్లక్ష్యానికి రెండేళ్ల పాప మృతి, డోర్ తీయడంతో విషాదం

టాప్ స్టోరీస్

Ahimsa Movie Review - 'అహింస' రివ్యూ : చీమకు హాని చేయనోడు వందల మందిని నరికితే? రానా తమ్ముడి సినిమా ఎలా ఉందంటే?

Ahimsa Movie Review - 'అహింస' రివ్యూ : చీమకు హాని చేయనోడు వందల మందిని నరికితే? రానా తమ్ముడి సినిమా ఎలా ఉందంటే?

24 శాతం వడ్డీకి కోట్లాది రూపాయలు అప్పు చేసి ‘బాహుబలి’ తీశాం: రానా

24 శాతం వడ్డీకి కోట్లాది రూపాయలు అప్పు చేసి ‘బాహుబలి’ తీశాం: రానా

Tata Altroz CNG: దేశంలోనే అత్యంత చవకైన సన్‌రూఫ్ కారు లాంచ్ చేసిన టాటా - రూ.8 లక్షల లోపే!

Tata Altroz CNG: దేశంలోనే అత్యంత చవకైన సన్‌రూఫ్ కారు లాంచ్ చేసిన టాటా - రూ.8 లక్షల లోపే!

Narasimha Naidu Re Release : బాలకృష్ణ బర్త్ డేకు 'నరసింహ నాయుడు' రీ రిలీజ్

Narasimha Naidu Re Release : బాలకృష్ణ బర్త్ డేకు 'నరసింహ నాయుడు' రీ రిలీజ్